ఆటో బోల్తా : 14 మందికి గాయాలు | 14 injure as Auto overturns | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా : 14 మందికి గాయాలు

Aug 14 2015 6:37 PM | Updated on Sep 3 2017 7:27 AM

వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో 14 మందికి గాయాలయ్యాయి.

కళ్యాణదుర్గం (అనంతపురం) : వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో 14 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గరుడాపురం చెరువుకట్టపై శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కళ్యాణదుర్గం నుంచి కుర్లపల్లికి వెళ్తున్న ప్యాసింజర్ ఆటో గరుడాపురం చెరువుకట్ట సమీపంలోకి చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 14 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement