మరో బోటు ఆచూకీ లభ్యం | 7 fisher men safely reached bangla desh coast | Sakshi
Sakshi News home page

మరో బోటు ఆచూకీ లభ్యం

Jun 27 2015 1:43 PM | Updated on Apr 3 2019 5:24 PM

ఈ నెల 16వ తేదీన సముద్రంలో వేటకు వెళ్లి ఆచూకీ గల్లంతయిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ బోటు బంగ్లాదేశ్ తీరానికి చేరుకుంది.

రాజమండ్రి: ఈ నెల 16వ తేదీన సముద్రంలో వేటకు వెళ్లి ఆచూకీ గల్లంతయిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ బోటు బంగ్లాదేశ్ తీరానికి చేరుకుంది. ఈ బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా తిరిగివచ్చారు. వీరంతా తొండంగి మండలం పాతపెరుమాళ్లపురానికి చెందిన మత్య్సకారులు. మరోవైపు కాకినాడ దుమ్మలపేటకు చెందిన మత్స్యకారులు ఇప్పటికీ విశాఖతీరంలో లంగరు వేసిన ఓ ప్రైవేటు నౌకలోనే ఉన్నారు. ఇంజన్ చెడిపోవడంతో సముద్రంలో చిక్కుకున్న వీరిని ఈ నెల 22న ఓ ప్రైవేట్ మర్చంట్ నౌక రక్షించింది.

23న ఈ నౌక విశాఖ తీరానికి చేరుకున్నా..పోర్టులోకి అనుమతి లేకపోవటంతో తీరంలోనే లంగరు వేసింది. ఐతే ఈ నౌకలో ఉన్న ఏడుగురు మత్స్యకారులను కాకినాడ తీసుకువచ్చేందుకు అధికారులు చొరవచూపించడం లేదు. నౌక పోర్టులోకి వచ్చిన తర్వాతే కాకినాడకు తీసుకు వస్తామని మత్స్యకారులకు అధికారులు సూచిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement