ధాన్యం బస్తాలు సీజ్ | 25 bags load seized in tadepally | Sakshi
Sakshi News home page

ధాన్యం బస్తాలు సీజ్

Feb 11 2015 8:14 PM | Updated on Sep 2 2017 9:09 PM

అధిక లోడ్‌తో వెళుతున్న ఓ లారీ నుంచి ధాన్యం బస్తాలు కింద పడిపోగా... డ్రైవర్ వాటిని వదిలేసి వెళ్లిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగింది.

తాడేపల్లి: అధిక లోడ్‌తో వెళుతున్న ఓ లారీ నుంచి ధాన్యం బస్తాలు కింద పడిపోగా... డ్రైవర్ వాటిని వదిలేసి వెళ్లిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి... ప్రజాపంపిణీకి ఉద్దేశించిన బియ్యం బస్తాలతో బుధవారం సాయంత్రం ఓ లారీ విజయవాడ నుంచి తాడేపల్లిలోని ఎఫ్‌సీఐ గోదాములకు వెళుతోంది.

తాడేపల్లిలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్దకు రాగా... లారీ పై భాగంలో అధికంగా వేసిన బస్తాలు బ్రిడ్జికి తగిలి కింద పడిపోయాయి. కానీ, డ్రైవర్ వాటిని వదిలేసి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న తాడేపల్లి మండల తహసీల్దారు వెంకటేశ్వర్లు రోడ్డుపై పడిపోయిన మొత్తం 25 బస్తాలను (ఒక్కోటీ 50 కేజీలు) సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement