హైదరాబాద్ వనస్థలిపురం వద్ద నగర పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్ వనస్థలిపురం వద్ద నగర పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. అందులోభాగంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు నుంచి రూ. 14.50 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నగదును సీజ్ చేసి, కారు డ్రైవర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే నిజామాబాద్ జిల్లా సారంగపూర్ చెక్ పోస్టు వద్ద ఈ రోజు ఉదయం పోలీసు వాహనాల తనిఖీలలో రూ. 4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. అనంతపురం జిల్లాలో పోలీసుల సొదాలలో భాగంగా ఇప్పటి వరకు రూ. 4 కోట్లుపైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆ జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు.