పుష్కరిణిలో పడి తాత మృతి.. మనుమడి గల్లంతు | A man was killed Float | Sakshi
Sakshi News home page

పుష్కరిణిలో పడి తాత మృతి.. మనుమడి గల్లంతు

Jan 21 2015 2:47 AM | Updated on Aug 10 2018 8:13 PM

పుష్కరిణిలో పడి  తాత మృతి.. మనుమడి గల్లంతు - Sakshi

పుష్కరిణిలో పడి తాత మృతి.. మనుమడి గల్లంతు

మండలంలో నిర్వహించిన తెప్పోత్సవంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

వరదయ్యపాళెం: మండలంలో నిర్వహించిన తెప్పోత్సవంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో బాలుడు గల్లంతయ్యాడు. మండలంలోని కళత్తూరు గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ పుష్కరిణిలో మంగళవారం రాత్రి తెప్పోత్సవాలు నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పుష్కరిణిలో తెప్పపై స్వామి అమ్మవార్లను ఉంచి మూడు మార్లు విహరిస్తారు. మూడోసారి విహరించే ముందు రాత్రి 8.45 గంటలకు మాజీ ఎమ్మెల్యే తలారి మనోహర్ తెప్పపైకి వచ్చారు.

అంతకుముందే దాదాపు 20 మంది తెప్పపై ఉన్నారు. ఆయనతో పాటు మరో వందమంది తెలుగుదేశం పార్టీ నాయకులు తెప్పపైకి ఎక్కారు. బరువుకు ఎక్కువ కావడంతో తెప్ప బోల్తాపడింది. దీంతో ఉత్సవమూర్తితో పాటు మాజీ ఎమ్మెల్యే, నాయకులు కింద పడిపోయారు. ఈ సమయంలో సూళ్లూరుపేటకు చెందిన సుబ్రమణ్యం(65) నీటిలో పడి మృతి చెందాడు. అతని మనుమడు వంశీ(11) పుష్కరిణిలో పడి గల్లంతయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement