
ధర్మపోరాటం బస్సుల్లో ఆహారం, మద్యం
విజయనగరం , సీతానగరం (పార్వతీపురం): జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నిర్వహించిన ధర్మ పోరాట సదస్సుకు సీతానగరం మండలం నుంచి బస్సుల్లో వచ్చిన తమ్ముళ్లకు దండిగా మందు సమకూర్చారు. అధికారపార్టీ నాయకులు శ్రీకాకుళం ఏపీఎస్‌ఆర్టీసీ డిపో నంబర్ 1, డిపో నంబర్ 2 నుంచి 42 బస్సులు, ఇతర డిపోల నుంచి 18 బస్సులను సమీకరించి పెద్ద గ్రామానికి రెండు, చిన్న గ్రామానికి ఒకటి వంతున కేటాయించారు. గ్రామాల్లో కార్యకర్తలు జన సమీకరణ చేసి బస్సులెక్కించారు.బస్సుల్లో వచ్చే కార్యకర్తలకు వాటిలోనే ఆహారం, మద్యం సీసాలు సమకూర్చారు.