తలకోనలో కూంబింగ్ | 240 kgs Red sandalwood seized | Sakshi
Sakshi News home page

తలకోనలో కూంబింగ్

Aug 2 2015 8:28 AM | Updated on Sep 3 2017 6:39 AM

చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం మండలంలోని తలకోన అటవీ ప్రాంతంలో ఆదివారం పోలీసులు కూంబింగ్ నిర్వహించారు.

చిత్తూరు (ఎర్రావారిపాలెం) : చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం మండలంలోని తలకోన అటవీ ప్రాంతంలో ఆదివారం పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు తమిళ కూలీలను అరెస్ట్ చేశారు.

అటవీ ప్రాంతంలో ఓ చోట డంపింగ్ చేసిన సుమారు రూ.25 లక్షల విలువ చేసే 240 కేజీల ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కూలీలంతా వేలూరు జిల్లా అద్దెకుప్పానికి చెందిన వారిగా గుర్తించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement