పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా కొట్టిన ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి.
బుచ్చయ్యపేట (విశాఖపట్నం) : పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా కొట్టిన ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం విశాఖపట్నం జిల్లా బచ్చయ్యపేట మండలం బంగారమ్మ జంక్షన్ వద్ద గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.
బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామానికి చెందిన పెళ్లి బృందం పెళ్లి కూతురికి సారె తీసుకెళ్తుండగా..ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.