‘కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు ఉండదు’ | AP Deputy CM Chinarajappa No Alliances With Congress In AP | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు ఉండదు’

Sep 9 2018 2:08 PM | Updated on Mar 18 2019 7:55 PM

AP Deputy CM Chinarajappa No Alliances With Congress In AP - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు ఉండదని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణతో అనేక విభేదాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పొత్తుపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలకే నిర్ణయాన్ని అప్పగించారని తెలిపారు.

చంద్రబాబుపై 24 కేసులు పెండింగ్‌ ఉన్నాయని, కోర్టులు స్టే విధించాయని పేర్కొన్నారు. ఏపీలో పోలీసులు సరిగా పనిచేయలేదన్న జేసీ దివాకర్‌ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. దివాకర్‌ రెడ్డికి కాంగ్రెస్‌ వాసన పోలేదని ఎద్దేవా చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను తామే ప్రోత్సహించామని చెప్పారు. చంద్రబాబుకు సీబీఐ నోటీసులు కేవలం ఊహాగానాలేనన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement