విశాఖపట్టణం జిల్లా యలమంచిలి మండలం పెద్దపల్లి వద్ద 16వ నంబరు జాతీయరహదారిపై ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది.
యలమంచిలి: విశాఖపట్టణం జిల్లా యలమంచిలి మండలం పెద్దపల్లి వద్ద 16వ నంబరు జాతీయరహదారిపై ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఆర్టీసీ బస్సు అమలాపురం నుంచి టెక్కలి వెళ్తున్న సమయంలో ప్రమాద జరిగింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన యలమంచిలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.