కుమార్తెను చంపి.. తానూ గొంతు కోసుకుని... | A father kills her daughter and committed suicide | Sakshi
Sakshi News home page

కుమార్తెను చంపి.. తానూ గొంతు కోసుకుని...

Apr 19 2015 6:02 AM | Updated on Sep 3 2017 12:28 AM

కుమార్తెను చంపి.. తానూ గొంతు కోసుకుని...

కుమార్తెను చంపి.. తానూ గొంతు కోసుకుని...

మద్యం మత్తులో కన్నకూతుర్నే హతమార్చిన తండ్రి ఉదంతమిది.

 చిలకలూరిపేట: మద్యం మత్తులో కన్నకూతుర్నే హతమార్చిన తండ్రి ఉదంతమిది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఈ ఘటన జరిగింది. వెంగళాయిపాలేనికి చెందిన కందుకూరి తిరుపతయ్య, అనంత లక్ష్మి దంపతులకు ఐదుగురు సంతానం. వీరిలో పెద్దవారు స్థిరపడి వేరు పడగా, రెండో కుమారుడు పవన్ స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. మూడో కుమార్తె మహేశ్వరి(9)అంగవైకల్యంతో ఇబ్బంది పడుతోంది.

తిరుపతయ్య మద్యానికి బానిసై తరచూ డబ్బులు ఇవ్వమని భార్యని వేధిస్తుండేవాడు. ఇటీవలే ఆమెపై కత్తితో  దాడి చేశాడు. ఈ క్రమంలో శనివారం భార్యతో గొడవకు దిగడంతో 11 గంటల సమయంలో ఆమె వినుకొండకు వెళ్లిపోయింది. ఈ సమయంలో స్కూలునుంచి వచ్చిన పవన్‌పై  కత్తితో దాడికి యత్నించాడు.  బాలుడు పరిగెత్తగా ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారి మహేశ్వరి గొంతును కత్తితో కోసి చంపాడు. తానూ మెడను కోసుకున్నాడు.  చికిత్స కోసం అతన్ని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement