25 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత | 25 ration rice bags cought in prakasham district | Sakshi
Sakshi News home page

25 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

Jul 5 2015 3:22 PM | Updated on Sep 3 2017 4:57 AM

అక్రమంగా తరలిస్తున్న 25 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రకాశం జిల్లా: అక్రమంగా తరలిస్తున్న 25 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. వివరాలు.. గోదాం నుంచి అక్రమంగా రేషన్ బియ్యాన్ని ఆటోలో తరలిస్తుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆటోను స్వాధీనం చేసుకొని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement