ఇంటి గోడ కూలి ఇద్దరి మృతి | 2 ided due to wall collapse | Sakshi
Sakshi News home page

ఇంటి గోడ కూలి ఇద్దరి మృతి

Nov 17 2015 9:46 AM | Updated on Sep 28 2018 3:41 PM

వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం లక్ష్మింగారిపల్లెలో ఇంటి గోడ కూలి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు.

అనంతపురం: అనంతపురం జిల్లా కదిరి మండలం కాలసముద్రం గ్రామంలో మిద్దె కూలి చంద్రకళ(21) అనే బాలింత మృతిచెందింది. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో చోటు చేసుకుంది. వర్షాలకు ఇంటి గోడ బాగా తడిసినందువల్లే కూలిపోయిందని స్ధానికులు తెలిపారు.  ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చంద్రకళ 15 రోజుల క్రితమ మగబిడ్డకు జన్మనించింది. ఈ ప్రమాదం నుంచి పసికందు క్షేమంగా బయటపడ్డాడు

గోడకూలి చిన్నారి మృతి

రైల్వేకోడూరు: వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం లక్ష్మింగారిపల్లెలో ఇంటి గోడ కూలి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకుంది. అల్పపీడనం కారణంగా రాయలసీమలో వర్షాలు పడుతున్నాయి. వర్షాలకు ఇంటి గోడ కూలడంతో అచ్యుత్ అనే బాలుడు మృతి చెందాడు.




 

Advertisement
 
Advertisement
Advertisement