ఉదయం 6 గంటలకే మద్యం! | Alcohol at 6 am! | Sakshi
Sakshi News home page

ఉదయం 6 గంటలకే మద్యం!

Sep 29 2014 9:12 AM | Updated on Sep 2 2017 2:07 PM

ఉదయం 6 గంటలకే మద్యం!

ఉదయం 6 గంటలకే మద్యం!

ఉదయాన్నే మెడికల్ షాపులు తెరవకపోయినా మద్యం షాపులు మాత్రం తెరుస్తున్నారు.

నెల్లూరు: ఉదయాన్నే మెడికల్ షాపులు తెరవకపోయినా మద్యం షాపులు మాత్రం తెరుస్తున్నారు. పట్టణాలలోనే కాదు గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయం మద్యం అమ్మకాల నుంచే వస్తోంది. దాంతో ప్రభుత్వాలు కూడా ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా  మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నాయి.

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉదయం ఆరు గంటలకే మద్యం షాపులను తెరుస్తున్నారు. మందు బాబులకు మద్యం షాపులు ఉదయాన్నే తెరవడం బాగానే ఉంది. అయితే మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారట. అదీ వారి బాధ. ఇందుకు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement