ఎమ్మార్వో మహబూబ్బాషాపై దాడికి పాల్పడిన టీడీపీ నేత శ్రీనివాస్పై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేసినట్లు అనంతపురం డీఎస్పీ మల్లికార్జున వర్మ తెలిపారు.
అనంతపురం: ఎమ్మార్వో మహబూబ్బాషాపై దాడికి పాల్పడిన టీడీపీ నేత శ్రీనివాస్పై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేసినట్లు అనంతపురం డీఎస్పీ మల్లికార్జున వర్మ తెలిపారు. ప్రభుత్వ ఆధికారులపై దాడులకు పాల్పడితే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని ఆయన హెచ్చరించారు.
బుధవారం ఉదయం పరిటాల సునీత అనుచరులు టీడీపీ నేతల పామురాయి వెంకటేశ్, కాట్నేకాలువ శ్రీనివాసులు, ఎంపీపీ భర్త రవీంద్ర తహశీల్దార్ షేక్‌మహబూబ్ బాషాను కలిసేందుకు వచ్చారు. తమకు చెందిన వారి పట్టాను ఎందుకు రద్దు చేశారంటూ ఆయనతో వాదనకు దిగారు. అందుకు సదరు అధికారి నిబంధనలకనుగుణంగా చేయాల్సి వచ్చిందని వివరించారు. దాంతో ఎమ్మార్వో సమాధానానికి సంతృప్తి చెందని టీడీపీ నేతలు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో టీడీపీ నేత శ్రీనివాస్ ఎమ్మార్వోపై దాడి చేశారు.