అక్రమంగా సంచుల్లో తరలిస్తున్న 38 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.
నాతవరం (విశాఖపట్నం) : అక్రమంగా సంచుల్లో తరలిస్తున్న 38 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన శనివారం విశాఖ జిల్లా నాతవరం మండల కేంద్రంలో జరిగింది. వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలు, అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు పురుషులు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.
వీరందరూ కలిసి నర్సీపట్నం నుంచి గంజాయిని తరలిస్తుండగా నాతవరం వద్ద పోలీసులు పట్టుకున్నారు. కాగా వీరిలో ఒక వ్యక్తి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తృతీయ శ్రేణి గంజాయి కావడంతో దీని విలువ రూ. 3లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.