breaking news
Cotton purchase
-
తేమ.. 7 క్వింటాళ్లు.. కపాస్ యాప్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు మొదలయ్యాయి. ఆయా మిల్లుల్లో 724 మంది నుంచి 13,613 క్వింటాళ్ల పత్తి సేకరించాయి. కానీ ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ వ్యాపారులు ఇదే సమయంలో ఏకంగా 1,23,776 క్వింటాళ్ల మేర పత్తి కొనడం గమనార్హం.సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పత్తి పంటను తేమ శాతం ఆధారంగా మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొర్రీలతో రైతులను ఇబ్బంది పెడుతోంది. పత్తి చేతికొచ్చే వేళ వర్షాలతో దిగుబడి తగ్గగా.. వచి్చన పత్తి సైతం రంగు మారింది. దీంతో ఇటు ప్రైవేట్, అటు సీసీఐ కేంద్రాలకు వెళ్లినా మద్దతు ధర లభించట్లేదు. తేమ శాతం 12 నుంచి మరింత పెంచాలన్న రైతుల డిమాండ్‌ను సీసీఐ పెడచెవిన పెట్టడం, కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ తప్పనిసరి కావడం రైతులపాలిట శాపంగా మారింది. దీనికితోడు గతంలో ఎకరాకు 13 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసిన సీసీఐ.. ప్రస్తుతం ఎకరాకు 7 క్వింటాళ్లకే కొనుగోళ్లను పరిమితం చేయడంతో రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి. తేమ శాతం పేరుతో.. మొదటి తీత పత్తిని రైతులు ప్రైవేట్ వ్యాపారులకే విక్రయించగా తేమ శాతం, ఇతర సాకులతో తక్కువ ధరే చెల్లించారు. ఆపై క్వింటాకు రూ. 8,110 మద్దతు ధరతో సీసీఐ రాష్ట్రంలో అక్టోబర్ 22 నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఇప్పటివరకు 188 కేంద్రాలు ప్రారంభమవగా నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తోంది. తేమ 8 శాతం నుంచి 12 శాతం లోపు ఉంటేనే కొంటామని సీసీఐ చెబుతోంది. ఈ కారణంగా కొందరికే అవకాశం లభిస్తుండగా రవాణా ఖర్చులు భరించి జిన్నింగ్ మిల్లులకు పత్తి తీసుకెళ్లిన వారు అక్కడే ఆరబెట్టుకోవాల్సి వస్తోంది. తుపాను ప్రభావం, చలికాలం వల్ల 15–20 శాతం తేమ ఉన్నా కొనాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. గుదిబండలా యాప్.. సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించాలనుకునే రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ విషయమై విస్తృత ప్రచారం లేక నేరుగా వెళ్లి అవస్థలు పడుతున్నారు. అలాగే రైతు ఫోన్ నంబర్ మారినా, భూ భారతిలో వివరాలు లేకపోయినా తిరస్కరిస్తుండడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఖమ్మం జిల్లా తల్లాడలో గత నెల 22న కొనుగోళ్లు మొదలవగా ఇప్పటివరకు కేవలం 650 క్వింటాళ్లే సేకరించారు. తేమ 12 శాతం కంటే ఎక్కువగా ఉండటంతో నిరాకరిస్తుండగా రైతులు తిరిగి తీసుకెళ్లలేక తల్లాడలోనే ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఫలితంగా వ్యాపారులు క్వింటాకు రూ. రూ. 2 వేల వరకు తగ్గిస్తున్నారు.తేమ ఉందని కొనుగోలు చేయలే.. ఐదెకరాల్లో పత్తి సాగు చేస్తే 20 క్వింటాళ్ల దిగుబడి వచి్చంది. తల్లాడ సీసీఐ కేంద్రంలో తేమ ఎక్కువగా ఉందని కొనలేమన్నారు. ప్రైవేటుగా విక్రయిస్తే క్వింటాకు రూ. వెయ్యి తగ్గించారు. ప్రభుత్వం 20 శాతం తేమ ఉన్నా కొనుగోలు చేయాలి. – బుర్రె రామారావు, అంజనాపురం, కొణిజర్ల మండలం, ఖమ్మం జిల్లాబస్తా పత్తికి చూడరట.. నాలుగెకరాల్లో కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తే 35 క్వింటాళ్ల దిగుబడి వచి్చంది. కానీ సీసీఐలో ఎకరాకు ఏడు చొప్పున 28 క్వింటాళ్లే కొంటామన్నారు. ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు సీసీఐ కేంద్రానికి బస్తా పత్తి తీసుకొస్తే తేమ చూడకుండా మొత్తం తేవాలన్నారు. తీరా తెచ్చాక తేమ ఎక్కువుందని తిరస్కరిస్తే రవాణా ఖర్చు భారం పడుతుంది. – ఎస్.కే.చాంద్, వెంకటాపురం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా -
పత్తి కొనుగోళ్లపై నీలినీడలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దేశవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అమల్లోకి తెచి్చన కొత్త నిబంధనలు జిన్నింగ్ మిల్లుల యజమానులకు రుచించడం లేదు. రైతుల నుంచి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసి, మద్దతు ధరకు సీసీఐ నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లుల్లో విక్రయించే పద్ధతి గత సంవత్సరం వరకు సాగింది. రాష్ట్రంలో గత సంవత్సరం వానాకాలం సీజన్లో 25 లక్షల మంది రైతులు సుమారు 43 లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేస్తే, సీసీఐ మద్దతు ధరకు కొనుగోలు చేసిన పత్తి 21 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, దాన్ని విక్రయించిన రైతులు 9 లక్షల మంది మాత్రమే.రైతుల ఆధార్ కార్డులు, పట్టాదార్ పాస్ పుస్తకాల జిరాక్స్‌లను ముందుగానే తీసుకొని తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసే దళారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు.. అదే పత్తిని నోటిఫైడ్ జిన్నింగ్ మిల్లులకు మద్దతు ధరకు విక్రయించే ప్రక్రియ కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ విభాగం దీనిని గుర్తించి, ఈ దందాలో భాగమైన సీసీఐ, రాష్ట్ర మార్కెటింగ్ శాఖ సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో రైతు స్వయంగా మిల్లుకు వెళ్లి మద్దతు ధరకు పత్తిని విక్రయించేలా సీసీఐ నిబంధనలు విధించింది. ప్రతి రైతు ‘కపాస్ కిసాన్’అనే యాప్‌లో తన వివరాలను నమోదుచేసుకొని, దాని ద్వారానే లావాదేవీలు సాగించాలని ఆదేశించింది. ఈ యాప్‌ను రైతులు వినియోగించలేరని దళారులు, మిల్లర్లు భావించినప్పటికీ, ఇప్పటికే 23 వేల మంది రైతులు యాప్ ద్వారా రిజి్రస్టేషన్ చేసుకున్నారు. ఎకరాకు 7 క్వింటాళ్ల ఆంక్షలు అందుకే... దళారులు మార్కెట్లో తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసి, రైతుల పాస్‌పుస్తకాలు, ఆధార్ కార్డుల ద్వారా ఎకరానికి 12 క్వింటాళ్ల చొప్పున పత్తిని సీసీఐ నోటిఫైడ్ సెంటర్లలో విక్రయించేవారు. ఒక రైతుకు ఐదెకరాల భూమి ఉంటే అందులో రెండెకరాల్లో పత్తి సాగు చేసినా, ఐదెకరాల్లో పత్తి సాగైనట్లు చూపి మాయ చేసేవారు. దీన్ని నివారించేందుకు సీసీఐ ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలని ఆంక్షలు విధించింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ ఇచి్చన అంచనాల మేరకు రాష్ట్రంలో కూడా సగటున ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే దిగుబడి వస్తుందని తేల్చారు. ఈ మేరకు ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వానికి సీసీఐ తెలిపింది. ఈ నిర్ణయం మిల్లర్లకు అశనిపాతంగా మారింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని మిల్లుల్లోనే విక్రయాలు రాష్ట్రంలో గతంలో పత్తి కొనుగోళ్లలో అనేక వింతలు చోటుచే సుకున్నట్టు విజిలెన్స్ విచారణలో తేలింది. ఆదిలాబాద్‌కు చెందిన రైతు కొత్తగూడెం, వరంగల్‌లో పత్తిని విక్రయించినట్లు జిన్నింగ్ మిల్లర్లు ఆధార్, పట్టా పాస్‌పుస్తకాలతో మాయజాలం చేశారు. దీంతో ఈసారి ఏ జిల్లా రైతులు ఆ జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల్లోనే పత్తిని విక్రయించాలని సీసీఐ నిబంధన విధించింది. కొత్త జిల్లాల వారీగా ఈ విక్రయాలు జరగాలని తొలుత సీసీఐ నిర్ణయించగా, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు విజ్ఞప్తి మేరకు ఆ పరిధిని ఉమ్మడి జిల్లాకు పెంచారు. దీంతోపాటే అన్ని మిల్లుల్లో ఏకకాలంలో కొనుగోళ్లు జరపకుండా ఎల్–1, ఎల్–2, ఎల్–3 కింద ఒక్కో జిల్లాలో మిల్లులను 10 నుంచి 12 కేటగిరీలుగా విభజించారు.రిజి్రస్టేషన్ చేసుకున్న రైతులు ఆయా జిల్లాల్లో సీసీఐ ఎల్–1గా ఎంపిక చేసిన మిల్లులకే తొలుత పత్తిని విక్రయించాల్సి ఉంటుంది. ఎల్–1 మిల్లుల సామర్థ్యం పూర్తయిన తరువాతే ఎల్–2కి, ఆ తరువాత ఎల్–3కి అలా ఎల్–12 వరకు మిల్లులను విభజించారు. రాష్ట్రంలో ఉన్న 322 మిల్లుల్లో ఇప్పటివరకు తెరుచుకున్నవి 220 కాగా, ఇందులో ఎల్–1 కింద ఎంపికైన మిల్లులు 117 మాత్రమే. రాష్ట్రంలో ఏ మిల్లులోనైనా పత్తిని దూది, గింజలుగా వేరు చేసేందుకు సీసీఐ చెల్లిస్తున్న మొత్తం ఒక బేల్‌కు రూ.1,440 అని, 322 మిల్లులు ఇదే ధరతో మిల్లింగ్ చేస్తున్నప్పుడు ఎల్–1, ఎల్–2, ఎల్–3 అంటూ విభజన ఎందుకని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే, పారదర్శకత కోసమే ఈ విభజన అని సీసీఐ చెపుతోంది. మిల్లర్లను సముదాయించిన మంత్రి తుమ్మల సీసీఐ నిబంధనలతో మిల్లులను నడపలేమని యాజమాన్యాల సంఘం ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. గురువారం నుంచే నిరవధికంగా అన్ని మిల్లులను మూసివేస్తామని సంఘం అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి ప్రకటించగా, బుధవారం రాత్రి వరకు సంఘం నాయకులతో మంత్రి తుమ్మల, మార్కెటింగ్ అధికారులు చర్చలు జరిపి ఆంక్షలను ఎత్తివేసేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో బంద్ వాయిదా పడింది. కాగా, సీసీఐ నిబంధనలతో ఆదాయంపై దెబ్బ పడిందని భావిస్తున్న మిల్లర్లు త్వరలోనే మరోసారి అలి్టమేటం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. -
పత్తి సాగు.. తగ్గేదే లే...!
కర్నూలు జిల్లా ఆదోని మండలం మధిర గ్రామానికి చెందిన రైతు హుస్సేన్ ఎకరం పొలంలో పత్తి సాగు చేయగా 6 క్వింటాళ్ల దిగుబడివచ్చింది. విక్రయించేందుకు శుక్రవారం ఆదోని మార్కెట్ యార్డుకు పత్తి తీసుకొచ్చారు. ఫైన్ క్వాలిటీ కావడంతో కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడి క్వింటాల్ రూ.10,026 చొప్పున కొనుగోలు చేశారు. ఆరు క్వింటాళ్ల పత్తికి రూ.60,156 ఆదాయం వచ్చింది. పెట్టుబడి పోనూ నికరంగా రూ.35 వేలు మిగలడంతో హుస్సేన్ ఆనందానికి అవధుల్లేవు. గతంలో ఎప్పుడూ ఇంత ధర పలకలేదని సంతోషంగా చెబుతున్నారు. సాక్షి, అమరావతి: ఎక్కడా ‘తగ్గేదే లే’ అన్నట్టుగా పసిడితో తెల్ల బంగారం పోటీపడుతోంది. గత రెండేళ్లుగా కనీస మద్దతు ధరకు నోచుకోని పత్తి ఈసారి ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ఈ ఏడాది చివరి రోజైన డిసెంబర్ 31న ఆదోని మార్కెట్‌యార్డుకు 688 మంది రైతులు 2,911 క్వింటాళ్ల పత్తిని అమ్మకానికి తీసుకురాగా కనిష్టంగా రూ.7,290, గరిష్టంగా రూ.10,026 పలికి మోడల్ ధర రూ.8,650గా నమోదైంది. ఈ సీజన్లో దక్షిణాదిలో పత్తి మార్కెట్ యార్డుల్లో ఇదే అత్యధిక ధర. ఇదే ఊపు కొనసాగితే సంక్రాంతిలోగా రూ.11 వేల మార్కును అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే తగ్గిన విస్తీర్ణం.. గత ఖరీఫ్‌లో 13.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా 16.55 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఈ ఏడాది కనీస మద్దతు ధర క్వింటాల్ పొడుగు పింజ పత్తి రూ.6,025, మధ్యస్థ పత్తి రూ.5,726 చొప్పున నిర్ణయించారు. కనీస మద్దతు ధర లభించకపోవడంతో 2019–20లో 13 లక్షల క్వింటాళ్లు, 2020–21లో 18 లక్షల క్వింటాళ్ల పత్తిని కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ఏడాది కూడా పత్తి కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు చేయగా సీజన్ ప్రారంభం నుంచి పత్తి ధర తారాజువ్వలా దూసుకెళ్తోంది. ప్రారంభంలోనే క్వింటాల్ రూ.6,100 పలికిన పత్తి ఆ తర్వాత ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. పత్తి రైతుకు సత్కారం దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన మార్కెట్‌గా పేరొందిన కర్నూలు జిల్లా ఆదోని పత్తి యార్డుకు వస్తున్న పత్తిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు.సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆదోని మార్కెట్ ద్వారా 4.20 లక్షల క్వింటాళ్ల పత్తి క్రయవిక్రయాలు జరిగాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడంతో రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే నాణ్యమైన పత్తికి మంచి ధర పలుకుతోంది. తాజాగా ఇక్కడ అత్యధిక ధర పొందిన రైతు హుస్సేన్‌ను మార్కెట్ యార్డు కార్యదర్శి బి.శ్రీకాంత్‌రెడ్డి సత్కరించారు. లాట్‌కు 30 మంది పోటీ నాణ్యమైన పత్తి కొనుగోలు కోసం వ్యాపారుల మధ్య పోటీ అనూహ్యంగా పెరిగింది. లాట్‌కు 30 మంది వరకు పోటీపడుతున్నారు. సంక్రాంతి లోగా ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. – బి.శ్రీకాంత్‌రెడ్డి, కార్యదర్శి, ఆదోని మార్కెట్‌యార్డు, కర్నూలు జిల్లా -
మార్కెట్ యార్డులో దగా
-
నవంబర్ నుంచి పత్తి కొనుగోలు
సాక్షి, అమరావతి: గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా దళారుల ప్రమేయం లేకుండా పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. పత్తి సేకరణకు సంబంధించిన విధివిధానాలపై వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యతో కలిసి ఆయన మంగళవారం మార్క్‌ఫెడ్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలను పారదర్శకంగా కొనుగోలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల నుంచి సేకరించిన పత్తిని కొనుగోలు కేంద్రాల నుంచి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కేంద్రాల వరకు సరఫరా చేసేందుకు రవాణా చార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని గుర్తుచేశారు. ఇందుకోసం గతేడాది రూ.86.62 లక్షలు ఖర్చు చేసిందన్నారు. గతేడాది ఒక్క రైతు కూడా ఇబ్బందిపడకుండా సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయించామన్నారు. అదేరీతిలో ఈ ఏడాది కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది 11 ఏఎంసీలు, 73 జిన్నింగ్ మిల్లుల వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా పత్తి సేకరిస్తే ఈ ఏడాది 50 ఏఎంసీలు, 73 జిన్నింగ్ మిల్లుల వద్ద సేకరిస్తున్నట్లు తెలిపారు. పత్తిని సేకరించే జిన్నింగ్ మిల్లుల సంఖ్యను మరింత పెంచాలని కోరామన్నారు. ఈ కేంద్రాల వద్ద దళారుల ప్రమేయం లేకుండా రైతులకు మేలు చేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించారని చెప్పారు. ఈ–పంట ఆధారంగా సీఎం యాప్ ద్వారా వాస్తవ సాగుదారుల నుంచి నేరుగా పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నవంబర్ మొదటి వారం నుంచి కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉంటాయన్నారు. సీసీఐ నిబంధనల మేరకు కనీస మద్దతు ధరలకు పత్తి సేకరణ జరుగుతుందన్నారు. వాస్తవ సాగుదారులు కాకుండా పత్తిని ఎవరు తీసుకొచ్చినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఆధార్ అనుసంధాన రైతుల బ్యాంక్ ఖాతాల్లో మాత్రమే నగదు చెల్లింపులు జరిగేలా చూడాలని చెప్పారు. ఈ సమావేశంలో మార్కెటింగ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మధుసూదన్‌రెడ్డి, వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, మత్స్యశాఖల కమిషనర్లు అరుణ్‌కుమార్, శ్రీధర్, ప్రద్యుమ్న, కన్నబాబు, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్, సీసీఐ ప్రతినిధులు, మార్కెటింగ్ శాఖాధికారులు పాల్గొన్నారు. -
తూకాల్లో మోసాలపై రాష్ట్రవ్యాప్తంగా 189 కేసులు
హైదరాబాద్, న్యూస్‌లైన్: పత్తి కొనుగోళ్ల సమయంలో తూకంలో మోసాలకు పాల్పడుతున్న స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లుల కేంద్రాలపై రాష్ట్ర వ్యాప్తంగా 189 కేసులు నమోదు చేసినట్లు తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ ఎస్.గోపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఈ నెల 20, 21 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లులతో తనిఖీలు నిర్వహించామని.. మోసాలకు పాల్పడిన మిల్లులలపై 189 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. తూనికల, కొలతల శాఖ సీల్ వేసిన యంత్రాలనే వాడాలని తెలిపారు. -
సీసీఐ.. కొనుగోళ్లకు సై!
గజ్వేల్, న్యూస్‌లైన్: సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) వైఖరిలో క్రమంగా మార్పు వస్తున్నట్లు కనిపిస్తోంది. గతేడాది కొన్ని రోజులు మాత్రమే కొనుగోళ్లు చేపట్టి చేతులెత్తేసిన ఆ సంస్థ.. ఈసారి సానుకూల దృక్పథంతో ముందుకు సాగడానికి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ‘మద్దతు ధర’తో ప్రమేయం లేకుండా కమర్షియల్ పర్చేజ్ చేపట్టడానికి నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నిర్ణయం అమలైతే జిల్లా రైతులకు భారీ ప్రయోజనం చేకూరే అవకాశముంది. 2011లో మాదిరిగా మద్దతు ధరతో ప్రమేయం లేకుండా ‘కమర్షియల్ పర్చేజ్’ చేపట్టి రైతులకు అండగా నిలవడానికి ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని జిల్లాకు చెందిన ఓ సీసీఐ అధికారి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. మరో వారం తర్వాత దీనిపై స్పష్టంగా ఆదేశాలు రానున్నాయని, ఆదేశాలు రాగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 2011 నవంబర్ నెలలో పత్తి ధర పైపైకి ఎగబాకింది. పత్తి ధర రూ.4 వేల నుంచి ప్రారంభమై డిసెంబర్, జనవరి నెలలో రూ.7 వేల పైచిలుకు పలికింది. అంతర్జాతీయ పత్తి మార్కెట్లో ఏర్పడిన డిమాండ్ కారణంగా ధర అమాంతం పెరిగింది. నిజానికి ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ.3,000 మాత్రమే. సీసీఐ కేంద్రం నిబంధనల ప్రకారం మద్దతు ధరకే పత్తిని కొనుగోలు చేయాలి. కానీ నిబంధనలను సడలించుకొని ‘కమర్షియల్ పర్చేజ్’ పేరిట సీసీఐ కూడా వరంగల్, పెద్దపల్లి, ఖమ్మం, ఆదిలాబాద్‌తోపాటు గజ్వే ల్ కేంద్రాల్లో ప్రైవేటు వ్యాపారులతో పోటీపడి కొనుగోళ్లు చేపట్టింది. గరిష్టంగా గజ్వేల్‌లో రూ.7 వేల వరకు ధరను చెల్లించింది. ఈ లెక్కన గజ్వేల్ లో ప్రైవేటు వ్యాపారులు, సీసీఐ పోటీలు పడి కొనుగోళ్లు చేపట్టడం వల్ల ఇక్కడ 2.72 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసి రికార్డును సృష్టించారు. పడిపోయిన పత్తి ధర.... జిల్లాలో ఈసారి 1.20 లక్షల హెక్టార్లలో పత్తి సాగైంది. సుమారు 2.8 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడులు వచ్చే అవకాశముంది. పత్తి రైతుల అవసరాల దృష్ట్యా జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, తొగుట, జోగిపేట, జహీరాబాద్‌లలో సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్కెట్లోకి ఉత్పత్తులు రావడం ఊపందుకున్నా ఈ కేంద్రాలను ఇంకా తెరవలేదు. ఫలితంగా ప్రభుత్వం ప్రకటించిన రూ.4000మద్దతు ధర కూడా రైతులకు అందడంలేదు. పదిరోజుల క్రితం కురిసిన తుపాన్ కారణంగా పత్తి తడిసిపోయిందనే కారణంతో వ్యాపారులు కేవలం క్వింటాలుకు రూ.3000నుంచి రూ.3500 మాత్రమే ధర చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు ప్రైవేట్ వ్యాపారులు వేలాది క్వింటాళ్లకుపైగా పత్తిని కొనుగోలు చేశారు. ఈ లెక్కన ఒక్క గజ్వేల్ ప్రాంతంలోనే ధర రూపేణా రైతులు ఇప్పటికే లక్షల్లో నష్టపోయారు. విధిలేక పత్తిని అమ్ముకున్నా మంచి ధర వస్తుందనే ఆశతో 18 క్వింటాళ్ల పత్తిని గజ్వేల్ యార్డుకు తెచ్చిన. ఇక్కడికొస్తే ఏం లాభం క్వింటాల్‌కు రూ.3,350 మాత్రమే చెల్లిస్తుండ్రు. వానలకు పత్తి కొద్దిగా తడిసినందుకే ఇంత ధర తక్కువ చేయడం న్యాయం కాదు. డబ్బులు అవసరముండి విధిలేక పత్తిని అమ్ముకున్న. - నర్సింలు, పత్తి రైతు,ఇంద్రానగర్,నల్గొండ -
సీసీఐ జాడేది?
గజ్వేల్, న్యూస్‌లైన్: పత్తి రైతుకు వెన్నుదన్నుగా నిలవాల్సిన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తా లేకుండా పోయింది. ఈసారి జిల్లాలో భారీగా పత్తి దిగుబడులు వచ్చే అవకాశమున్నా కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో తీవ్ర జాప్యం నెలకొంది. పైగా ప్రైవేటు వ్యాపారులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తుండటం.. మద్దతు ధర లభించకపోవడంతో రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉత్పత్తులు మార్కెట్లోకి రావడం ఊపందుకున్న తరుణంలో ఈ పరిస్థితి తలెత్తడం శాపంగా మారింది. జిల్లాలో ఈసారి 1.20 లక్షల హెక్టార్లలో పత్తి సాగైంది. సుమారు 2.6 లక్షల టన్నులకు పైగా దిగుబడులు వచ్చే అవకాశముంది. పత్తి రైతుల అవసరాల దృష్ట్యా జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, తొగుట, జోగిపేట, జహీరాబాద్‌లలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్కెట్లోకి ఉత్పత్తులు రావడం ఊపందుకున్నా ఈ కేంద్రాలను ఇంకా తెరవలేదు. ఫలితంగా ప్రభుత్వం ప్రకటించిన రూ.4 వేల మద్దతు ధర కూడా రైతులకు అందడంలేదు. గజ్వేల్‌లో పది రోజులుగా వ్యాపారులు కేవలం క్వింటాలుకు రూ. 3,700 నుంచి 3,800 వరకు మాత్రమే ధర చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు ప్రైవేట్ వ్యాపారులు సుమారు 2 వేల క్వింటాళ్లకుపైగా పత్తిని కొనుగోలు చేశారు. గుజరాత్, మహారాష్ట్రాలలో తెల్ల బంగారానికి రూ.4,500నుంచి 5,000 వరకు ధర పలుకుతుండగా ఇక్కడి నుంచి పదుల సంఖ్యలో లారీలను వ్యాపారులు తరలిస్తున్నారు. రైతులవద్ద తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తూ పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ దండుకుంటున్నారు. ఈ లెక్కన ఒక్క గజ్వేల్ ప్రాంతంలోనే ధర రూపేణా రైతులు ఇప్పటికే లక్షల్లో నష్టపోయారు. గతేడాదితో పోలీస్తే ఈసారి వర్షాలు సకాలంలో కురవడం వల్ల ఉత్పత్తులు తొందరగా మార్కెట్లోకి వచ్చాయి. సీసీఐ కొనుగోలు కేంద్రాలను తెరిచి ఉంటే రైతులకు నష్టం వాటిల్లకుండా ఉండేది. కమర్షియల్ పర్చేజ్ జరిగేనా.. 2011 నవంబర్ నెలలో పత్తి ధర పైపైకి ఎగబాకింది. రూ.4 వేల నుంచి ప్రారంభమైన ధర డిసెంబర్, జనవరి నెలలో రూ.7 వేల పైచిలుకు పలికింది. అంతర్జాతీయ పత్తి మార్కెట్లో ఏర్పడిన డిమాండ్ కారణంగా ధర అమాంతం పెరిగింది. నిజానికి ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ.3 వేలు మాత్రమే. సీసీఐ కేంద్రం నిబంధనల ప్రకారం మద్దతు ధరకే పత్తిని కొనుగోలు చేయాలి. కానీ నిబంధనలను సడలించుకొని ‘కమర్షియల్ పర్చేజ్’ పేరిట సీసీఐ కూడా రాష్ట్రంలోని వరంగల్, పెద్దపల్లి, ఖమ్మం, ఆదిలాబాద్‌తోపాటు గజ్వేల్ కేంద్రాల్లో ప్రైవేటు వ్యాపారులతో పోటీ పడి కొనుగోళ్లు చేపట్టింది. గరిష్టంగా గజ్వేల్‌లో రూ.7 వేల వరకు ధరను కూడా చెల్లించింది. ఈ లెక్కన గజ్వేల్‌లో ప్రైవేటు వ్యాపారులు, సీసీఐ పోటీలు పడి కొనుగోళ్లు చేపట్టడం వల్ల ఇక్కడ 2.72 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసి రికార్డును సృష్టించారు. కానీ రెండేళ్లుగా సీసీఐ సక్రమంగా కొనుగోళ్లను చేపట్టడం లేదు. కేంద్రాలను తెరవాలని సీసీఐని కోరాం పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరవాలని సీసీఐ ఉన్నతాధికారులను కోరాం. ఈసారి వర్షాలు సకాలంలో కురవడం వల్ల పత్తి ఉత్పత్తులు మార్కెట్లోకి తొందరగా రావడం ఆరంభమైందని వివరించాం. త్వరలోనే కేంద్రాలు ప్రారంభమయ్యే అవకాశమున్నది. ‘కమర్షియల్ పర్చేజ్’ చేపట్టాలని కూడా కోరాం. సంబంధిత అధికారుల సానుకూలంగా స్పందించారు. జిల్లాలో కొత్తగా సదాశివపేట, వట్పల్లిలలో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనల పంపాం. -రాజశేఖర్, జేడీ, మార్కెటింగ్‌శాఖ


