విజయనగరం జిల్లాలోని బలిజపేట మండలం వంతారం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇరువర్గాల మధ్య ఘర్షణ, ఉద్రిక్తత
Jul 28 2017 12:25 PM | Updated on Aug 25 2018 5:38 PM
విజయనగరం: విజయనగరం జిల్లాలోని బలిజపేట మండలం వంతారం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలోని రెండు వర్గాల వారు రాళ్లు, కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇరు వర్గాల వారు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో.. ఆరుగురికి గాయాలయ్యాయి.
దీంతో వారిని బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Advertisement
Advertisement