50మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు | 50 Redwood smugglers arrested in Ysr District | Sakshi
Sakshi News home page

50మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

Dec 28 2013 8:32 PM | Updated on Sep 2 2017 2:04 AM

జిల్లాలోని రాజంపేట అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా యధేచ్ఛగా కొనసాగుతోంది.

వైఎస్సార్ జిల్లా: జిల్లాలోని రాజంపేట అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా యధేచ్ఛగా కొనసాగుతోంది. అక్రమంగా ఎర్రచందనాన్ని తరలించడమే కాకుండా, అడ్డగించిన అటవీశాఖా అధికారులపై కూడా ఎర్రచందనం స్మగ్లర్లు దాడులకు తెగబడుతున్నారు. వీరి ఆగడాలను అరికట్టేందుకు అటవీశాఖ రంగంలోకి దిగింది.

ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు, పోలీసులతో సంయుక్తంగా  విస్తృత తనిఖీలు జరిపారు. ఈ జాయింట్ అపరేషన్లో భాగంగా అధికారులు రాజంపేట అటవీ ప్రాంతమంతా  జల్లడిపట్టారు. కాగా,  నిఘా పెట్టిన పోలీసులు, అధికారులు అడవిలో ప్రవేశిస్తున్న 50మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement