అంగన్‌వాడీ ఉద్యోగులకు భద్రత ఏదీ ? | Anganwadi no job security? | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ ఉద్యోగులకు భద్రత ఏదీ ?

Aug 23 2014 4:01 AM | Updated on Jun 2 2018 8:29 PM

అంగన్‌వాడీ ఉద్యోగులకు  భద్రత ఏదీ ? - Sakshi

అంగన్‌వాడీ ఉద్యోగులకు భద్రత ఏదీ ?

అంగన్‌వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఏదని ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నించారు. అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాలు పెంచుతా...

నగరి: అంగన్‌వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఏదని ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నించారు. అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాలు పెంచుతాం, ఉ ద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన టీడీపీ ఇప్పుడు రాష్ట్రం విడిపోయినందున చేయలేమని చెబుతోందన్నారు. మేనిఫెస్టో పెట్టేముందే రాష్ట్రం విడిపోతుం దన్న విషయం చంద్రబాబు నాయుడుకు తెలియదా ? అని ప్రశ్నిం చారు.

ప్రజలను మోసం చేయడానికే మేనిఫెస్టో తయారుచేశారా? అని ప్రశ్నించారు. ఒకప్పుడు అంగన్‌వాడీ ఉద్యోగులను గుర్రాలతో తొక్కించారని, ఎన్నికల్లో వారిని ఆకర్షించడానికే మేనిఫెస్టోలో ఉద్యోగ భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారని తెలిపారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆ విషయం ఎక్కడా ప్రస్తావించలేదని విమర్శించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement