
లోకేశ్వరం(ముథోల్): మండలంలోని పుస్పూర్ గ్రామ శివారు ప్రాంతంలో శు«క్రవారం కారు బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయని ఎస్సై రమేశ్ తెలిపారు. భైంసా మండలం దేగాం నుంచి లోకేశ్వరంకు శుభకార్యం కోసం కారులో బయాలు దేరారు. పుస్పూర్ గ్రామ శివారు ప్రాంతంలోని మూలమలుపు వద్ద అతివేగంగా కారును నడపడంతో అదుపు తప్పి బోల్తా పడింది.
కారులో ప్రయాణిస్తున్న భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన సుష్మ, రక్షిత్‌తో పాటు డ్రైవర్ రాజేంద్రప్రసాద్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు వెంటనే భైంసా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.