ఒక వ్యాపారి నుంచి రూ. 25వేలు లంచం తీసుకుంటూ విజయవాడ అంబాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి కోటి లింగమ్మ ఏసీబీ అధికారులకు చిక్కింది.
విజయవాడ రూరల్ (కృష్ణా జిల్లా) : ఒక వ్యాపారి నుంచి రూ. 25వేలు లంచం తీసుకుంటూ విజయవాడ అంబాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి కోటి లింగమ్మ ఏసీబీ అధికారులకు చిక్కింది. ఈ సంఘటన మంగళవారం కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగింది.
గ్రామానికి చెందిన గణేష్‌బాబు జక్కంపూడి గ్రామంలో అల్యూమినియం పరిశ్రమ కోసం షెడ్‌ను నిర్మిస్తున్నాడు. షెడ్ హౌజ్ టాక్స్‌కు అనుమతి కోసం కార్యదర్శి రూ. 25వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో గణేష్ బాబు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం లంచం తీసుకుంటుండగా లింగమ్మను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.