72 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ | 72 Red Sandalwood smugglers Arrested | Sakshi
Sakshi News home page

72 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

May 29 2015 5:45 PM | Updated on Aug 20 2018 4:27 PM

అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న 72 మంది స్మగ్లర్లను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

వైఎస్సార్ జిల్లా (చిన్నమండెం) : అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న 72 మంది స్మగ్లర్లను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.కోటి 20 లక్షల విలువ చేసే 73 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారంతా తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందినవారిగా గుర్తించారు. ఏదో విహార యాత్రకు బయలుదేరినట్లుగా బయలుదేరి, లారీలో ఎర్రచందనం దుంగలపై బియ్యం బస్తాలు ఉంచి కనపడకుండా ఏర్పాట్లు చేశారు. పోలీసులు పక్కా సమాచారంతో శుక్రవారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించి నిందితుల్ని పట్టుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టి విలేకరులకు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement