ట్రాక్టర్ బోల్తా.. యువతి మృతి | One dies and 4 injured as tractor overturns | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా.. యువతి మృతి

Jul 15 2016 7:34 PM | Updated on Sep 4 2017 4:56 AM

వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ యువతి మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆదిలాబాద్ : వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ యువతి మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూరు మండలం భూతాయి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులకు వెళ్లి వస్తున్న ట్రాక్టర్ గ్రామ శివారులో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో కామ్లే జ్యోతి(19) అనే యువతి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement