breaking news
-
యువతకు చంద్రబాబు మళ్ళీ వెన్నుపోటు: జక్కంపూడి రాజా
సాక్షి, తాడేపల్లి: అధికారం కోసం ప్రతిసారీ యువతను నమ్మించి మోసం చేయడం అలవాటుగా చేసుకున్న చంద్రబాబు మరోసారి తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించారని వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికి భృతి అంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు ఏదని ప్రశ్నించారు.చివరికి మెగా డీఎస్సీ అంటూ సీఎంగా చంద్రబాబు చేసిన తొలి సంతకానికే ఏడాది కాలంగా విలువలేని దారుణమైన పాలన ఏపీలో జరుగుతోందని ధ్వజమెత్తారు. కూటమి చేస్తున్న మోసాలపై యువత తీవ్ర ఆగ్రహంతో ఉందని, తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..వైఎస్సార్సీపీ యువజన విభాగంతో ఇవాళ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలపై గొంతెత్తాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ఆయన ఆదేశాలతో వైఎస్సార్సీపీ యువజన విభాగం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుంది. వైఎస్ జగన్‌ని సీఎం చేసే దాకా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం. ప్రభుత్వం మెడలు వంచి సూపర్ సిక్స్ పథకాలు అమలయ్యేలా చూస్తాం. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రానికి మంచి రోజులొస్తాయి. సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే ఆయన సీఎం కావాలి. ప్రభుత్వం కుట్రలు చేయడం మాని ఇకనైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రయత్నం చేయాలి.నిరుద్యోగులను దగా చేస్తున్న ప్రభుత్వమిదివైఎస్సార్సీపీ పాలనలో వైఎస్ జగన్ ప్రకటించిన టీచర్ పోస్టులను భర్తీ చేస్తానంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఏడాది పూర్తయినా దానికి దిక్కుమొక్కు లేకుండా చేశాడు. 2014లో నిరుద్యోగ యువతకు నెలకు రూ. 2వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసిన చంద్రబాబు, 2024 లోనూ నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్నారు. చంద్రబాబుకు వంతపాడే ఈనాడు పత్రిక లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 1.56 కోట్ల మంది నిరుద్యోగ యువత ఉంటే గత ఏడాది వారందరికీ ఒక్కొక్కరికి రూ. 36 వేలు చొప్పున చంద్రబాబు బకాయి పడ్డాడు. ఒక్క నిరుద్యోగ భృతి పేరుతోనే రూ.56 వేల కోట్లకు పైగా కూటమి ప్రభుత్వం బకాయిపడింది.కొత్త ఉద్యోగాల భర్తీ లేదు.. ఉన్న ఉద్యోగాల తొలగింపుకూటమి మేనిఫెస్టోలో ఏడాదికి 4 లక్షల చొప్పున ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పారు. ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ఏడాది గడిచినా రాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగికి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఎన్నికల్లో ప్రతి ఇంటికీ వెళ్లి సూపర్ సిక్స్ పేరుతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు సంతకాలు చేసిన బాండ్లు పంపిణీ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిలో ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వకపోగా ఒక్కో వ్యవస్థనూ ఎత్తివేస్తూ ఉన్న ఉద్యోగాలనే తీసేస్తున్నారు.వలంటీర్ల గౌరవం వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని చెప్పిన ఈ కూటమి పెద్దలు, చివరికి వారిని రోడ్డుపాలు చేశారు. గ్రామ వార్డు సచివాలయాల్లో 33 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా రేషనలైజేషన్ పేరుతో ఉన్న ఉద్యోగులే ఎక్కువని తేల్చేసి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తున్న ఎండీయూ వాహనాలను తీసేసి 15 వేల మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించారు. ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాల్లో పనిచేసే 18 వేల మంది ఉద్యోగులను తొలగించారు.ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్లో 2 వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా దాదాపు 15 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించి దాదాపు 2,360 మందికి ఉపాధి లేకుండా చేశారు. ఏపీఎండీసీలో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేసే దాదాపు 400 మంది ఉద్యోగులను, ఉద్యోగుల జీతాన్ని దళారులు దోచుకోకుండా కోతల్లేకుండా శాశ్వత ఉద్యోగులకు దక్కే అన్ని సౌకర్యాలు కల్పించిన ఆప్కాస్ అనే వ్యవస్థను రద్దు చేయాలనే కుట్ర జరుగుతోంది.వైఎస్ జగన్ పాలనలో 6.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలువైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో యువతకు అండగా నిలిచారు. ఉద్యోగాల భర్తీ నుంచి, ఉపాధి కల్పన వరకు చక్కని ప్రణాళికతో పాలనను సాగించారు. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే గ్రామ సచివాలయాలను ప్రారంభించారు. ఒకేసారి దాదాపు 1.36 లక్షల మంది సచివాలయ శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేశారు. 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించి సంక్షేమ పథకాలను ఇంటికే అందించారు.ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో కనీవినీ ఎరుగని రీతిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 6.30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఐదేళ్లలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో దాదాపు 48 వేల ఉద్యోగాలు ఇవ్వడం దేశ చరిత్రలో తొలిసారి. ఏపీయస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యకు ఎండ్ కార్డ్ వేశారు. ఎంఎస్ఎంఈల ద్వారా 33,82,242 మందికి ఉపాధి లభించింది. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో కలిపి 40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్టు సోషియో ఎకనమిక్ సర్వే రిపోర్టులో పొందుపర్చడం జరిగింది. -
అయ్య బాబోయ్ ఇంటింటికీనా..!
అలివిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు..తర్వాత వాటిని గాలికొదలడంతో ఐదేళ్ల వ్యతిరేకతను ఏడాదిలోనే మూటగట్టుకున్నారు. మహిళలు, రైతులు, ఉద్యోగులు ఇలా ఏ వర్గాన్ని కదిలించినా కూటమి పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సుపరిపాలన అంటూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని చెప్పడంతో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎన్నికల్లో గెలిచి ఏడాది దాటినా ఏ ఎమ్మెల్యే కూడా ఒక్క పల్లెకూ వెళ్లిన దాఖలాలు లేవు. ఈ క్రమంలోనే ఏడాదిలో చేసిన ‘సుపరిపాలన’ను ఇంటింటికీ వెళ్లి వివరించాలని సీఎం చంద్రబాబు చెబుతుండడంతో ప్రజల వద్దకు వెళ్లి ఏం చేశామని చెప్పాలంటూ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నట్టు తెలిసింది. ఓవైపు రెడ్‌బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నాం.. మరోవైపు పెన్షన్ మినహా అన్ని పథకాలకూ మంగళం పాడాం.. ‘అమ్మ ఒడి’ సగం కోతలు, సగం వాతలు తరహాలో ఇచ్చాం.. ఈ పరిస్థితుల్లో ఇంటింటికీ వెళితే మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడు వారి దగ్గరకు వెళ్లడం అంత మంచిది కాదని చాలా మంది ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు.కబ్జాలు, ఆక్రమణలతో వణుకు జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో ఎమ్మెల్యేల అనుచరులు భూ ఆక్రమణలు, కబ్జాలు ఇబ్బడిముబ్బడిగా చేశారు. దీంతో బాధితులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి దగ్గరకు వెళ్తే నిలదీసి కడిగిపారేస్తారన్న భయం ఎమ్మెల్యేల్లో ఉంది. అంతేకాదు తమ కార్యకర్తలు ఏం చేసినా పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసి విడిపించుకుంటున్నారు. బాధితులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. ‘తమ్ముళ్లు’ దాడులు చేసినా బాధితులకు న్యాయం లేదు. దీంతో ఎమ్మెల్యేలు తమ వార్డుల్లోకి వస్తే నిలదీసేందుకు స్థానికులు సిద్ధంగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.మహిళలు ‘బెల్టు’ తీస్తారు..! ఉమ్మడి జిల్లాలో 230 వైన్ షాపులుండగా.. 2,100 బెల్టుషాపులు ఉన్నాయి. ఈ క్రమంలో విచ్చలవిడిగా మద్యం లభ్యమవుతుండడంతో పేద కుటుంబాలు గుల్లవుతున్నాయి. దీంతో మహిళల్లో ఆగ్రహ జ్వాలలు కట్టలు తెంచుకుంటున్నాయి. ఇప్పటికే శ్రీ సత్యసాయి జిల్లాలో కొన్ని చోట్ల నిరసనలకు దిగారు. ఇలాంటి సమయంలో పల్లెలకు ఎమ్మెల్యేలు వెళితే ‘బెల్టు’ తీస్తారేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఉద్యోగులు నిజం తెలుసుకున్నారు.. ఉద్యోగులందరూ ఎన్నికల్లో టీడీపీకి గంపగుత్తగా ఓట్లేశారని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. కానీ తాజా పరిస్థితులు చూస్తే ఉద్యోగ వర్గాలు ప్రభుత్వ తీరుపై నిప్పులు కక్కుతున్నాయి. బదిలీల్లో నాయకుల పాత్రపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. సిఫార్సు లేఖలు, లంచాలతో తమకు కావాల్సిన వారిని దగ్గరకు చేర్చుకోవడంతో వేలాది మంది సామాన్య ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి విభాగం బదిలీలోనూ అవినీతి అక్రమాలే. ఈ సమయంలో ఎమ్మెల్యేలకు అన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఆగ్రహంలో రైతన్నలుప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది. ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20 వేలు అందిస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. కానీ రెండో ఏడాది వచ్చినా పైసా ఇవ్వలేదు. ఖరీఫ్ ప్రారంభమైనా రూపాయి అందించలేదు. పైగా పండిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. దీంతో అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారు. ‘ఎమ్మెల్యేలైతే మాకేంటి..ఊర్లోకి వస్తే చూస్తాం’ అంటూ మండిపడుతున్నారు. -
రాజకీయంగా ఎన్ని ఇబ్బందులొచ్చినా రాజీ పడలేదు: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం అనేది రాజకీయాల్లో ఎంతో ముఖ్యమని, అందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని యువ విభాగాన్ని ఉద్దేశించి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన యువ విభాగ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘యూత్ వింగ్ అనేది పార్టీలో క్రియాశీలకమైంది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర. పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి. లీడర్లుగా ఎదిగేందుకు ఇప్పుడు గొప్ప అవకాశం. పార్టీ ప్రారంభించిన కొత్తలో అందరూ కొత్తవాళ్లే. పార్టీ పెట్టిన కొత్తలో నేను, మా అమ్మ మాత్రమే ఉన్నాం. నామీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్నవాళ్లు నాతో వచ్చారు. నా ప్రస్థానం అక్కడ నుంచి మొదలయ్యింది.. .. ఉప ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీ నాకు వచ్చింది. పార్లమెంటులో ప్రతి సభ్యుడూ మనవైపు చూసే పరిస్థితి. దాన్ని జీర్ణించుకోలేక మనమీద పగబట్టారు. 18 మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తే.. వాళ్లందరిచేతా రాజీనామా చేయించాను. ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించాం. ఆ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ కలిసే పోటీచేశాయి. 2014లో 67 మందితో గెలిచాం. మళ్లీ మన దగ్గర నుంచి 23 మందిని లాక్కున్నారు. .. ఎన్నికష్టాలు వచ్చినా, విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశాం. రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా రాజీ పడలేదు. ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది చాలా ముఖ్యం. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ప్రజలకు తోడుగా నిలబడాలి. మంచి పలకరింపు అన్నది కూడా చాలా ముఖ్యం. ఇవి చేయగలిగితే.. లీడర్‌గా ఎదుగుతారు. యూత్ వింగ్‌లో ఉన్న వారు ప్రభావంతంగా పనిచేయాలి. రాజకీయంగా ఎదగడం మీ చేతుల్లో ఉంది. మిమ్మల్ని రాజకీయంగా పెంచడం నా చేతుల్లో ఉంది. పెరగాలంటే.. మీరు కష్టపడాలి. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయండి. సమర్థత ఉన్నవారిని పార్టీ వ్యవస్థల్లోకి తీసుకురండి. పార్టీని వ్యవస్థీకృతంగా బలోపేతం చేయాలి... మీ పనితీరును మీరు ఎప్పటికప్పుడు మీరే మదింపు చేసుకోండి. జోన్ల వారీగా యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా పెడుతున్నాం. ఎమ్మెల్యేలుగా పోటీచేసిన యువకులు దీనికి ఉంటారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలోకి రావాలి. వాస్తవాలను చెప్పడానికి ఇది ఒక ఆయుధం. అన్యాయాలను, అక్రమాలను ఈ మాధ్యమం ద్వారా వెలుగులోకి తీసుకురావాలి. ప్రజలందరి దృష్టికి ఈ సమాచారాన్ని చేరవేయాలి. ఎవరికి, ఏ అన్యాయం జరిగినా సమాజం దృష్టికి తీసుకు రావాలి అని వైఎస్ జగన్ సూచించారు. ఈ భేటీలో యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సహా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు హాజరయ్యారు. -
హోం మంత్రి అనితకు చేదు అనుభవం
హోం మంత్రి వంగలపూడి అనితకు చేదు అనుభవం ఎదురైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి బాలికల గురుకుల హాస్టల్ 'సందర్శనకు వెళ్లిన ఆమెను సమస్యలు పలకరించాయి. హాస్టల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ పలువురు బాలికలు ఆమెకు ఫిర్యాదు చేశారు. దీంతో.. ఆమె చేసేది లేక అధికారులపై చిందులు తొక్కారు. హోం మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. అయితే ఆమె అక్కడి బాలికల గురుకుల హాస్టల్‌ను సందర్శించారు. ఆ టైంలో గురుకుల హాస్టల్స్ దుస్థితి వెలుగులోకి వచ్చింది. భోజనంతో పాటు మెయింటెనెన్స్ కూడా బాగా లేదంటూ విద్యార్థినిలు హోం మంత్రికి చెప్పారు. దీంతో ఆమె కాస్త అసహనానికి గురయ్యారు.‘‘43 మంది ఆడ పిల్లలు చదువుతున్న హాస్టల్ వద్ద కనీసం సీసీ కెమెరాలు లేవు. వార్డెన్ పిల్లల్ని వదిలేసి 5 గంటలకే వెళ్ళిపోయింది. సన్న బియ్యం ఇవ్వాలని చెప్పినా అమలు కావడం లేదు. నాణ్యమైన భోజనం అందడం లేదు. ఇద్దరు అధికారులను ఎత్తేస్తే అందరికీ బుద్ధి వస్తుంది అంటూ ఆమె అధికారులపై మండిపడ్డారు. -
దేవుడు చూస్తూ ఊరుకోడు: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: లిక్కర్ స్కాం కేసు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులో తనను అక్రమంగా ఇరికించారని మీడియా ముందు వాపోయారాయన. ఈ కేసులో సిట్ కస్టడీకి తరలించే క్రమంలో మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో పోలీసులు ఆయనతో దురుసుగా ప్రవర్తించారు.‘‘నాపై తప్పుడు కేసులు పెట్టారు. అన్నింటికీ కాలం సమాధానం చెబుతుంది. దేవుడు చూస్తూ ఊరుకోడు’’ అని అన్నారాయన. ఆ సమయంలో పోలీసులు ఆయన్ని బలవంతంగా వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. కాగా, ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు నేటి(జులై 1వ తేదీ) నుంచి చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడిని సిట్ మూడు రోజులపాటు విచారించనుంది.విచారణకు ముందు జిల్లా జైలు నుంచి చెవిరెడ్డిని అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం విచారణ నిమిత్తం సిట్ కార్యాలయానికి తరలించారు. -
బాబు, పవన్‌ను ఓడిద్దాం.. ముస్లింలకు అసదుద్దీన్ పిలుపు
కర్నూలు (టౌన్): బీజేపీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మద్దతుగా నిలిచి ముస్లింలను దగా చేశారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సోమవారం రాత్రి కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ‘వక్ఫ్ బచావో.. దస్తూర్ బచావో’ నినాదంతో బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబును ముస్లింలు ఎన్నటికీ మరువరన్నారు. టీడీపీలో పనిచేస్తున్న ముస్లింలు, ప్రజాప్రతినిధులు, నాయకులు బయటకు రావాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వక్ఫ్ బోర్డు సవరణల్ని వ్యతిరేకించారని గుర్తు చేశారు.వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఎన్నికలు వచి్చనా టీడీపీ, జనసేన పార్టీలను చిత్తుగా ఓడిద్దామని పిలుపునిచ్చారు. అమరావతి అభివృద్ధి పేరుతో చంద్రబాబు రూ.వేల కోట్లను ఆయన వర్గీయులు, బంధువులకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. వక్ఫ్ అమలుకు ప్రతి ముస్లిం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల ఏరివేత ముసుగులో ముస్లింలను బీజేపీ ఇబ్బందులు, వేధింపులకు గురి చేస్తోందన్నారు. పహల్గాంలో అమాయకులను ఊచకోత కోసిన నిందితులను మోదీ ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోతోందని ప్రశ్నించారు.ఆర్ఎస్ఎస్ దేశంలో పేట్రేగిపోతోందని, మసీదులు, దర్గాలను టార్గెట్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫర్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ముస్లిం మతపెద్దలు, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై టీడీపీ కుట్రలు
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనపై టీడీపీ కుట్రలకు తెరలేపింది. జులై 3న వైఎస్ జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తోంది. హెలిప్యాడ్‌కి అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు కలిగిస్తోంది. వైఎస్ జగన్ ప్రజాదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. 27న వైఎస్ జగన్ పర్యటన కోసం వైఎస్సార్సీపీ నేతలు దరఖాస్తు చేశారు.ఇప్పటికి అనుమతి ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. కేవలం 100 మందే రావాలంటూ పార్టీ నేతలకు పోలీసులు ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ స్థలం యజమానికి అధికారులు, పోలీసులు ద్వారా బెదిరింపులకు దిగుతున్నారు. వైఎస్ జగన్ ఏ జిల్లాకు వెళ్లిన పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ఆయన పర్యటనపై టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. అక్కసుతో హెలిప్యాడ్ రద్దు చేయించేలా టీడీపీ నేతలు కుట్రలు పన్నుతూ.. అడుగడుగునా అడ్డంకులు పెడుతున్నారు.ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ రావడం తథ్యం: అనిల్వైఎస్ జగన్ పర్యటనపై 10 రోజుల క్రితమే సమాచారం ఇచ్చామని.. పర్మిషన్ ఇవ్వకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ రావడం తథ్యమన్నారు. -
వారు దుండగులు కాదా?.. టీడీపీ వారైతే ఏ పనిచేసినా ఓకేనా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌ల చేసిన ఒక ప్రకటనను అంతా స్వాగతించాలి. హైదరాబాద్ లో ఒక న్యూస్ ఛానల్ పై జరిగిన దాడిని వారు ఖండించారు. కూటమి పెద్దల భావజాలంలో మార్పు వచ్చి ఉంటే సంతోషించాలి. కాని వారు అన్ని విషయాలలో మాదిరి ఇక్కడ కూడా డబుల్ గేమ్ ఆడడం బాగోలేదని చెప్పాలి. చంద్రబాబు చేసిన ప్రకటనను గమనించండి. హైదరాబాద్ లో ఒక టీవీ చానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విద్వంసం సృష్టించడం దారుణమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలు,సమాజం దీనిని ఆమోదించదని అంటూ,ఆ ఛానల్ యాజమాన్యానికి ,సిబ్బందికి ఆయన సంఘీభావం తెలియచేశారు. 👉చంద్రబాబు ఈ ప్రకటన చేసిన వెంటనే అందరికి గుర్తుకు వస్తున్నది ఏపీలో ఉన్న పరిస్థితి గురించే. ఏపీలో తనకు నచ్చని మీడియాపై ప్రభుత్వం చేస్తున్న దాడి, ప్రత్యేకించి సాక్షి మీడియాపై కూటమి సర్కార్ చేస్తున్న కుట్రలు చూస్తున్న ఎవరికి అయినా చంద్రబాబు మాటలను విశ్వసించే పరిస్థితి కనిపించదు. తమకు మద్దతు ఇస్తే ఒక రకంగాను, లేకుంటే మరో రకంగాను టీడీపీ, జనసేనలు వ్యవహరిస్తున్న తీరు ఇట్టే తెలిసిపోతుంది.👉ఈ మధ్య సాక్షి టీవీ డిబేట్ కు సంబందించి ఒక వివాదాన్ని సృష్టించి కొంతమందిని రెచ్చగొట్టి ఆందోళనలు చేయించిన తీరు,ఆ తర్వాత కేసులు పెట్టడమే కాకుండా.. జర్నలిస్టులను అరెస్టు చేసిన వైనం, అక్కడితో ఆగకుండా సాక్షి మీడియా కార్యాలయాలపై టీడీపీకి చెందినవారు చేసిన దాడులు,వీరంగం వేసి విధ్వంసం సాగించిన పద్దతి గురించి కూడా కూటమి నేతలు మాట్లాడి వాటిని ఖండించి ఉండాలి కదా!. పైగా అనని మాటలు అన్నట్లుగా, ఒక ప్రాంతానికి ఆపాదించి సాగించిన రచ్చ అందరిని ఆశ్చర్యపరచింది. సాక్షి సంస్థలపై దాడులకు పాల్పడినవారిపై కేసులు పెట్టి ఎందుకు అరెస్టు లు చేయలేదు? అలా చేసినవారు దుండగులు కాదా?వారు టీడీపీ వారైతే ఏ పనిచేసినా ఓకేనా?ప్రజాస్వామ్యంలో బెదిరింపులు ,దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని చెబుతున్న చంద్రబాబుకు ఏపీ విషయంలో అదే సూత్రం వర్తించదా?.. దీనికి ఆయన ఏమి జవాబిస్తారు. నిత్యం సాక్షిపై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తూ, ఆ మీడియాను ఎలా దెబ్బతీయాలా అన్న ఆలోచన సాగించే ఆయన తనకు మద్దతు ఇచ్చే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలకు మాత్రమే స్వేచ్చ ఉండాలని చెప్పడం సహేతుకమే అవుతుందా?. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం.👉సాక్షి డిబేట్లో ఒక పదం అభ్యంతరకరం అని ఎవరైనా భావిస్తే భావించవచ్చు. దానిపై వివరణ కోరవచ్చు. కాని అసలు ఆ పదం పలకని జర్నలిస్టునే అరెస్టు చేశారే!. విచిత్రం ఏమిటంటే డిబేట్లో ఒక విశ్లేషకుడు ఒకసారి ఆ పదాన్ని ఉచ్చరిస్తే, తెలుగుదేశం మీడియా సంస్థలు వందల సార్లు ప్రచారం చేశాయి. అలాగే లక్షల పత్రికలలో దానిని యధాతధంగా ప్రచురించాయి. ఆ విశ్లేషకుడు మాట్లాడింది అభ్యంతరకర పదమే అనుకుంటే దానిని ఎల్లో మీడియా ప్రచారం చేయకూడదు కదా?. కాని ఎందుకు విచ్చలవిడిగా ప్రచారం చేశారు. వారు చేసింది ఇంకా పెద్ద నేరం అవుతుంది కదా!, మరి వారిపై కేసులు పెట్టరా?దీనిపై ప్రభుత్వంకాని, పోలీసు కాని, న్యాయ వ్యవస్థకాని ఎందుకు స్పందించలేదంటే ఏమి చెబుతాం. హైదరాబాద్ లో దాడికి గురైన టీవీ చానల్ కొన్ని వీడియాలకు పెట్టిన తంబ్ నెయిల్ చాలా దారుణంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో పలువురు వ్యాఖ్యానించారు. ఈ అంశాలను టీడీపీ, జనసేన పెద్దలు కనీసం ఖండించలేదు. అయినా ఆ సంస్థపై దాడి చేయాలని ఎవరం చెప్పం. చట్టప్రకారం పోవాల్సిందే. ఏపీలో సాక్షి మీడియా వివరణ ఇచ్చినా అన్యాయంగా దాడులు చేశారే!. సాక్షిపై దాడులు జరుగుతున్నప్పుడు , ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు ఇష్టారీతిన విమర్శలు ఆరోపణలు చేస్తున్నప్పుడు టీడీపీ మీడియా చంకలు గుద్దుకుంటూ మరింత రెచ్చిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. ఏపీలోప్రభుత్వం.. వాళ్లకు బంధించిన మీడియా కలిసి మరీ నానా బీభత్సం సృష్టించినప్పుడు ప్రజాస్వామ్యం, బెదిరింపులు, మీడియాను కట్టడి చేయడం వంటి అంశాలు.. చంద్రబాబుకు ఎందుకు గుర్తుకు రాలేదన్న ప్రశ్నకు సమాధానం దొరకదు!!.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. రాష్ట్రం అంతా గంజాయి కేంద్రం అయిపోయిందని చంద్రబాబు,ఇతర కూటమి నేతలుతీవ్ర విమర్శలు చేసేవారు. అంటే అప్పుడు ఏపీలో ఉన్నవారంతా గంజాయి తీసుకుంటున్నారని చంద్రబాబు అన్నట్లు భావించాలా?. పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు 30 వేల మంది మహిళలు ఏపీలో మిస్ అయిపోయారని ప్రచారం చేసినప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినలేదా?. అంతెందుకు తిరుమల పవిత్ర ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని స్వయంగా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ఆరోపించినప్పుడు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినలేదా?. అయినా ఎవరిపైన ఎందుకు కేసులు పెట్టలేదు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాని తమకు అధికారం ఉంది కదా అని విషయాన్ని వక్రీకరించి సాక్షిపై దాడి చేయడం ,కేసులు పెట్టి వేధించడం మాత్రం ప్రజాస్వామ్యబద్దం అని వారు భావిస్తున్నట్లా?. సాక్షిని మాత్రమే కట్టడి చేయాలన్నది వారి అభిమతమా?. అంతెందుకు.. సాక్షి టీవీ చానల్ ప్రజలలోకి వెళ్లరాదన్న ఉద్దేశంతో ఆయా నగరాలలో ,పట్టణాలలో కేబుల్ టీవీ ఆపరేటర్లపై ఒత్తిడి చేసి సాక్షి ప్రసారం కాకుండా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మీడియా స్వేచ్చ గురించి నీతులు చెబితే ఎవరైనా నమ్ముతారా?.. చంద్రబాబు కు ఇది కొత్తేమి కాదు. 2014 టైమ్‌లో కూడా కూడా సాక్షితో పాటు మరికొన్ని చానళ్లపై కూడా ప్రత్యక్షంగానో,పరోక్షంగానో నిషేధం పెట్టారు. అప్పట్లో కాపుల రిజర్వేషన్ ఉద్యమం జరుగుతుంటే,ఆ వార్తలు ప్రచారం కాకుండా ఎన్నిరకాల ఆటంకాలు కలిగించారో అందరికి తెలుసు. ఈసారి కూడా సాక్షి టీవీతో మరో రెండు చానళ్లపై కూడా ఆంక్షలు విధించారని చెబుతున్నారు. ఇదీ చంద్రబాబుకు మీడియా స్వేచ్చపై ఉన్న విశ్వాసం. ఎదుటివారికి చెప్పేందుకే నీతులు అన్న సూత్రం బాగా వర్తిస్తుందా?ఇక పవన్, లోకేష్ లు కూడా టీవీ చానల్ పై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే అభిప్రాయపడ్డారు. తమ రాష్ట్రంలో మాత్రం మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి కాదని వీరు భావిస్తున్నారన్నమాట.ఏపీలో జర్నలిస్టులను అరెస్టు చేయించి,అదేదో గొప్పపనిగా ఛాతి విరుచుకున్న నేతలు తెలంగాణలో జరిగిన ఘటనకు గుండెలు బాదుకుంటున్నారు. దీనినే హిపోక్రసి అంటారు.అలా అని హైదరాబాద్ లో దాడి ఘటనను సమర్ధించడం లేదు.కాని ఏపీలో కూటమి నేతల తీరుతెన్నులు మాత్రం ఇలా రెండుకళ్ల సిద్దాంతంతో సాగుతుండడమే బాధాకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రేపు వైఎస్సార్సీపీ యువజన విభాగం సభ్యులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ యువజన విభాగం సభ్యులతో రేపు (మంగళవారం) ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు. రేపు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ యువజన విభాగం ప్రతినిధులతో సమావేశమవనున్నారు. ఈ భేటీలో యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, యువజన విభాగం జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు పాల్గొంటారు. వీరితో పాటు పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నారు. -
సంక్షేమానికి నిజమైన అర్థం.. వైఎస్ జగన్ పాలన: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అ«ధ్యక్షుడు ఖాదర్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ మైనారిటీ విభాగం ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ విభాగాల అ«ధ్యక్షులతో పాటు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా పట్టిష్టం చేయడం మన ప్రధాన కర్తవ్యంమన్నారు. మన పార్టీకి నిజమైన బలం కార్యకర్తలేనని.. మన నాయకుడు వైఎస్ జగన్ శక్తి కూడా కార్యకర్తలేనని.. పార్టీ తన ప్రస్థానంలో అనేక రికార్డులు సృష్టించిందన్నారు.‘‘వైఎస్ జగన్ తన పాలనలో పలు విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. పాలనలో డెలివరీ మెకానిజం డెవలప్ చేయడంతో పాటు, విద్య, వైద్యం వంటి కోర్ సెక్టార్స్‌ను ప్రతి గడపకు తీసుకెళ్ళారు. రాష్ట్రాన్ని అభ్యుదయ పథంలో నడిపించేందుకు, ఏమేం చేయాలో ఆలోచించి, వాటిని అమలు చేశారు. సంక్షేమానికి నిజమైన అర్థం చెప్పిన పాలన మనది. అదే కూటమి ప్రభుత్వంపై ఏడాది పాలనతోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది’’ అని సజ్జల పేర్కొన్నారు.అడ్డుకుంటూ.. అరాచకం:మరో వైపు జగన్ ప్రజాదరణ నానాటికి మరింత పెరుగుతోంది. ఆయన ఎక్కడికి వెళ్లినా, స్వచ్ఛందంగా వేలాది మంది తరలి వస్తున్నారు. అందుకే ఆయన పర్యటనలు అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఇటీవల పలు ఆంక్షలతో జగన్ పల్నాడు జిల్లా పర్యటన అడ్డుకోవాలని చూస్తే, సాధ్యం కాలేదు. ఇప్పుడు నెల్లూరు జిల్లా పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసులు పెట్టి ఎలాగైనా కట్టడి చేయాలని చూస్తున్నారు. పొలీసులను అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారు.అప్రకటిత ఎమర్జెన్సీ:కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. ప్రశ్నించే గొంతులు నొక్కుతోంది. ఎక్కడికక్కడ అణిచివేసే ధోరణితో పని చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపే తప్పుడు సంప్రదాయానికి ఈ ప్రభుత్వం నాంది పలుకుతోంది. అయితే ఆ కేసులు ఎదుర్కొనే సత్తా మన నాయకుడికి ఉంది. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. ఒక్క పథకం కూడా అమలు చేయకున్నా, లక్షల కోట్ల అప్పు చేస్తున్నారు.వైఎస్సార్సీపీ.. మైనారిటీ సంక్షేమం:ఎన్నికలు ఎప్పుడొచ్చినా, మనం ధీటుగా ఎదుర్కోగలం. మనం సంస్థాగతంగా ఇంకా బలపడాలి. పార్టీ నెట్వర్క్ అనేది కేంద్ర కార్యాలయం నుంచి గ్రామస్థాయి వరకు వెళ్ళాలి. పార్టీలో అన్ని కమిటీల నియామకం పూర్తయితే 18 లక్షల మంది క్రియాశీలక సభ్యులవుతారు. అప్పుడు చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలు, రాష్ట్రానికి చేస్తున్న నష్టాలను ఇంకా గట్టిగా ప్రచారం చేయగలం. అలాగే మన పార్టీపై అదే పనిగా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ధీటుగా ఎదుర్కోగలగుతాం.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు జరిగింది. ముఖ్యంగా మైనారిటీల సంక్షేమం గతంలో ఏనాడూ లేని విధంగా గత ప్రభుత్వంలో కొనసాగింది. మన పార్టీ ఎప్పుడూ మైనారిటీల పక్షాన నిలబడింది. ఇక ముందు కూడా అలాగే ఉంటుంది. అందుకే ఎన్నికలు ఎప్పుడొచ్చినా మైనారిటీలంతా మన వెంటే ఉండేలా, మీరంతా కృషి చేయాలి. చొరవ చూపాలి. ఇంకా వైఎస్సార్సీపీ వక్ఫ్ బిల్లును వ్యతిరేకించిన విషయాన్ని ముస్లింలలో విస్తృతంగా ప్రచారం చేయాలన్న సజ్జల.. పార్టీ ఎప్పుడూ ముస్లింల సంక్షేమం కోరుకుంటుందని స్పష్టం చేశారు. -
చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది: అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: టీడీపీ ఎమ్మెల్యేలు దోపిడీ కార్యక్రమాల్లో మునిగిపోయారని నిన్నటి పొలిట్ బ్యూరో సమావేశానికి 56 మంది గైర్హాజరు అయ్యారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి 15 మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో విహరిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక దోపిడీ చేస్తూ, మద్యం కమిషన్లు దండుకుంటూ వారంతా బిజీగా ఉన్నారు. అబద్దాలను నిజం చేయటానికి ఎల్లోమీడియా ద్వారా విషం చిమ్ముతున్నారు’’ అంటూ అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.2014-2019 మధ్య జనాన్ని మోసం చేసినందునే 2019 ఎన్నికలలో చంద్రబాబు ఓటమి పాలయ్యారు. రైతు రుణమాఫీ సహా ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. అందుకే జనం ఓడించారు. 2024లో గెలిచాక కూడా మళ్ళీ జనాన్ని మోసం చేస్తున్నారు. జగన్ ఖజానాని ఖాళీ చేశారనీ అందుకే సంక్షేమాలను అమలు చేయలేదని అబద్దాలు మొదలు పెట్టారు. పెద్ద పెద్ద కాంట్రాక్టులన్నీ లోకేష్ కమీషన్లు తీసుకుని టెండర్లు పిలుస్తున్నారు. రెండు లక్షల కోట్లు అప్పు చేసి అమరావతి నిర్మాణం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. ఈ ఒక్క ఏడాదే దుర్మార్గపు పాలన చేశారు. రానున్న రోజుల్లో ఇంకా పరమ దుర్మార్గపు పాలన చేస్తారు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.‘‘గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది. మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. కుప్పంలోనే ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొడితే ఏం చేశారు?. డైలాగులు చెప్పినంత సీరియస్‌గా పరిపాలన చేయటం లేదు. లోకేష్ కు సిగ్గు ఉంటే టెన్త్ మూల్యాంకనం తప్పిదాలకు బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లోకేష్‌కు అలాంటి సిగ్గు లేదు. చంద్రబాబు చేతిలో పాలన లేదు.. అంతా లోకేషే. ఇన్నేసి దుర్మార్గాలు చేస్తూ సుపరిపాలన అని ఎలా చెప్తారు?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.‘‘జగన్ అంటే చంద్రబాబుకు విపరీతమైన ఈర్ష్య, భయం. కూటమి ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతోందని ఎల్లో మీడియానే చెప్తోంది. ఎమ్మెల్యేలేమో చంద్రబాబు గ్రాఫే పడిపోయిందని చెప్తున్నారు. ఒక్క సంవత్సరంలోనే ఈ స్థాయిలో గ్రాఫ్ పడిపోవటం ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడానికే పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారు. ఎండీయూ వాహనాలు, వాలంటీర్లను తొలగించి సామాన్యులను కూడా వేధిస్తున్నారు. చంద్రబాబు మాటలను ఆయన పార్టీ వారే వినిపించుకోవటం లేదు. చంద్రబాబుకు తెలియకుండా 15 మంది ఎమ్మెల్యేలు విదేశాలకి వెళ్లిపోయారంటే ఆయనకు పార్టీ మీద ఏమాత్రం పట్టు లేదని తేలిపోయింది..జగన్ నెల్లూరు వెళితే టీడీపీ వారికి ఏంటి ఇబ్బంది?. హెలికాఫ్టర్ కాకపోతే కారులోనో లేదంటే నడుచుకుంటూ అయినా వెళ్తారు. జగన్‌కు 40 నుండి 60 శాతం ఆదరణ పెరిగింది. ఇది టీడీపీ సర్వేలోనే తేలిందని చంద్రబాబు, లోకేష్, పవన్ మాటలు వింటుంటేనే అర్థం అయింది. అందుకే జగన్ పర్యటనలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకే ఊడిగం చేస్తానని పవన్ అంటున్నారు. వ్యతిరేకత పెరిగితే కూటమికైనా ఓటమి తప్పదు. జగన్‌ని కట్టడి చేయటానికే ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవటం నీచ సంస్కృతి’’ అంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు. -
బదిలీల పేరుతో ఉద్యోగులకు కూటమి సర్కార్ వేధింపులు: చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: బదిలీల పేరుతో కూటమి సర్కార్ ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల బదిలీలను సైతం కూటమి ఎమ్మెల్యేలు తమ అక్రమార్జనకు ఆదాయ వనరుగా మార్చుకుంటున్న దారుణమైన పరిస్థితి ఏపీలో నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలిసారిగా గ్రామస్థాయికి పాలనను అందించేందుకు వైఎస్ జగన్ హయాంలో తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సర్వ నాశనం చేస్తూ, అందులోని సిబ్బంది సంఖ్యను కుట్రపూరితంగా తగ్గించివేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి. ఎవరు డబ్బులిస్తే వారికి ఎక్కడికి కావాలంటే అక్కడికి వేగంగా బదిలీలు జరిగిపోతున్నాయి. అనధికారికంగా బదిలీలకు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను తప్పనిసరి చేస్తూ రాజకీయ జోక్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు. దాదాపు 95 శాతం బదిలీలు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల ద్వారానే జరుగుతున్నాయి. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న దాదాపు 1.40 లక్షల మంది ఉద్యోగుల బదిలీల కోసం జీవోఎంస్ నెంబర్ 5 ని విడుదల చేశారు. వైయస్సార్సీపీ హయాంలో చివరి ఏడాది నిబంధనల మేరకు ఉద్యోగుల బదిలీలు జరిగితే, కూటమి ప్రభుత్వం వచ్చాక నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బదిలీల పేరుతో ఉద్యోగులను వేధిస్తున్నారు.సచివాలయ వ్యవస్థపై కక్షసాధింపువైఎస్ జగన్ తీసుకొచ్చిన గ్రామ సచివాలయాల వ్యవస్థకు మంచి పేరు రావడంతో దాన్ని ఎలాగైనా నిర్వీర్యం చేయాలనే కుట్రతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటికే సచివాలయాల్లో రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించిన ప్రభుత్వం, కొత్తగా నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగులకు అన్యాయం చేసింది. ఇప్పుడు సచివాలయాల్లో బదిలీల పేరుతో ఉద్యోగులను వేరే మండలాలకు బలవంతంగా పంపించి వేధిస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఒక రూల్, పట్టణాల్లో వార్డు సచివాలయాల్లో పనిచేసేవారికి వేరే రూల్ వర్తింపజేస్తున్నారు. బదిలీల పేరుతో చిన్నస్థాయి ఉద్యోగులను డబ్బుల కోసం ఒత్తిడికి గురిచేస్తున్నారు. ప్రభుత్వమే ఉద్యోగుల చేత తప్పులు చేయించే కార్యక్రమానిక ఉసిగొల్పుతున్నట్టుంది.పనివేళల్లోనే బదిలీలు పూర్తిచేయాలిభర్త చనిపోయి వితంతువులుగా ఉన్న ఉద్యోగులకు, కేన్సర్ వంటి వ్యాధులతో ఇబ్బంది పడేవారికి, స్పౌస్ కేస్ల్లో కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉన్నా, వారి అభ్యర్థనలను పట్టించుకోవడం లేదు. గ్రామ సచివాలయాల బదిలీలకు జూన్ 30తో గడువు ముగిసిపోయింది. నిబంధనల ప్రకారమే ఉద్యోగుల బదిలీలు పూర్తి చేయాలని వైయస్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లాలో 12 రోజుల కిందట డెలివరీ అయిన ఒక బాలింతరాలు, ఒక మహిళా ఉద్యోగిని కౌన్సిలింగ్ పేరుతో ఉద్యోగులు ఉదయం నుంచి రాత్రి వరకూ కుర్చోబెట్టి వేధించడంతో ఆమె అస్వస్థతకు గురై ఇంటికెళుతూ మార్గమధ్యలో చనిపోయింది. ఆమె కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారు? నిబంధనల ప్రకారమే ఆఫీసు వేళల్లోనే ఉద్యోగుల బదిలీలు పూర్తి చేయాలి. రాత్రింబవళ్లు తిప్పించుకుని వేధించడం ఆపాలి. -
అవకాశవాదులకు బైబై.. సొంత కార్యకర్తలకు జైజై
భారతీయ జనతా పార్టీ తెలుగువ రాష్ట్రాల శాఖలకు నూతన అధ్యక్షులను నియమించే విషయంలో పలు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని స్వచ్ఛమైన సొంత పార్టీ కార్యకర్తలకు మాత్రమే పట్టంగట్టింది. ఈ విషయంలో పైరవీలు రికమండేషన్లకు తావు లేకుండా నికార్సైన బిజెపి కార్యకర్తలకు పార్టీ పగ్గాలు అప్పగించింది. తెలంగాణకు ఎన్ రామచంద్రరావుని అధ్యక్షునిగా నియమించగా ఆంధ్ర ప్రదేశ్‌కు పివిఎన్ మాధవ్ ను సారధిగా నియమించారు. ఈ నియామకం విషయంలో పార్టీ ఢిల్లీ పెద్దలు పలు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ప్రస్తుతం బిజెపి అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరి అవకాశవాదాన్ని కేంద్రంలోని బిజెపి పెద్దలు క్షమించే ఉద్దేశంలో లేకపోబట్టి ఆవిన్ను పక్కకు తప్పించారు. వాస్తవానికి ఆవిడ టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కుమార్తె అయినప్పటికీ కాంగ్రెస్ తరపున రెండుసార్లు ఎంపీగా కేంద్రంలో మంత్రిగా పనిచేశారు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ లో ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో ఆమె గత్యంతరం లేని పరిస్థితుల్లో బిజెపిలో చేరారు. ఇక్కడ ఆమె బిజెపిలో చేరినప్పటికీ ఆమె మనసు ఆలోచనలు అన్నీ కూడా ఆమె సామాజిక వర్గం వ్యాపార వర్గంతోబాటు ముఖ్యంగా తెలుగుదేశం అనుకూలంగానే ఉంటూ వచ్చారు తప్ప బీజేపీకి ఆమె ఏనాడు ఉపయోగపడలేదు. బిజెపి పేరు చెప్పుకొని ఆమె తన సొంత పరపతిని పెంచుకొని రాజకీయంగా ఎదిగారు తప్ప పార్టీని ఆమె ఎదగనివ్వలేదు. ఏదైతేనేం మొత్తానికి మొన్నటి ఎన్నికల్లో ఆమె రాజమండ్రి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మొదటినుంచి అవకాశవాద రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న పురందేశ్వరిని తప్పించాలని హార్డ్ కోర్ బిజెపి కార్యకర్తలు కోరుతూ వస్తున్నారు. పురందేశ్వరి ఎంత సేపు తన కుటుంబ పార్టీ ఆయన చంద్రబాబుకు తెలుగుదేశానికి ప్రయోజనం కలిగించే నిర్ణయాలే తీసుకున్నారు తప్ప బిజెపి బలోపేతానికి వీసమెత్తు కృషి కూడా చేయలేదు. ఆమె వైఖరిని మొదటి నుంచి గమనిస్తూ వస్తున్న ఢిల్లీ పెద్దలు ఇప్పుడు ఏకంగా ఆమెను పక్కకు తప్పించి జన్మతః బిజెపి కార్యకర్త ఆయన మాధవ్ కు ఆ బాధ్యతలు అప్పగించారు.విశాఖనగరానికి చెందిన పోకల వంశీ నాగేంద్ర మాధవ్ ఆయన 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆ టర్మ్ పదవి ముగిసాక 2023లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఉత్తరాంధ్ర పట్టభధ్రుల నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయాడు. వాస్తవానికి మాధవ తండ్రి పీవీ చలపతిరావు సీనియర్ బిజెపి నాయకుడు. అద్వానీ వాజ్‌పేయి వంటి దిగ్గజాలతో కలిసి నడిచిన వాడు. చలపతిరావు అంటే మోడీ ఇతర బిజెపి పెద్ద నాయకులకు కూడా అపారమైన గౌరవం. నికార్సైన చలపతిరావు కుటుంబానికి న్యాయం చేయాలి అనే భావనతో ఉన్న ఢిల్లీ పెద్దలు ఆయన కుమారుడు మాధవ్ కు ఇప్పుడు బిజెపి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది. ఈ నియామకం తెలుగుదేశంతోపాటు అవకాశవాద రాజకీయాలు నేరిపే పురందేశ్వరికి షాకింగ్ అని చెప్పాలి.పార్టీ ఆలోచనలు పార్టీ గీత దాటి అడుగు వేయని నిబద్ధత కలిగిన మాధవ్ ఏ విషయంలోనూ తెలుగుదేశానికి తలవంచకుండా పార్టీ బలోపేతానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తారు అని బిజెపి కార్యకర్తలు నమ్ముతున్నారు. అన్నిటికి మించి చంద్రబాబు బంధువు అయిన పురందేశ్వరి కబ్జా నుంచి బిజెపిని విడిపించడం అతి పెద్ద అడుగు అని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. బిజెపిని చంద్రబాబు కాళ్ళ వద్ద తాకట్టు పెట్టి తన వ్యక్తిగత ప్రయోజనాలు పరపతి పెంచుకున్న పురందేశ్వరికి ఈ నిర్ణయం చేదుగానే ఉంటుంది కానీ నిజమైన బిజెపి కార్యకర్తలకు మాధవ నియామకం తీపి కబురు అని చెప్పాలి.-సిమ్మాదిరప్పన్న -
జేసీ వర్గీయుల దాష్టీకం.. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడి
సాక్షి, అనంతపురం జిల్లా: రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు ఆగడం లేదు. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు దాష్టీకానికి దిగారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు రామకృష్ణ, రేవతి ఇళ్లపై దాడి చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్త రామకృష్ణ కిరాణా షాపును జేసీ వర్గీయులు ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మద్దతు ఇవ్వొద్దని జేసీ నిన్న వార్నింగ్ ఇచ్చారు. మద్దతు ఇచ్చిన వారిపై జేసీ వర్గీయులు దాడులకు తెగబడ్డారు.కాగా, ఆదివారం తాడిపత్రిలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘ఈ రోజు నీ దగ్గరకు వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను రప్పా.. రప్పాలాడిస్తాం. చేతనైతే కాపాడుకో కేతిరెడ్డీ’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట ఎవరెవరు వచ్చారో వారి జాబితా, ఫొటోలు తనవద్ద ఉన్నాయని, వారిని ఇకపై టీడీపీ కార్యకర్తలు రప్పా.. రప్పాలాడిస్తారని అన్నారు. తాడిపత్రిలోని వైఎస్సార్సీపీ వాళ్లు శత్రువులు కాదంటూనే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ రోజు మా వాళ్లను గట్టిగా పట్టుకుని కూర్చున్నా. రేపటి నుంచి నేను ఊళ్లో ఉండను. ఓ వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్త చాలా మాట్లాడుతోంది. మా మహిళా కార్యకర్తలూ ఉన్నారు.’ అంటూ జేసీ వ్యాఖ్యానించారు. -
ఆ నలుగురిపైనే.. బాబు ఫోకస్..!
ప్రజాప్రతినిధుల పనితీరుపై టీడీపీ అధిష్టానం చేయించిన ఐవీఆర్ఎస్ సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశాం.. గతం కన్నా మిన్నగా పాలన సాగిస్తున్నాం అని ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో సర్వే ఫలితాలు షాక్‌కు గురి చేస్తున్నాయి. ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధ్వానపు పనితీరుతో ప్రజాప్రతినిధులు ఆదరణ కోల్పోయిన విషయం స్పష్టమైంది. సాక్షి, పుట్టపర్తి: కూటమి ప్రజాప్రతినిధులు ఏడాదికే ప్రజలకు బేజారయ్యారు. జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. ఏడాది పాలనలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, మంత్రి సవిత, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పనితీరుపై టీడీపీ అధిష్టానం ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) సర్వే చేపట్టింది. ఏ ప్రభుత్వానికైనా కనీసం మూడేళ్ల తర్వాత వ్యతిరేకత వస్తుంది. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ఏడాదికే ప్రజలు విసుగు చెందడం గమనార్హం. ఆ నలుగురిపైనే ఎక్కువగా.. జిల్లాలో సగం మంది ప్రజాప్రతినిధుల పనితీరుపై మాత్రమే తెలుగుదేశం పార్టీ అధిష్టానం సర్వే చేపట్టింది. పుట్టపర్తిలో పల్లె సింధూరరెడ్డి బదులు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పెత్తనం చెలాయిస్తుంటారు. మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు బదులు మాజీ ఎమ్మెల్యే గుండుమల తిప్పేస్వామిదే హవా సాగుతోంది. పెనుకొండలో మంత్రి సవిత బదులు ఆమె భర్త వెంకటేశ్వర్లు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఎంపీగా పార్లమెంటు వ్యాప్తంగా పర్యటించాల్సిన బీకే పార్థసారథి పెనుకొండ నియోజకవర్గంపై మాత్రమే దృష్టి సారిస్తున్నారు. దీంతో ఆ నలుగురిపై ఎక్కువ ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. మిగతా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా పరిగణనలోకి తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అడ్రెస్ లేకున్నా.. అడగరా? సీఎం చంద్రబాబు బావమరిది, సినీనటుడు నందమూరి బాలకృష్ణ చుట్టపుచూపుగా హిందూపురం నియోజకవర్గానికి వస్తుంటారు. ఏ మండలంలో ఏ నాయకుడు ఉన్నాడో కూడా గుర్తించలేరని చెబుతుంటారు. అంతేకాకుండా తన పీఏలు హిందూపురం వ్యాప్తంగా దందాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే సీఎంకు బావమరిది కావడంతో ఆయన పనితీరుపై ఎలాంటి సర్వేలు చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. అరాచకాలను అడ్డుకోరా? ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తోన్న రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో అరాచకాలు వెలుగు చూశాయి. ఆమె పనితీరుపై ఎలాంటి సర్వే చేయకపోవడంపై సొంత పార్టీ నాయకుల్లోనే అసంతృప్తి రేగింది. హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు వెలుగు చూసినా పరిటాల కుటుంబానికి అధిష్టానం నుంచి ఎలాంటి హెచ్చరికలూ రాలేదని కూటమి నేతలు వాపోతున్నారు. కదిరిలో వన్‌మ్యాన్ షో కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వన్‌మ్యాన్ షో చేస్తున్నారు. కిందిస్థాయి నాయకులను ఎదగనీయకుండా.. అన్నీ తానై వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు బీజేపీ, జనసేన నాయకులను దగ్గరకు కూడా రానీయడం లేదని వాపోతున్నారు. అయినా అధిష్టానం వద్ద మంచి మార్కులు ఎలా వచ్చాయని నాయకులు ఆలోచనలో పడ్డారు. జిల్లా కేంద్రానికి రాని మంత్రి శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తికి ఓ మంత్రి రావడమే లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒకట్రెండు సార్లు మినహా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే వ్యవహారం నచ్చలేదా? లేక అధికారులు తనకు నచ్చిన వారు లేరా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఏపీ బీజేపీ కొత్త బాస్‌గా PVN మాధవ్
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ వైపు మొగ్గు చూపించింది అధిష్టానం. దీంతో ఈ మధ్యాహ్నాం ఆయన నామినేషన్ దాఖలు చేశారు.సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి ఇవాళ నామినేషన్స్ జరుగుతున్నాయి. అంతకు ముందు అధిష్టానం ఏకగ్రీవంగా పీవీఎన్ మాధవ్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో సంప్రదాయబద్దంగా జరగనున్న ప్రక్రియలో భాగంగా.. సోము వీర్రాజు, జీవీఎల్‌తో కలిసి మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. రేపు ఉదయం మాధవ్ పేరును ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. పీవీఎన్ మాధవ్.. పూర్తి పేరు పోకల వంశీ నాగేంద్ర మాధవ్. 1973 ఆగస్టు 10న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంలో జన్మించారు. 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మండలిలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్‌గానూ ఆయన వ్యవహరించారు. ఆయన పదవీకాలం 2019 మార్చి 30 నుండి 2025 మార్చి 29 వరకు కొనసాగింది. అయితే..ఈ మధ్యలో.. 2023లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజకీయ జీవితానికి తోడు సామాజిక కార్యక్రమాల్లోనూ మాధవ్ చురుకుగా పాల్గొంటారు. 2024లో విశాఖపట్నంలో జరిగిన "ఆర్గానిక్ మేళా"ను నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. -
‘చంద్రబాబు అబద్ధాల చక్రవర్తి... మోసపు మహారాజు’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్సీ సల్ రాష్ట్ర అధ్యక్షడు టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. మోసపూరిత, దగాకోరు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ఈరోజు(ఆదివారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం చంద్రబాబన్నారు.తనకున్న మీడియా బలంతో లేనిది ఉన్నటల చూపించడంలో సమర్ధడు చంద్రబాబు అంటూ విమర్శించారు. ఎన్టీఆర్ నుంచి టీడీపీని కబ్జా చేసి.. నందమూరి వారసులను తొక్కేశారని, చంద్రబాబు ఓ కబ్జా నాయకుడని ఆరోపించారు. ‘ చంద్రబాబు అబద్ధాల చక్రవర్తి...మోసపు మహారాజు. 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని అబద్ధాలతోనే గడిపేశాడు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను పవిత్రగ్రంధంగా భావించిన వ్యక్తి జగన్. ఇచ్చిన ప్రతీ హామీని జగన్ నెరవేర్చారు. ప్రజలను వంచించి ..అబద్ధాలతో ఓట్లను కొల్లగొట్టడంలో చంద్రబాబు పీహెచ్.డీ చేశాడు. ఏం చెప్పుకుని తొలి అడుగు...ఇంటింటికీ తెలుగుదేశం చేపడతారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. చంద్రబాబు మురికి మాటలు మానుకోవాలి. 24 గంటలూ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి సిగ్గులేదా మీకు. వివేకానందరెడ్డి హత్య ఎవరి హయాంలో జరిగింది...ఆరోజు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు?, వివేకా కేసులో ఎఫ్ఐఆర్ లో ఏముందో..ఎవరెవరి పేర్లు ఉన్నాయో మీకు తెలియదా?, మీ ప్రభుత్వం వచ్చి ఏడాదైంది కదా...ఎందుకు సునీతకు న్యాయం చేయలేకపోయారు. కోడికత్తి కేసు అని అవహేళన చేస్తున్నారు. కోడికత్తి ఘటన జరిగింది నీ హయాంలోనే కదా?, ఆ కేసును ఏడాదైనా ఎందుకు నువ్వు పట్టించుకోలేదు. 40 ఏళ్ల అనుభవం, హైటెక్ సీఎం అని చెప్పుకునే నువ్వెందుకు పరిశీలించలేకపోయావ్?, జగన్ సీఎంగా ఉన్నప్పుడు విజయవాడలో రాయితో దాడి జరిగింది నిజంకాదా?, ఆ ఘటన పై ఎఫ్ఐఆర్ నమోదైంది నిజం కాదా ... ఆ దోషుల సంగతి నువ్వే చూడు. డ్రామా ఆడించారో..నీ ఉపన్యాసాలతో ఆవేశానికి గురై రాయివేశాడో తేల్చు. సత్తెనపల్లి జగన్ పర్యటనలో గుర్తుతెలియని కారు ఢీకొట్టిందని మీ ఎస్పీనే చెప్పాడు. జగన్ పర్యటలను అడ్డుకోవడానికి ఏఐ టెక్నాలజీతో దొంగవీడియోను సృష్టించారు. జగన్ సత్తెనపల్లి పర్యటన పై బురదజల్లాలని చూస్తున్నారు. పొదిలి , సత్తెనపల్లి పర్యటలను చూసి చంద్రబాబు అండ్ కోకు చెమటలు పడుతున్నాయి. ఏడాదికాలంలోనే ఉప్పెనలా వ్యతిరేకత రావడంతో నేరారోపణలు చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడా...చంపేశారా తేల్చండి. మీ హయాంలోనే కదా పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడు...ఎందుకు ఈరోజు వరకూ తేల్చలేకపోయారు. క్రిస్టియన్ సమాజాన్ని దారుణంగా అవమానించింది మీరు కాదా?, ఈరోజుకీ ప్రవీణ్ కుటుంబాన్ని బయటకు రాకుండా చేస్తుంది మీరుకాదా?, తిరుపతి లడ్డూ వివాదం సృష్టించింది ఎవరు?, దేవదేవుడిని అవమాన పరిచింది మీరు కాదా?, సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను దిగజార్చింది నువ్వుకాదా చంద్రబాబు’ అని ప్రశ్నించారు. టీజే సుధాకర్ ఇంకా ఏమన్నారంటే..చంద్రబాబు వెంకటేశ్వరస్వామితో ఆడుకున్నావ్ఈ పాపం నిన్ను ...నీ పిల్లలను ..వారి తరాన్ని కచ్చితంగా వెంటాడుతుందివేంకటేశ్వరస్వామి అన్నా...హైందవ సమాజం మనోభావాలన్నా ఏమాత్రం గౌరవం లేదుచంద్రబాబు, పవన్ కలిసి తిరుమలను రాజకీయంగా వాడుకున్నారుస్థానికసంస్థల ఎన్నికల్లో హీనాతిహీనంగా దిగజారిపోయారుకౌన్సిలర్లను కిడ్నాప్ చేసి...కొట్టి ...తప్పుడు కేసులు పెట్టించావ్ వైఎస్సార్సీపీ కార్యకర్తలను అతి దారుణంగా నరికి చంపించారుఏడాది కాలంలో ఘోరాతి ఘోరంగా విఫలమయ్యావ్వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం పై పదే పదే దాడులు చేయించావ్మీరు చేసే కుళ్లు రాజకీయాలను మేం కచ్చితంగా గుర్తుంచుకుంటాంజగన్ పర్యటన ఉంది...వేలాది మంది వస్తున్నారు...అంటే రక్షణ కల్పించావాజగన్ మోహన్ రెడ్డి వాహనం పై దాడి జరిగే అవకాశముందని మేం చెప్పినా నువ్వు పట్టించుకోలేదుసత్తెనపల్లి జగన్ పర్యటనలో దళితుడి మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేప్రజలు నీకు 94 శాతం స్ట్రైక్ రేట్ ఇస్తే... నువ్వు 99 శాతం జనాన్ని ముంచేశావ్ఈ ఏడాదికాలంలో నువ్వు చెప్పుకోవడానికి ఏముంది గుండు సున్నా తప్ప2014-19 మధ్య జరిగింది కూడా మోసపూరిత పాలనేడ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ఎగనామం పెట్టారునిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం అన్నారు ఎగ్గొట్టేశారుబాహుబలి గ్రాఫిక్స్ చూపించి రాజధానిలో శాశ్వతంగా చిన్న రోడ్డు నిర్మించలేదురియల్ ఎస్టేట్ కోసం రాజధాని నాటకం ఆడుతున్నారుపోలవరం పూర్తిచేస్తానన్నావ్ ... ఎందుకు చేయలేకపోయావ్విభజన హామీలన్నీ సాధించుకొచ్చేది నువ్వే అన్నావ్ కదా..ఏం చేశావ్ఓటుకు నోటు కేసులో దొరికిపోయి తెలంగాణ నుంచి పారిపోయి వచ్చావ్గోదావరి పుష్కరాల్లో 32 మందిని సినిమా షూటింగ్ పిచ్చితో చంపింది నువ్వు కాదా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి5 చంద్రబాబు జేబు సంస్థలుసమాజంలో అట్టడుగు ప్రజలకు న్యాయం చేయడంలో సాక్షి మీడియాకు భాగస్వామ్యం ఉందినీతికి, నిజాయితీకి కట్టుబడి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మంచిని సాక్షి మీడియా ప్రజలకు తెలియజేస్తోంది జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని సాధించారుజగన్ ఆర్బీకే సెంటర్లు తెచ్చాడు ...రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాడుజగన్ పాలనలో ఏ పథకంలోనూ పక్షపాతం చూపలేదు ఈ ఏడాది కాలంలో నువ్వేం సాధించావో సమాధానం చెప్పు చంద్రబాబు జగన్ తెనాలి వెళ్లి యువకులను పరామర్శిస్తే గంజాయి బ్యాచ్ అని విమర్శిస్తున్నారుమరో మారు తెనాలి యువకులను గంజాయి బ్యాచ్ అంటే చంద్రబాబు పై ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాప్రకాశం జిల్లాలో ఏడు కేసులున్న ఓ రౌడీ షీటర్ చనిపోతే నువ్వు,నీ కుమారుడు వెళ్లారుఆయనే ఏ బ్యాచ్ .. అతని పైన సమాజంలో ఏమైనా క్లీన్ చిట్ ఉందానీ కార్యకర్త కాబట్టి ...నువ్వు పరామర్శించడానికి వెళ్లావ్...అతని పై ఎన్నికేసులు ఉన్నా పర్లేదాఅగ్రకులంలో పుట్టాడు కాబట్టి ఆయన గొప్పోడు..తెనాలి యువకులు మాత్రం రౌడీలా నీ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఈరోజు నేను పెట్టలేకపోవచ్చుకానీ నాకంటూ ఒకరోజు వస్తుంది...అప్పుడు కచ్చితంగా బదులిస్తా -
అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు: వైఎస్ జగన్
తాడేపల్లి: ఏపీ ఈసెట్ రిజల్ట్స్ వచ్చి 45 రోజులవుతున్నా ఇంకా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చంద్రబాబు సర్కారును నిలదీశారు ఇది ఏపీ విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనమంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు వైఎస్ జగన్.‘రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్లకోసం 34వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు. గతనెల మే 15న ఫలితాలు వెలువడినా, ఇప్పటికీ కౌన్సెలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదలచేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు’ అంటూ విమర్శించారు.రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 29, 2025 -
పెద్దారెడ్డితో ఉంటారా.. వాళ్ల సంగతి చూస్తా: జేసీ వార్నింగ్
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో రెడ్‌బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం తీవ్ర కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట ఎవరూ తిరగొద్దు. పెద్దారెడ్డికి మద్దతుగా ఉండే వారిని గుర్తిస్తాం.. ఫోటోలు తీస్తున్నాం. పెద్దారెడ్డిని మద్దతు ఇచ్చే వారిని రప్పా..రప్పా.. అని నరికేస్తాం’ అని కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై ప్రజలు, వైఎస్సార్సీపీ నేతలు మండిపతున్నారు.ఇదిలా ఉండగా.. ఆదివారం ఉదయం నుంచి తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏడాది తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్లారు. అయితే, పెద్దారెడ్డి రాకపై సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం ఉదయం తాడిపత్రిలోని తన నివాసంలో బలవంతంగా అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో ఉండరాదంటూ ఆంక్షలు విధించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పెద్దారెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అనంతరం పెద్దారెడ్డిని అనంతపురం తరలించారు.ఈ సందర్బంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ..‘పోలీసులు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నేను తాడిపత్రి వెళ్లొచ్చని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నా ఇంటికి నేను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?. పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?.తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరిని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాను. జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు. మరోవైపు.. టీడీపీ జేసీ, పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మాజీ మంత్రి శైలజానాథ్ కామెంట్స్..పోలీసుల తీరును ఖండిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. తాడిపత్రి వెళ్లిన పెద్దారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు?. పెద్దారెడ్డిపై పోలీసుల ఆంక్షలు ఎందుకు?. ఓ మాజీ ఎమ్మెల్యేని లాక్కొని వస్తారా?. ఇప్పటికైనా పోలీసులు చట్టాన్ని కాపాడాలి. పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించాలి. ఎస్పీ జగదీష్ బాధ్యతగా ప్రవర్తించాలి.. ఏకపక్షంగా వ్యవహరించవద్దు.మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కామెంట్స్..ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసిన రాక్షస ప్రభుత్వం మెడలు వంచి హామీలను నెరవేర్చేంతవరకు పోరాడతాం. బాండ్లు ఇచ్చి మరీ హామీ ఇచ్చారు.. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. ప్రజలను మోసం చేసిన చంద్రబాబుపై ఫిర్యాదు చేస్తాం. పోలీసులు కేసు నమోదు చేస్తారా?. రాజ్యాంగ విరుద్ధంగా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ నాయకులను పీడిస్తున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో మైనింగ్ వ్యాపారులను బెదిరించి , కేసులు , జరిమానాలు వేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. -
‘తాడిపత్రిలో ఆటవిక రాజ్యం.. పోలీసులు అడ్డుకోవడమేంటి?’
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ఆరోపించారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. తాడిపత్రి వెళ్లిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరి మారకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అని హెచ్చరించారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు వచ్చి రెండు మాసాలైనా పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. ఈరోజు ఉదయం తాడిపత్రి వెళ్లిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం. పోలీసులు రాజ్యాంగ బద్దంగా వ్యవహరించటం లేదు.మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లొద్దని ఏవైనా ఆదేశాలు ఉన్నాయా?. మాజీ ఎమ్మెల్యేని తాడిపత్రిలోకి అనుమతించకపోవడం ఏం న్యాయం?. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం దుర్మార్గం. పోలీసుల వైఖరి మారకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు
సాక్షి,గుంతకల్లు: ‘ఎవరేమనుకున్నా..నాకేంటి! ఈ గుమ్మనూరు జయరాంకు ఏమన్నా లెక్కా’ అంటూ అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం గుంతకల్లులోని పరిటాల శ్రీరాములు కల్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి క్లస్టర్ యూనిట్, బూత్ కార్యకర్తల సమావేశంతోపాటు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆ రోజు గుత్తిలో నిర్వహించిన సమావేశంలో అన్న మాటలు (వైఎస్సార్సీపీ నాయకులు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోగా టీడీపీలో చేరితే సరి.. లేదంటే తోకలు కత్తిరించి సున్నం అంటిస్తాం) రాష్ట్రమంతా వైరల్ అయ్యాయి. ఎక్కడ చూసినా గుంతకల్లు వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఇది వాస్తవం. నేనేమన్నా దౌర్జన్యాలు చేస్తానని చెప్పలేదే! ఉన్న మాట అంటే ఉలుకు అన్న చందంగా వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్నారు. సరే.. వారు, ఎవరేమనుకున్నా నాకేంటి?! ఈ గుమ్మనూరు జయరాంకు ఏమన్నా లెక్కా’ అని వ్యాఖ్యానించారు. -
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్
సాక్షి,అనంతపురం: కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయిస్తున్న తరుణంలో.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కుట్రకు దిగింది. బలవంతంగా అరెస్ట్ చేయించింది.ఏడాది తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్లారు. అయితే, పెద్దారెడ్డి రాకపై సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం ఉదయం తాడిపత్రిలోని తన నివాసంలో బలవంతంగా అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో ఉండరాదంటూ ఆంక్షలు విధించారు. అనంతరం, రహస్య ప్రాంతానికి తరలించగా.. ఇప్పటికే పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లొచ్చన్న హైకోర్టు అనుమతిచ్చిన విషయాన్ని పోలీసులకు పెద్దారెడ్డి గుర్తు చేశారు. దీంతో చేసేది లేక పెద్దారెడ్డిని అనంతపురం తరలించారు. నా ఇంటికి నేను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?అనంతపురం రాంనగర్లో తన నివాసంలో పెద్దారెడ్డిని వదిలి పెట్టారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నేను తాడిపత్రి వెళ్లొచ్చని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నా ఇంటికి నేను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?. పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?.తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరిని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటా. జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు. మరోవైపు పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు జేసీ వర్గీయులు సమాయత్తం కావడంతో తాడిపత్రిలో ఉద్రికత్తత నెలకొంది. అంతకుముందు, పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేతకు కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదుతో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేసేలా మునిసిపల్ అధికారులు కొలతలు తీసుకున్నారు. మున్సిపల్ అధికారులు తన ఇంటి కొలతలు తీసుకున్నారనే సమాచారంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చారు. అదే సమయంలో పెద్దారెడ్డిపై దాడులు చేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడుగు పెట్ట నివ్వడం లేదు. అడుగడుగునా కూటమి నేతలు అడ్డు తగులుతున్నారు. ఈ క్రమంలో తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డి హైకోర్టులో అనుమతి తీసుకున్నారు. అయినప్పటికీ కూటమి నేతలు పదేపదే బెదిరింపులు, దాడులతో కక్ష సాధింపు చర్యలతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో పెద్దారెడ్డి మరోమారు హైకోర్టులో కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు. -
వైఎస్ జగన్ హెలికాప్టర్‌ను దిగనివ్వం.. కోటంరెడ్డి అనుచరుల అరాచకం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటనకు టీడీపీ నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి జైల్లో ఉంచిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డితో ములాఖత్‌కు వైఎస్ జగన్ జూలై 3న నెల్లూరుకు రానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ కోసం వైఎస్సార్సీపీ నాయకులు స్థలాన్ని పరిశీలిస్తుండగా నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరులు అడ్డుపడుతున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలో వైఎస్సార్సీపీ నాయకులు మూడు వేర్వేరు ప్రైవేటు స్థలాలను చూడగా.. కోటంరెడ్డి అనుచరులు ఆయా భూముల యజమానులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అక్కడ ఉన్న నిర్మాణాలతో పాటు భూములపై వివాదాలు సృష్టిస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. వైఎస్సార్సీపీ నేతలు శనివారం కొత్తూరు అంబాపురంలోని క్రైస్తవ మిషనరీ ఆధ్వర్యంలో నడిచే ఓ పాఠశాల మైదానాన్ని హెలిప్యాడ్ కోసం ఎంపిక చేశారు. స్కూల్ యాజమాన్యం అనుమతితో జిల్లా అధికారులకు దరఖాస్తు చేశారు. అయితే, ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరులు మిషనరీ స్కూల్ వద్దకు వెళ్లి వీరంగం సృష్టించారు. ట్రస్ట్ భూముల్లో ప్రభుత్వ భూమి ఉందంటూ హడావుడి చేశారు. భవనాలను కూల్చేస్తామంటూ రాద్ధాంతానికి దిగారు. దీంతో స్కూల్ సంబం«దీకులు భయాందోళనకు గురై హెలిప్యాడ్‌కు స్థలం ఇవ్వబోమని చెప్పాల్సి వచ్చింది. వైఎస్ జగన్ జనాదరణ చూసి భయపడి..రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 143 హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి గద్దెనెక్కిన టీడీపీ కూటమి ఆ హామీలు నెరవేర్చలేక తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకుంది. దీనిని నిలదీస్తూనే మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో పర్యటనలు చేస్తుండడంతో రోజురోజుకు జనాదరణ పెరుగుతోంది. ఆయన నెల్లూరు జిల్లాకు వస్తున్నారని తెలియగానే సంఘీభావం తెలిపేందుకు వేలాదిమంది తరలివస్తారని టీడీపీ నేతల్లో భయం పుట్టింది. వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు అవరోధాలు సృష్టిస్తున్నారు. హెలిప్యాడ్‌కు స్థలాలు ఇవ్వకుండా యజమానులను బెదిరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. -
సింగిల్‌గా అయితే సీన్ సితారే
ఎవరెన్ని అనుకున్నారు.. భారీ మెజారిటీతో గెలిచాం అని లోలోన చంకలు గుద్దుకుంటున్నప్పటికి.. కూటమి నాయకులకు మాత్రం ఇంకా వైఎస్ జగన్ అంటే భయం పోలేదు. జగన్‌కు జనంలో ఉన్న మాస్ ఇమేజ్ కూటమి నాయకులకు నిద్రలేకుండా చేస్తుంది. జగన్ ఇల్లు దాటడం లేదని ఓవైపు అంటూనే ఆయన వీధిలోకి వస్తే జనసంద్రం ఎలా ఉంటుందో చూసి లోలోన టీడీపీ, జనసేన నాయకులు కుళ్ళు కుంటున్నారు.మొన్న ఏదో మూడు పార్టీల మధ్య పొత్తు కలిసి వచ్చి అలా గెలిచేసారు కానీ అన్ని సందర్భాల్లోనూ ఇదే ఫార్ములా వర్కౌట్ అవుతుందని చెప్పలేం అని సాక్షాత్తు కూటమి నాయకులే ఒప్పుకుంటున్నారు. ఓకే కాంబినేషన్‌తో మళ్లీ మళ్లీ వస్తే సినిమా హిట్ అవుతుందని గ్యారెంటీ లేదని వాళ్ళే అంగీకరిస్తున్నారు. అన్నిటికి మించి మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటే తప్ప విడివిడిగా పోటీ చేస్తే వైఎస్ జగన్ అలవోకగా అధికారాన్ని చేపడతారని తెలుగుదేశానికి వంతపాడే మీడియా సంస్థలు కూడా అంగీకరిస్తున్నాయి.నిత్యం వైఎస్ జగన్‌ను ఆడిపోసుకునే ఓ చానల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ఒంటరిగా పోటీ చేస్తే కూటమికి చావు దెబ్బ తప్పదని అంగీకరించారు. మరోవైపు సూపర్ సిక్స్ హామీలు ఏవి అమలు చేయకుండా కేవలం మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా హైప్ తెచ్చుకొని తెచ్చుకొని అంతా బాగుందని చెప్పుకుంటాను కూటమి నాయకులకు.. దాని పెయిడ్ మీడియాకు కూడా సమాజంలో ఏం జరుగుతుందో అన్న విషయం స్పష్టంగా తెలుసు. ఎన్నికలకు ముందు నోటికి వచ్చిన హామీలు ఇచ్చి.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఏమాత్రం ఆధారాలు లేని అభాండాలు వేసి రకరకాల మాయలు చేసి గెలిచిన కూటమి నాయకులు ఇప్పటికే ప్రజల్లో చులకన అయ్యారు.హామీలు ఎగ్గొట్టడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా దండాలు దోపిడీలు రౌడీయిజం ప్రతిపక్ష నాయకుల మీద దాడులు అరాచకం మినహా ఇంకేమీ పనులు చేయకపోవడంతో ప్రజలకు సైతం ప్రభుత్వం మీద అసహ్యం మొదలైంది. మొదటి ఏడాదిలోనే ఇంత వెగటు పుడితే రానున్న నాలుగేళ్లలో ఇది మరింత ముదిరి కూటమి నాయకులను తన్ని తరిమేసే పరిస్థితికి వస్తుందని వారికి అర్థమైంది. ఒకసారంటే వీరి మాటలు ప్రజలు నమ్మారు కానీ మళ్ళీ మళ్ళీ అవే హామీలు అవే మోసకారి మాటలు చెబితే ప్రజలు నమ్మి నెత్తిన పెట్టుకోరు అనే విషయం కూటమి నాయకులతో పాటు ఆ మీడియాకు సైతం ఎప్పటికే అర్థమైంది.అంతేకాకుండా ఇటీవల పలు ప్రైవేట్ సంస్థలు చేసిన సర్వేల్లో కూడా దాదాపుగా 50 శాతం మంది ఎమ్మెల్యేలకు రెండోసారి గెలిచే అవకాశం లేదని తేలడంతో వారు ఇప్పుడు బిత్తిరి చూపులు చూస్తున్నారు. ఏదైతేనేం ఉన్న ఈ నాలుగేళ్లు ఉన్న కాడికి దండుకుందాం అనే టార్గెట్‌తో చాలామంది ఎమ్మెల్యేలు సహజం వనరులతో పాటు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దందా చేస్తూ సొమ్ములు వెనకేస్తున్నారు.ఈ పరిస్థితి కూడా కూటమి మీడియాకు తెలుసు.. అందుకే తాజాగా జరిగిన డిబేట్లో ఓ యాంకర్ సైతం ఇదే విషయాన్ని చెప్పలేక చెప్పలేక కుమిలిపోతూ చెప్పారు. కూటమి పొత్తులో లేకపోతే వైఎస్ జగన్ నిలువరించడం అసాధ్యం అని యాంకర్‌తో పాటు రఘురాం కృష్ణంరాజు సైతం అంగీకరించారు. ఏడాదిలోనే వారి పాలనపై వారికే నమ్మకం కోల్పోవడంతో.. ప్రజల ఇప్పుడు వైఎస్ జగన్‌పై దృష్టిసారించారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలకు మరింత వివరించి వారి మద్దతు కూడగట్టుకునేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా సమాయత్తం అవుతున్నాయి..* సిమ్మాదిరప్పన్న -
‘నీ అంతు చూస్తా’.. మహిళా ప్రిన్సిపల్‌కు టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులు
అనకాపల్లి,సాక్షి: కస్తుర్బా కాలేజీ ప్రిన్సిపల్‌ని చోడవరం టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు బెదిరింపులు గురి చేశాడు. ఎమ్మెల్యే రాజు బెదిరింపులతో ప్రిన్సిపల్ అన్నపూర్ణ గుండెపోటుకు గురయ్యారు. ‘ఎమ్మెల్యే రాజు నా అంతుచూస్తానని బెదిరించారు. 50 మంది మగాళ్ళ మధ్య నన్ను దూషించారు. కాళ్లు పట్టుకొని క్షమాపణ అడిగిన వదిలేది లేదన్నారు. నిబంధనలకు అనుగుణంగా స్కూల్లో సీట్ల కేటాయింపు జరిగిందని చెప్పా. అయినా, ఎమ్మెల్యే వినకుండా దూషించారు. ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తానంటూ బెదిరించారని’ వాపోయారు. ఇటా ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు మహిళపట్ల దరుసు ప్రవర్తన ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. ‘చంద్రబాబు అనవసరంగా స్కీములు పెట్టారని, ప్రజల ఖాతాల్లో డబ్బులు వెయ్యొద్దని తాను సీఎంకు చెప్పానని అన్నారాయన. ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తే డాబాలకు వెళ్లి బిరియానీలు తింటున్నారు. ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసి మందు తాగుతున్నారు అని అన్నారాయన. అక్కడితో ఆగకుండా.. ‘‘పథకాల వల్లే.. ఆడవాళ్లు ఇంట్లో వంట మానేస్తున్నారు. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి అలవాటు పడుతున్నారు. ఇచ్చిన డబ్బులతో చిల్లర ఖర్చులు చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా బట్టలు కొనుక్కుంటున్నారు అంటూ తన నోటి దురుసును కొనసాగించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలకు ఎమ్మెల్యే రాజు క్షమాపణలు చెప్పాలని రాజకీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.