
పందుల పందాలు : 12 మంది అరెస్ట్
గుర్రపు పందాలు, కోళ్ల పందాలు ఆడుతున్న వారిపై పోలీసులు దాడి చేసి భారీగా నగదు స్వాధీనం చేసుకోవడం అప్పుడప్పుడూ వార్తలలో చూస్తున్నాం.
ఏలూరు: గుర్రపు పందాలు, కోళ్ల పందాలు ఆడుతున్న వారిపై పోలీసులు దాడి చేసి భారీగా నగదు స్వాధీనం చేసుకోవడం అప్పుడప్పుడూ వార్తలలో చూస్తున్నాం. వింటూన్నాం. కానీ పందుల పందెం గురించి విన్నారా. వినలేదా అయితే మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శివారులో కొందరు వ్యక్తులు పందుల పందెం నిర్వహించారు.
ఆ పందెంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు పందుల పందాలపై దాడి చేశారు. పందులను స్వాధీనం చేసుకున్నారు. ఆ పందాలకు సంబంధించి 12 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి వేలలో రూపాయిలను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు బైకులను రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.