హైనాను కొట్టి చంపిన 'అనంత' వాసులు | Anantapur District People killed Hyena | Sakshi
Sakshi News home page

హైనాను కొట్టి చంపిన 'అనంత' వాసులు

May 4 2014 8:36 AM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురం జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన అడవి జంతువు హైనాను స్థానికులు కొట్టి చంపారు.

పుట్టపర్తి: అనంతపురం జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన అడవి జంతువు హైనాను స్థానికులు కొట్టి చంపారు. పుట్టపర్తి, బుక్కపట్నం మండలాల్లో 25 మందిపై దాడి చేసి గాయపరిచిన హైనాను పట్టుకుని కొట్టి చంపారు. పొలానికి వెళ్లిన పలువురు రైతులపై హైనా దాడి చేసింది. హైనా దాడిలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

అయితే రైతులపై దాడిచేసింది చిరుతపులి అని ముందు అనుకున్నారు. చివరకు హైనాగా గుర్తించి పట్టుకున్నారు. హైనాను కొట్టి చంపడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement