'హైకోర్టు తీర్పును సవాల్ చేస్తాం.. అవరమైతే సుప్రీం కోర్టుకు..' | Andhra Government to challenge court order on compensation to Muslim youth | Sakshi
Sakshi News home page

'హైకోర్టు తీర్పును సవాల్ చేస్తాం.. అవరమైతే సుప్రీం కోర్టుకు..'

Sep 17 2013 1:08 PM | Updated on Aug 31 2018 8:24 PM

2007 మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో అనుమానితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించడాన్ని తప్పుపట్టిన హైకోర్టు నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయనుంది.

2007 మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో అనుమానితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించడాన్ని తప్పుపట్టిన హైకోర్టు నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయనుంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం సోమవారం వెల్లడించిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని.. అవసరమనుకుంటే సుప్రీంకోర్టును సంప్రదిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఆలీ అన్నారు. ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డితో షబ్బీర్ ఆలీ చర్చించారు. జాతీయ మైనారిటీ కమిషన్ సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం జనవరి 6 తేదిన ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అహ్మదుల్లా చేతులు మీదుగా పరిహారాన్ని చెక్కుల రూపంలో చెల్లించింది. 
 
గతంలో మక్కా పేలుళ్ల కేసులో అనుమానితులుగా తమను అరెస్ట్ చేసిన కారణంగా తాము మానసిక వేదనతో పాటు, సామాజికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తమకు పరిహారం ఇప్పించాలని కోరారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 20 మందికి ఒక్కొక్కరికి రూ.3 లక్షలు, ఇంటరాగేషన్ నుంచి బయట పడిన వారికి రూ.20వేల చొప్పున కూడా చెల్లించింది. ఈ చర్యలను సవాలు చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన ఎస్.వెంకటేష్‌గౌడ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం అనుమానితులకు దాదాపు 70 లక్షల రూపాయల మేర పరిహారం చెల్లిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తన పరిధి దాటి పరిహారం చెల్లించిందని, ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement