ఏపీ వ్యవసాయ బడ్జెట్‌ హైలైట్స్‌

AP Agriculture Budget 2020 21 Live Updates in Telugu - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ బడ్జెట్‌ 2020-21ను ఆ శాఖ మంత్రి కన్నబాబు శాసనసభలో మంగళవారం సాయంత్రం ప్రవేశపెట్టారు. గతేడాది కాలంలో వ్యవసాయ రంగంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. దీర్ఘకాలికంగా రైతులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఆయన శాసనసభలో ప్రసంగిస్తూ.. ‘రైతు సంక్షేమం అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గుర్తొస్తారు. రైతుల కోసం నాన్న ఒకడుగు ముందుకేస్తే తాను రెండడుగులు ముందుకేస్తానని చెప్పి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆచరణలో చూపుతున్నారు.

ఒత్తిడిలేని వ్యవసాయమే ఆయన సంకల్పం. పెట్టుబడి తగ్గిస్తూ ఉత్పత్తుల నాణ్యతను, రైతుల నికరా ఆదాయాన్ని పెంచడం ద్వారా రైతన్నల ముఖాల్లో సంతృప్తిని చూడటమే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తోంది’అని మంత్రి కన్నబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ, అనుబంధ రంగాలకు 2020-21 ఏడాదికి గాను రూ. 29,159.97 కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదిస్తున్నామని అన్నారు.  రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.12,500 ఇస్తామని చెప్పి రూ.13,500 ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. శాసనమండలిలో మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 

వ్యవసాయ బడ్జెట్‌లో కేటాయింపులు..

 • 3 వేల కోట్ల తో ధరల స్థిరీకరణ నిధి
 • రైతు భరోసా కేంద్రాల కు 100 కోట్లు
 • వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు 500 కోట్లు
 • వైఎస్సార్ వడ్డీ లేని పంట రుణాలను 1100 కోట్లు
 • రైతులకు ఎక్స్ గ్రేషియో కు 20 కోట్లు
 • రాయితీ విత్తనాల కోసం 200 కోట్లు
 • వ్యవసాయ యాంత్రీకరణ కు 207.83 కోట్లు
 • ప్రకృతి వ్యవసాయానికి 225.51 కోట్లు
 • ప్రకృతి విపత్తు నిధి 2000 కోట్లు
 • ఎన్జీ రంగా యూనివర్సిటీ కి 402 కోట్లు
 • ఉద్యాన వన అభివృద్ధి కి 653.02 కోట్లు
 • వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ కి 88.60 కోట్లు
 • పట్టు పరిశ్రమ అభివృద్ధి కి 92.18 కోట్లు
 • పశు సంవర్థక శాఖ కు854.77 కోట్లు
 • వెంకటేశ్వర పశు వైద్య శాల కు 122.73 కోట్లు
 • మత్స్య అభివృద్ధి కి 299.27 కోట్లు
 • సహకార శాఖ కు 248.38 కోట్లు
 • వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి 4450 కోట్లు
 • వ్యవసాయ అనుబంధ ఉపాధి హామీకి 6270 కోట్లు
 • వెంకటేశ్వర పశు వైద్యశాలకు 122.73 కోట్లు
 • మత్స్య అభివృద్ధి కి 299.27 కోట్లు
 • సహకార శాఖ కు 248.38 కోట్లు
 • వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కి 4450 కోట్లు
 • వ్యవసాయ అనుబంధ ఉపాధి హామీకి 6270 కోట్లు

చదవండి: ఏపీ బడ్జెట్‌ హైలైట్స్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top