Tokyo Olympics: ఆకర్షిస్తున్న సూక్ష్మ బంగారు కళాఖండం

యలమంచిలి రూరల్: ఒలింపిక్స్ క్రీడోత్సాహం ఎల్లెడలా వెల్లివిరిస్తోంది. క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపేలా ఏటికొప్పాక హస్తకళాకారుడు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత శ్రీశైలపు చిన్నయాచారి రూపొందించిన సూక్ష్మ ఒలింపిక్స్ చిహ్నం అందర్నీ ఆకర్షిస్తోంది. 22 క్యారెట్ బంగారంతో ఒలింపిక్స్ చిహ్నాన్ని తయారు చేసి గుండు సూది పైభాగంలో ఆయన అమర్చారు. 1 మి.మీ. ఎత్తు, 2 మి.మీ. వెడల్పుతో ఈ కళాఖండాన్ని సృజించేందుకు రెండు రోజుల వ్యవధి పట్టిందని, దీనిని మైక్రోస్కోప్‌లో మాత్రమే స్పష్టంగా వీక్షించగలమని చిన్నయాచారి చెప్పారు.