
గన్నవరం ఎయిర్‌పోర్టు పరిధిలో 144 సెక్షన్ విధిస్తూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
సాక్షి, విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్టు పరిధిలో 144 సెక్షన్ విధిస్తూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రతా కారణాలతో పాటు వీఐపీల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ఆంక్షలు విధించినట్టు పేర్కొన్నారు. శనివారం నుంచి జులై 5 వరకు 55 రోజులపాటు ఎయిర్‌పోర్టు, పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.
ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిషేధమని స్పష్టం చేశారు. గన్నవరం విమానాశ్రయంతో పాటు పరిసర ప్రాంతాల్లోని 250 మీటర్ల పరిధిలో సెక్షన్ అమలులో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శాంతి భద్రతలతో పాటు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు.