ఇసుక అక్రమ రవాణా: 3 ట్రాక్టర్లు సీజ్ | 3 tractors seized at gundlakamma river | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ రవాణా: 3 ట్రాక్టర్లు సీజ్

Aug 8 2015 5:16 PM | Updated on Sep 3 2017 7:03 AM

అనుమతులు లేకుండా ఇసుకను తరిలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు.

గుంటూరు(నూజెండ్ల): అనుమతులు లేకుండా ఇసుకను తరిలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మండలంలోని ములకలూరు గ్రామంలో ఉన్న గుండ్లకమ్మ నది నుంచి ఇసుకను తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి మూడు ట్రాక్టర్లను సీజ్ చేశారు. అనంతరం ట్రాక్టర్లను పోలీసుస్టేషన్‌కు తరలించి యాజమాన్యాలపై కేసులు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement