రాష్ట్ర విభజన నిర్ణయంపై తమ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు అక్టోబర్ 3న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థి ధర్నా కార్యక్రమం
3న జంతర్‌మంతర్ వద్ద విద్యార్థుల ధర్నా
Sep 30 2013 1:29 AM | Updated on Sep 1 2017 11:10 PM
భీమవరం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నిర్ణయంపై తమ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు అక్టోబర్ 3న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు విద్యార్థి ఐకాస రాష్ట్ర చైర్మన్ వత్సవాయి శ్రీనివాసరాజు పేర్కొన్నారు. ఆదివారం మేధావుల ఫోరం జిల్లా కన్వీనర్ ఆరేటి ప్రకాష్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజిస్తే ప్రధానంగా నష్టపోయేది విద్యార్థులు, విద్యావంతులేనన్నారు. సమైక్యాంధ్రకు మద్దతు కూడగట్టేందుకు అక్టోబర్ 1న ఢిల్లీ వెళ్లి 2న సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఇతర రాజకీయ పార్టీల జాతీయ నేతలు, మేధావులను కలిసి విన్నవిస్తామన్నారు. 3న జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్ధులతో ధర్నా నిర్వహిస్తామని శ్రీనివాసరాజు వివరించారు. ఈ ధర్నాకు 13 జిల్లాలకు చెందిన యూనివర్సిటీలు, విద్యా సంస్థల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరవుతారని తెలిపారు.
Advertisement
Advertisement