రోడ్డు ప్రమాదం: 15 మంది భక్తులకు గాయాలు | 15 injured in road accident at srikalahasthi | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం: 15 మంది భక్తులకు గాయాలు

Jul 25 2015 8:39 AM | Updated on Aug 30 2018 3:56 PM

చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం చిన్న సింగనమల వద్ద తుఫాను వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.

శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం చిన్న సింగనమల వద్ద తుఫాను వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో తుఫాను వాహనంలో ఉన్న 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. గుంటూరు జిల్లా మాచవరానికి చెందిన వీరంతా తిరుమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను తొలుత శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. గాయపడిన వారిలో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement