ప్రొద్దుటూరులో ఒక్కరోజే 16 పాజిటివ్‌.. | 16 New Corona Positive Cases Reported In Poddutoor | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరులో ఒక్కరోజే 16 పాజిటివ్‌..

Jun 18 2020 4:21 PM | Updated on Jun 18 2020 4:25 PM

16 New Corona Positive Cases Reported In Poddutoor - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ప్రొద్దుటూరులో ఒకేరోజు 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రొద్దుటూరు నడింపల్లి వీధిలో ఇటీవల కరోనా బారినపడి వృద్ధుడు మృతి చెందగా, ఆయన అంత్యక్రియలకు హాజరైన 12 మంది బంధువులకు కరోనా సోకింది. దస్తగిరిపేటలో ఇద్దరికి, పెన్నానగర్‌లో ఒకరికి, వైఎంఆర్‌ కాలనీలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రొద్దుటూరులో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 91కు చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో కరోనా నుంచి కోలుకుని బుధవారం 11 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. (టాయ్‌లెట్‌లో వారం రోజుల క్వారంటైన్)

Advertisement
 
Advertisement
Advertisement