అంబికా కృష్ణకు సమైక్య సెగ | Ambika Krishna resigns protesting statehood to Telangana | Sakshi
Sakshi News home page

అంబికా కృష్ణకు సమైక్య సెగ

Sep 3 2013 11:40 AM | Updated on Aug 10 2018 7:58 PM

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణకు మంగళవారం ఏలూరులో సమైక్య సెగ తగిలింది.

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణకు మంగళవారం ఏలూరులో సమైక్య సెగ తగిలింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏలూరు నగరంలో  ఏపీ ఎన్జీవోలు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి సంఘీభావం తెలిపేందుకు ఆయన వచ్చారు. ఆ క్రమంలో ఆయనకు ఎన్జీవోల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది.

 

అంబికా కృష్ణ గోబ్యాక్ అంటూ ఎన్జీవోలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చి ఈ ప్రాంతంలో ఆత్మగౌరవ యాత్ర ఎలా చేస్తారని వారు ఆ సందర్భంగా అంబికా కృష్ణను ఎన్జీవోలు ప్రశ్నించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పార్టీకి, పదవులకు రాజీనామా చేయాలని ఉద్యోగులు అంబికా కృష్ణను డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement