పత్తి కొనుగోళ్ల సమయంలో తూకంలో మోసాలకు పాల్పడుతున్న స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లుల కేంద్రాలపై రాష్ట్ర వ్యాప్తంగా 189 కేసులు నమోదు చేసినట్లు తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ ఎస్.గోపాల్‌రెడ్డి తెలిపారు.
హైదరాబాద్, న్యూస్‌లైన్: పత్తి కొనుగోళ్ల సమయంలో తూకంలో మోసాలకు పాల్పడుతున్న స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లుల కేంద్రాలపై రాష్ట్ర వ్యాప్తంగా 189 కేసులు నమోదు చేసినట్లు తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ ఎస్.గోపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఈ నెల 20, 21 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లులతో తనిఖీలు నిర్వహించామని.. మోసాలకు పాల్పడిన మిల్లులలపై 189 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. తూనికల, కొలతల శాఖ సీల్ వేసిన యంత్రాలనే వాడాలని తెలిపారు.