బస్సు - ఆటో ఢీ: 14 మందికి గాయాలు | 14 injured in school bus road accident | Sakshi
Sakshi News home page

బస్సు - ఆటో ఢీ: 14 మందికి గాయాలు

Jan 10 2015 9:38 AM | Updated on Aug 30 2018 3:58 PM

పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కరుగోరుమిల్లి వద్ద శనివారం స్కూల్ బస్సు ... ఆటోను ఢీ కొట్టింది.

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కరుగోరుమిల్లి వద్ద శనివారం స్కూల్ బస్సు ... ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో స్కూల్ బస్సు ఆటోను ఢీ కొట్టింది. స్కూల్ బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement