సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభం వాయిదా | AP CM camp office opening on june 8th, says Devinani uma | Sakshi
Sakshi News home page

సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభం వాయిదా

Jun 6 2015 12:28 PM | Updated on Mar 23 2019 8:59 PM

సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభం వాయిదా - Sakshi

సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభం వాయిదా

విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభ కార్యక్రమం వాయిదా పడింది.

విజయవాడ: విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభ కార్యక్రమం వాయిదా పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు దంపతులు శనివారం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో రాజధానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభించేందుకు విజయవాడ వెళ్లవలసి ఉంది.

అయితే సమయాభావం వల్ల ఆ కార్యక్రమం వాయిదా వేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. సీఎం క్యాంపు కార్యాలయ ప్రారంభ కార్యక్రమం జూన్ 8వ తేదీన నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. అలాగే ఇకపై వారానికి 5 రోజులు విజయవాడ నుంచే పాలన కొనసాగిస్తామన్నారు.  సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభానికి నిర్ణయించిన ముహుర్తం దాటి పోవడంతోనే ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement