విశాఖ జిల్లా పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
100 కిలోల గంజాయి పట్టివేత
Dec 29 2015 8:31 AM | Updated on Sep 3 2017 2:46 PM
	దేవరాపల్లి: విశాఖ జిల్లా పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం ఉదయం దేవరాపల్లి ఎస్సై అప్పన్న ఆధ్వర్యంలో పోలీసులు అనంతగిరి మండలం కివర్ల గ్రామం నుంచి వస్తున్న కారులో సోదాలు జరిపారు. అందులో తనిఖీ చేయగా బస్తాల్లో ఉన్న వందకిలోల గంజాయి పట్టు బడింది. ఇందుకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకుని, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు.
	 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
