ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అద్దంకిలో ఉద్రిక్తత
Jul 8 2017 10:52 AM | Updated on Sep 5 2017 3:34 PM
ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణంలోని ఓ సీసీ రోడ్డు ప్రారంభోత్సవం వ్యవహారంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాంలు ఇద్దరు సై అంటే సై అంటున్నారు. ఎమ్మెల్యే తో ప్రారంభోత్సవం జరిపించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు శిలాఫలకం కూడా వేశారు.
అయితే కరణం బలరాం వర్గం కూడా దాని పక్కనే మరో శిలాఫలకం ఏర్పాటుచేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువురు నేతలు పోటీగా ప్రారంభోత్సవం చేసేందుకు రెడీ కావడంతో పోలీస్ లు భారీగా మోహరించారు. ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా తన్నుకున్న రెండు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది.
Advertisement
Advertisement