మునిసిపాలిటీలో టీడీపీ నేత హల్‌చల్ | anantapur municipality tdp leader is halchal | Sakshi
Sakshi News home page

మునిసిపాలిటీలో టీడీపీ నేత హల్‌చల్

Jun 20 2014 1:50 AM | Updated on Jun 4 2019 6:31 PM

మునిసిపాలిటీలో టీడీపీ నేత హల్‌చల్ - Sakshi

మునిసిపాలిటీలో టీడీపీ నేత హల్‌చల్

హిందూపురం మునిసిపాలిటీ: ఇంకా మునిసిపల్ కౌన్సిల్ ఏర్పాటుకు నోటిఫికేషన్ కూడా రాలేదు..ఎన్నికైన కౌన్సిలర్లు ఇంకా ప్రమాణస్వీకారం చేయనేలేదు

విభాగాల వారీగా తనిఖీలు
అనధికార సమావేశంతో అధికారులు  
ఉక్కిరిబిక్కిరి

 
హిందూపురం మునిసిపాలిటీ: ఇంకా మునిసిపల్ కౌన్సిల్  ఏర్పాటుకు నోటిఫికేషన్ కూడా రాలేదు..ఎన్నికైన కౌన్సిలర్లు ఇంకా  ప్రమాణస్వీకారం చేయనేలేదు..అయినా ఓ టీడీపీ నాయకుడు కాబోయే  చైర్ పర్సన్ తన బార్యేనంటూ  కార్యాలయంలో  హల్ చల్ చేస్తున్నారు.  గురువారం  కార్యాలయంలోని ప్రతివిభాగాన్ని ఆయన పరిశీలించారు.   ఏకంగా మునిసిపల్ కమిషనర్‌తో పాటు వివిధ విభాగాల అధికారులతో కౌన్సిల్ హాల్‌లోనే సమావేశాన్ని నిర్వహించి, ఆదేశాలను జారీ చేయడం పట్టణంలో హాట్ టాఫిక్‌గా మారింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా  కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫొటోలను ఏర్పాటు చేయడం సర్వసాధారణం.

అయితే   ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, ఎమ్మెల్యే బాలకృష్ణ , కాబోయే మునిసిపల్ చైర్‌పర్సన్ ఫొటోలు ఏర్పాటు చేయాలని   ఆయన ఆదేశించడం అధికారులను విస్మయపరచింది.  చైర్ పర్సన్‌గా పదవీకాలం ముగిసిన తర్వాత ఫొటో పెట్టేందుకు అవకాశం వుంటుంది. అయితే చైర్‌పర్సన్ ఫొటోను కూడా ప్రతి విభాగంలో ఏర్పాటు చేయాలనడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పట్టణంలోని 38 వార్డుల్లో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యాక్రమాలను ముందుగానే వివరిస్తూ స్థానిక కౌన్సిలర్ ఫొటోతోపాటు, నలుగురి ఫొటోలను వెంటనే ఏర్పాటు చేయాలనడంతో అధికారులు అయోమయంలో పడ్డారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement