డీఎస్సీ-2014 ఉపాధ్యాయ నియామకానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన...
	విశాఖ రూరల్ : డీఎస్సీ-2014 ఉపాధ్యాయ నియామకానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను ఈ నెల 8 నుంచి జనవరి 31వ తేదీ చేపడుతున్నట్టు జిల్లా విద్యా శాఖాధికారి ఎం.వి.కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అర్బన్ తహశీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఇందుకోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు.
	
	అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా సమర్పించిన దరఖాస్తుతో పాటు అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలన నిమిత్తం అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో వ్యక్తిగతంగా హాజరై నకలు కాపీలను దరఖాస్తుతో సమర్పించాలని సూచించారు. ఈ నెల 8 నుంచి జనవరి 31వ తేదీ వరకు ఆ దరఖాస్తులను అన్ని పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకు, ఇతర సమాచారం కోసం ఠీఠీఠీ.్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
