breaking news
Celebrities
-
వినూత్నంగా పెళ్లి రోజు వేడుక
జగిత్యాలరూరల్: పెళ్లి చేయాలంటే.. ఆకాశమంతా పందిరి.. భూదేవి అంతా పీట.. పురోహితులు.. బంధువులు.. బలగం తరలిరావాలంటారు. కానీ ఈ పెళ్లి వేడుకకు తోటి ఉపాధిహామీ కూలీలే పెళ్లి పెద్దలుగా మారారు. తట్ట.. పార పట్టిన వారే పురోహితులుగా అవతారం ఎత్తి పెళ్లి తంతు నిర్వహించారు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ వినూత్న పెళ్లి వేడుక సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల, బాలపల్లి గ్రామాలకు చెందిన 225 మంది శుక్రవారం ఉపాధిహామీ పనులకు హాజరయ్యారు. పనులు ముగిసిన తర్వాత పని స్థలంలో రెండు గ్రామాల కూలీలు ఒక్కచోట చేరారు. ఈ సమయంలోనే పొరండ్ల గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి–సత్తమ్మ దంపతుల 41వ పెళ్లి రోజు అని చర్చకు వచ్చింది. వెంటనే తోటి కూలీలు ఘనంగా వేడుకలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మామిడితోటనే పెళ్లి వేదికగా మార్చుకున్నారు. మామిడి ఆకులతో బాసింగాలు తయారు చేసి వారిద్దరికి కట్టి పెళ్లి జరిపించారు. నిజమైన వివాహ వేడుకలను మైమరిపించేలా తలంబ్రాలు, అరుంధతి నక్షత్ర దర్శనం, అప్పగింతలు నిర్వహించారు. అక్కడే ఉన్న వారందరికీ కూరగాయలు, మటన్, బగార అన్నం, మక్కగుడాలతో విందు ఏర్పాటు చేశారు. పెళ్లికి హాజరైన కూలీలందరూ కట్నకానుకలు సమర్పించారు. ఈ పెళ్లి తతంగం అంతా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. -
మంచి కథ కోసం ఎదురుచూస్తున్నా : రకుల్ ప్రీత్ సింగ్
‘ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు చేయకపోవడం వల్ల తెలుగువారిని ఎంతగానో మిస్ అవుతున్నా.. కానీ నాకు తొలివిజయం అందించింది తెలుగు సినిమానే.. హైదరాబాద్‌లో ఉండి షూటింగ్ చేయాలని ఎంతోకొరికగా ఉంది.. ప్రస్తుతం కథలు వింటున్నా.. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నా’ అని ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ టాప్ సెలబ్రెటీలకు మేకప్ మెన్‌గా చేసిన కడాలి చక్రవర్తి ఆధ్వర్యంలో పంజాగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో అండ్ అకాడమీ’ని రకుల్ ప్రారంభించారు. తెలుగులో బాహుబలి వంటి సినిమా చేయాలని తన కోరికని తెలిపారు. తన తొలి చిత్రం నుంచి సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు అన్ని సినిమాలకూ తనకు మేకప్ చేసిన చక్రి మేకప్ అకాడమీ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తనకు తెలుగు భాష ఇంతగా రావడానికి కారణం కూడా ఆయనే అని అన్నారు. – సాక్షి, సిటీబ్యూరో -
చిట్కాలున్నా... చికిత్సే ముఖ్యం!
సోషల్ మీడియా వచ్చాక ఓ ఉత్పాతమూ వచ్చిపడింది. ‘పాత పేషెంట్ కొత్త డాక్టర్‌తో సమాన’మంటూ అప్పట్లో ఓ సామెత లాంటి వాడుక ఉండేది. దాన్ని నిజం చేస్తూ పాత పేషెంట్లూ అంతకుమించి పాపులర్ సెలిబ్రిటీలైన సోనాలీ బెంద్రే, మనీషా కోయిరాలా, క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్, హాలీవుడ్ మోడల్ లీజా రే వంటి జనాల్లో మంచి క్రేజ్ ఉన్న వ్యక్తులు... ‘ఆటోఫేజీ’ అనే ఓ సైంటిఫిక్ పదాన్ని... ఇటీవలి పాపులర్ చిట్కా మంత్రా పదమైన ‘వెల్నెస్ చికిత్స’తో కలగలిపి ‘వెల్నెస్’ అద్భుతాల తాలూకు ప్రభావాలను సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు. ఉపవాసాలూ, డీటాక్స్ విధానాల్లాంటివే అద్భుత మాయా–మంత్రాలంటూ ప్రజలకు ఇంపుగా ప్రజెంట్ చేస్తున్నారు. అసలు అన్నం కంటే పక్కన అంచుకుపెట్టుకుని నంజుకునే చిరుతిండినే నిజభోజనంగా వర్ణిస్తున్నారు. వాళ్ల మాటల మాయల్లో పడుతున్న జనాలు... అసలు వాస్తవాల కంటే అద్భుతాలనే ఎక్కువగా నమ్ముతున్నారు. ఫలితంగా ఈ ‘మిరాకిల్స్ థెరపీ’లను ఎక్కువగా నమ్ముతూ ఉండే అదే క్యాన్సర్‌కు అద్భుత చికిత్సేమోనంటూ అమాయక ప్రజలు అసలుకే మోసం తెచ్చుకుంటున్నారు. ఈ విషయంపై క్యాన్సర్ నిపుణులైన డాక్టర్ల మాటేమిటో చూద్దాం.వాళ్లు క్యాన్సర్‌ను జయించిన యోధులే. అద్భుత మనోబలంతో క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొన్న మహామహులే. తాము క్యాన్సర్‌ను అధిగమించాక తాము అనుసరించిన చిట్కాలను వెల్లడిస్తూ వాళ్లు చెబుతున్న కొన్ని మాటలేమిటో చూద్దాం. → ఇంటర్మిట్టెంట్ ఫాస్టింగ్ (రోజుకు నియమిత వేళల్లోనే తిని... మిగతా సమయమంతా ఉపవాసంలో గడపడం), యాంటీ ఇన్ఫ్లమేషన్ డైట్ తీసుకోవడం, కొద్దిపాటి వ్యాయామంతో తాను క్యాన్సర్‌నుంచి బయటపడ్డానంటోంది ప్రముఖ బాలీవుడ్– టాలీవుడ్ ఫేమ్ సోనాలి బెంద్రే. → క్లీన్ ఈటింగ్ ప్రాసెస్ చేయని, రిఫైన్ చేయని, పొట్టుతీయని ముడి ధాన్యాలతో వండిన భోజనం)తో పాటు యోగా, ప్రాణాయామం వంటి వాటితో క్యాన్సర్‌ను జయించానన్నది ప్రముఖ నటి మనీషా కోయిరాలా మాట. → కీమోతో పాటు... క్రమశిక్షణతో కూడిన జీవనమూ భోజనమూ, దేహంలోని విషాలను శుభ్రపరిచే డీ–టాక్స్ ఆహార విహారాలూ తననుంచి క్యాన్సర్‌ను దూరం చేశాయంటాడు క్రికెటర్ యూవీ (యువరాజ్ సింగ్). → శాకాహారంతో కూడిన భోజనం, ధ్యానం (మెడిటేషన్), యోగా ఆయుర్వేద మార్గాల పయనం వల్లనే తనకు క్యాన్సర్ నయమయ్యిందంటోంది ప్రముఖ మోడల్, లీజా రే. ఇక్కడ ఈ ప్రముఖులు చెప్పిన చిట్కాలన్నీ ‘ఆటోఫేజీ’ అనే ప్రక్రియను వేగవంతం చేశాయనీ... అందువల్లనే తమకు క్యాన్సర్ వేగంగా, ప్రభావపూర్వకంగా నయమైందంటూ చెబుతున్న సోషల్ మీడియా వేదికగా చెబుతున్న మాటలు సాధారణ ప్రజల మెదళ్లలోకి తేలిగ్గా ఎక్కుతున్నాయి. వాళ్ల మనసుల్లోకి సులువుగా వెళ్తున్నాయి. అయితే జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులైన ఆ వెల్నెస్ మార్గాలు మంచివే. కానీ అవే క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయలేవని అంటున్నారు. ‘ఆటోఫేజీ’ అనే ఇటీవలి సైంటిఫిక్ పరిభాషకు చెందిన ఆ పదం అర్థం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉందన్నది వైద్యప్రముఖుల మాట. దాంతోపాటు ‘అపాప్టోసిస్’, ‘ ప్రోటీయోజోమ్’ అనే పదాలకు అర్థాలు వాటి వెనక పరమార్థాలూ తెలుసుకుంటే కేవలం అద్భుతాలనిపించే చికిత్సప్రక్రియలు... (మిరాకిల్ రెమిడీలు) మాత్రమే కాకుండా వాస్తవ చికిత్సలకు తోడుగా... ఈ అనుబంధ మార్గాలూ జతగూడినప్పుడే అసలు ఫలితాలు వస్తాయంటున్న డాక్టర్ల మాటల ఆంతర్యాలను తెలుసుకుందాం...అసలు ‘ఆటోఫేజీ’ అంటే ఏమిటి? దేహంలో ఎప్పటికప్పుడు కణాలు పుడుతూ, చనిపోతూ ఉంటాయి. అందులో చనిపోయిన కణాలతో పాటు కొన్ని నిరర్థకమైనవీ, వ్యర్థమైనవీ ఉంటాయి. మన దేహంలోని శుభ్రం చేసే వ్యవస్థ ఇలాంటి మృతకణాలూ, నిరర్థక, వ్యర్థకణాలను తొలగిస్తూ ఉంటుంది. ఇలా ఆరోగ్యకరమైన కణాల మనగడను సుగమం చేస్తూ, ఈ మృత, వ్యర్థ, నిరర్థక కణాలను తినేసే ప్రక్రియనే ‘ఆటోఫేజీ’ అంటారు. ఈ సెలిబ్రిటీల మాటేమిటంటే... పైన చెప్పిన ఉపవాసాలూ, ప్రాణాయామ ధ్యానాలూ, డీటాక్స్ ప్రక్రియల వంటి వెల్నెస్ మార్గాల ద్వారా మన ఆరోగ్యకరమైన కణాలన్నీ ‘క్యాన్సర్ కణాలనే’ తినేస్తే? అప్పుడు క్యాన్సర్ హరించుకుపోయి ఆరోగ్యం దక్కుతుందనేలా వారి సోషల్ మీడియా సందేశాలు ప్రజలకు చేరుతున్నాయి. అంతకంటే సంక్లిష్టమైనది ఆటోఫేజీ...నిజానికి ‘క్యాన్సర్ బయాలజీ’లో ఆటోఫేజీ ప్రక్రియ అంతకంటే చాలా సంక్లిష్టమైనది అంటున్నారు ఆధునిక వైద్యచికిత్సకులు. ఒకసారి అదేమిటో చూద్దాం. ∙కణంలో మరిన్ని సూక్షమైన అంతర్గతమైన భాగాలు (ఆర్గనెల్స్) దెబ్బతిన్నప్పుడు ఆ కణం మనుగడ కష్టం. అది చనిపోయే ప్రక్రియలో దేహం దాన్ని శుభ్రం చేసి తొలగిస్తుంది. అందులోని ప్రోటీన్ శిథిలాలను ఒకచోట చేర్చి ఊడ్చేస్తుంది. అలా చనిపోయిన లేదా బలహీనపడి నిరర్థకం కాబోతున్న కణాలను దేహం తొలగించివేస్తుంది. దీన్నే ‘ఆటోఫేజీ’ అంటారు.అదీ మరచిపోతున్న ముప్పు... ఇదీ చేస్తున్న తప్పు... ఇక్కడ సెలిబ్రిటీలు ఒక విషయం మరచిపోతున్నారు. తమకున్న పరిమితమైన వైద్యపరిజ్ఞానంతో అసలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉపవాసాలు చేస్తున్నప్పుడు తన జీవక్రియల కోసం దేహంలోని కణాలు తమకు కావాల్సిన ఆహారం కోసం మృత/వ్యర్థకణాలనూ, క్యాన్సర్ కణాలనూ తినేస్తాయని భావిస్తున్నారు. కానీ ఇక్కడ వారు ఒక ముప్పును విస్మరిస్తున్నారు. క్యాన్సర్ కణం కూడా ఒక కణమే. దానికీ ఆహారం కావాలి. ఉపవాసం ద్వారా దానికి అవసరమైన ఆహారాలు అందనప్పుడు అది కూడా ఆరోగ్యకరమైన కణాలనూ తినేయడం మొదలుపెట్టేందుకు అవకాశాలు ఎక్కువ. అంతేకాదు... మామూలు కణం కంటే కూడా అది మరింత చురుగ్గా, మరింత వేగంగా ఆరోగ్యకరమైన కణాలను కబళించవచ్చు. పైగా ఆహారం అందకపోవడంతో దేహాన్ని రక్షించుకునే వ్యాధి నిరోధక వ్యవస్థ మరింత బలహీనపడితే క్యాన్సర్ కణజాలాలే మామూలు ఆరోగ్యవంతమైన కణాలను తినేయడం ప్రారంభిస్తే అది మొదటికే మోసం వచ్చే పరిస్థితి! అంటే ఉపవాసం వల్ల క్యాన్సర్ ఎండిపోవడానికి (ఫాస్టింగ్ స్టార్వ్స్ క్యాన్సర్) బదులుగా తామే ఆకలితో మాడాల్సి వస్తుందని తెలిసినప్పుడు క్యాన్సర్ కణాలు ఇంకా ఇంకా కుతంత్రాలతో (కన్నింగ్‌గా) ఆరోగ్యవంతమైన కణాలను తినేయడం మొదలుపెట్టే ప్రమాదలెన్నో పొంచి ఉంటాయి.ఆటోఫేజీ లాంటిదే ఆటాప్టోసిస్... సెలిబ్రిటీలు ఆటోఫేజీ గురించి సోషల్ మీడియాలో మాట్లాడటం వల్ల దాని గురించి మామూలు ప్రజలకు తెలియరావచ్చు. కానీ... ఈ రంగంలో ఇలా ఆటోఫేజీలా పనిచేస్తూ క్యాన్సర్ కణాలను తినేసేందుకు దోహదపడే పరిశోధనలూ, అలాంటి పరిజ్ఞానాలూ, పరిభాషా... ఇలాంటివి వాళ్లకు తెలియని అంశాలెన్నో ఇంకా ఉన్నాయి. ఉదాహరణకు అటాప్టోసిస్, యూబిక్విటిన్– ప్రోటియోజోమ్ సిస్టమ్ వంటివి. ఉదాహరణకు అటాప్టోసిస్ అంటే ఏమిటో చూద్దాం. ఎవరినైనా బాగా కించపరిచి, కోలుకోలేనంతగా నిందిస్తే వాళ్లేం చేస్తారు? తట్టుకోలేక ఆత్మహత్యకూ ఒడిగట్టవచ్చు కదా! అచ్చం అపాప్టోసిస్ ప్రక్రియలో కూడా అలాంటిదే జరుగుతుంది.యుబిక్విటిన్ – ప్రోటియోజోమ్ సిస్టమ్ అంటే... యుబిక్విటిన్ అనేది ఏ ప్రోటీన్‌కు అంటుకుంటుందో దాన్ని కాలపరిమితి ముగిసిపోయిన లేదా చెడిపోయిన / లోపభూయిష్టమైన ప్రోటీన్గా గుర్తించవచ్చు. అది కణంలో ఉన్నప్పుడు కణం సమతౌల్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే యుబిక్విటిన్ ప్రోటీన్ కణం నుంచి తొలగిపోవాలి. అప్పుడే కణం చురుగ్గా నార్మల్ కణంగా ఉంటుంది. అలా కణం నుంచి యుబిక్విటిన్ను తొలగించడానికి తోడ్పడేందుకు ఉద్దేశించిన వ్యవస్థ... అంటే యుబిక్విటిన్ ప్రోటీన్‌ను ధ్వంసం చేసేందుకు తోడ్పడే వ్యవస్థే ప్రోటియోజోమ్ వ్యవస్థ. అంటే ప్రోటియోజోమ్ అన్నది ప్రోటీన్ డిస్ట్రక్షన్ సిస్టమ్ అన్నమాట. ఈ యుబిక్విటిన్ అనేది అలాగే ఉంటే అది చెడిపోయిన కణానికి అమరత్వం ఇస్తుంది. ఒకవేళ ఆ చెడిపోయిన కణాలకు అమరత్వం ఉంటే అవి తొలగిపోవు. కాబట్టి ఈ ప్రోటియోజోమ్... తన డబుల్ నెగెటివ్ మార్గంలో వాటిని గుర్తించి ధ్వంసం చేస్తుంది. అలా చెడుకణాలూ లేదా దెబ్బతిన్న/లోపభూయిష్టమైన కణాలను తొలగిస్తుంది. ఇతి జరిగేందుకు దోహదపడేదే ‘యుబిక్విటిన్ – ప్రోటియోజోమ్ వ్యవస్థ’గా చెబుతారు.కొన్ని మందులతో ప్రోటీయోజోమ్ ప్రక్రియను అడ్డుకుని క్యాన్సర్‌ను తగ్గించడం ఇలా... ఈ యుబిక్విటిన్– ప్రోటియోజోమ్ ప్రక్రియను గుర్తించిన వైద్య శాస్త్రవేత్తలు ‘బార్టెజోమిబ్’ అలాగే ‘కార్ఫిల్జోమిబ్’ వంటి ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్లను తయారు చేసి ప్రయోగించారు. ఈ మందులతో ‘మైలోమా’ అనే క్యాన్సర్ నయం కావడం మొదలైంది. ఇలాంటి మందులను ( ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్స్‌ను) మరిన్ని కనుగొనడం ద్వారా అనేక రకాల క్యాన్సర్లను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా చూసినప్పుడు ఆటోఫేజీ, అపాప్టోసిస్, ప్రోటీయోజోమ్ అనేవి చాలా సంక్లిష్టమైన ప్రక్రియలు. అవి కొనసాగే మార్గాలను (పాత్ వేస్) అనేక మందుల సహాయంతో నిర్వహితమయ్యేలా చేయడం వల్ల క్యాన్సర్ కణం తనంతట తాను మటుమాయమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికి ఇది ‘మైలోమా’లోనే సఫలీకృతమైంది. కానీ ఇంకా కొన్ని క్యాన్సర్ల (సాలిడ్ ట్యూమర్స్) విషయంలోనూ, మరిన్ని క్యాన్సర్లలోనూ విజయవంతం కావాల్సి ఉంది. ఇందుకోసం రకరకాల కాంబినేషన్లలో అపాప్టోసిస్ మాడ్యులేటర్లు, ఇమ్యూనో, టార్గెట్ థెరపీ ప్రక్రియలూ, ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్లు రూపొందించడంలో వైద్యశాస్త్రజ్ఞులు నిమగ్నమై ఉన్నారు.ఆ అపోహలన్నీ అలా ఆవిర్భవించినవే... ఎన్నో ఏళ్లుగా అటాప్టోసిస్ ప్రక్రియను క్యాన్సర్‌ను జయించేందుకు ఒక ప్రత్యామ్నాయ ‘నేచర్ క్యూర్’ ప్రక్రియగా జనం అపోహపడుతున్నారు. కొన్ని ఆహారాల ద్వారా క్యాన్సర్ లాంటి లోపభూయిష్టమైన కణాలు తమంతట తామే తమ మరణశాసనం రాసుకునేలా చేయడం (యాక్టివేటెడ్ / ప్రోగ్రామ్డ్ సెల్ డెత్)గా చాలామంది పొరబడుతుంటారు. కానీ అది పొరబాటు. క్యాన్సర్ కణాలు ఎంత జిత్తులమారివి అంటే... అవి ‘అటాప్టోసిస్’నూ తప్పించుకోగలవు. అదెలాగంటే... సెల్‌ను అపాప్టోసిస్కు గురిచేసే ప్రక్రియలో క్యాన్సర్ కణంలోని పవర్‌హౌజ్ అయిన మైటోకాండ్రియాను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. అదే సమయంలో ‘బీసీఎల్–2’ అనే కుటంబానికి చెందిన మరో ప్రోటీన్ విడుదలై అది యాంటీ అపాప్టోటిక్ ప్రక్రియ ద్వారా క్యాన్సర్ కణంలోని మైటోకాండ్రియాలోకి రసాయనాలు వెళ్లకుండా చేయడం ద్వారా తనను తాను రక్షించుకుంటుంది.చివరగా... ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ప్రభావవంతమైన క్యాన్సర్ చికిత్సలు రేడియోథెపీ, కీమోథెరపీ, శస్త్రచికిత్సలే. వీటి తర్వాతే ఉపవాసాలూ, యోగా, ధ్యానం, డీ–టాక్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలూ, పోషకాహారాలూ, నేచురోథెరపీలను అనుబంధంగా ఉపయోగించుకోవాలి. ఏ సెలిబ్రిటీలు చెప్పినా అవి ప్రత్యామ్నాయ చిట్కాలే తప్ప ప్రధాన చికిత్సలు కావని అందరూ తెలుసుకోవాలంటున్నారు డాక్టర్లు.అపాప్టోసిస్ అంటే... క్యాన్సర్ అంటేనే అది చెడిపోయిన / నార్మల్‌గా ఉండని కణం అన్న విషయం తెలిసిందే. ఏవైనా రసాయనాల ద్వారా ఓ చెడిపోయి దెబ్బతిన్న కణాన్ని మరింతగా అవమానించేలా చేస్తే అది బాగా కుంగి కుచించుకుపోయి నశించిపోయే పరిస్థితే ‘అపాప్టోసిస్’ అని చెప్పవచ్చు. నిజానికి చాలా సంక్లిష్టమైన జీవరసాయన పద్ధతికి ఇక్కడ చెప్పినది మామూలు ప్రజానీకానికి అర్థమయ్యేలా చెప్పేందుకు ఇదో సింపుల్ వివరణ అనుకోవచ్చు. అంటే కొన్ని రసాయనాలను ఉపయోగించి ఓ కణాన్ని అవమానించడం ద్వారా దాని మరణాన్ని అదే తెచ్చుకునే ‘ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్’ కార్యక్రమం ఈ అపాప్టోసిస్.నిర్వహణ: యాసీన్ -
Sakshi Little Stars: ఆశీస్సులే ఆయువు
ఆశ తొణుకుతున్నప్పుడుఆశీస్సు దానిని నిలబెట్టవచ్చు. ఔషధం ఓడుతున్నప్పుడు ప్రార్థన దానిని గెలిపించవచ్చు. అశ్రువు ఉబుకు తున్నప్పుడు ఆర్ద్రత దానిని మందస్మితం చేయవచ్చు. డబ్బు ఖర్చు లేని అనంత దయ, సేవ, ఆర్ద్రత, సాంత్వన మన వద్ద ఉంటాయి. నిజ హృదయంతో వెచ్చిస్తే పని చేస్తాయి. ఈ పిల్లలకు అవన్నీ కావాలి. ఈ పిల్లలు చిరంజీవులై వెలగాలి. ‘సాక్షి’ మీడియా చైల్డ్ సెలబ్రిటీలతో తనదైన ప్రయత్నం చేసింది. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఎం.ఎన్.జె. కేన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలలు ఒక పూట కువకువలాడారు. పకపక నవ్వారు.నవంబర్ 14 ‘బాలల దినోత్సవం’ నేపథ్యంలో ఎం.ఎన్.జె. కేన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుమారు 150 మంది చిన్నారులను పలకరించే ప్రయత్నం చేసింది సాక్షి మీడియా. ‘పొట్టేల్’. ‘సరిపోదా శనివారం’, ‘మన్మథుడు–2’ వంటి సినిమాల్లో నటించిన బాలతారలు ఖ్యాతి, సాన్విక, స్నితిక్, జాతీయ క్రీడాకారిణి కార్తీకలను తీసుకొచ్చి వారితో ముచ్చటించేలా చేసింది. చైల్డ్ సెలబ్రిటీలు వారి కోసం ఆటలు, పాటలు, డ్యాన్సులతో అలరించారు. అలాగే తమ ఆరోగ్యస్థితిని చైల్డ్ సెలబ్రిటీలతో పంచుకున్నారు.నాకు ప్రస్తుతం బాగానే ఉంది. డాక్టర్లు బాగా చూసుకుంటున్నారు. నాకు అల్లు అర్జున్ సినిమాలంటే ఇష్టం. నన్ను కలవడానికి వచ్చిన సెలబ్రిటీల కోసం పుష్ప సినిమా పాట పాడాను. నా కోసం సాన్విక కూడా పాట పాడింది. వారితో కలిసి మాట్లాడటం హ్యాపీగా ఉంది.– జశ్వంత్మేం సిద్దిపేట నుంచి వచ్చాం. హాస్పిటల్ అంటే నాకు భయం.. కానీ ఇక్కడ బాగానే ఉంది. సినిమాల్లో నటించే వారు మా కోసం రావడం సంతోషంగా ఉంది. నాకు కూడా సినిమాలంటే ఇష్టం. చివరగా శ్యాం సింగరాయ్ సినిమా చూశాను. త్వరగా నయమైతే స్కూల్‌కు వెళ్లాలనుంది. – రిషి ప్రియ, సిద్దిపేటచాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. నాకు చదువంటే చాలా ఇష్టం, ముఖ్యంగా మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. స్పైడర్‌మ్యాన్ నా ఫేవరెట్. సాన్విక అక్కతో ఆడుకున్నాను, లెక్కలు చెప్పాను. – ఓ చిన్నారి, జహీరాబాద్ బద్దీపూర్నాకు ఫుట్‌బాల్, దాగుడుమూతలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అవన్నీ ఆడుకోలేకపోతున్నాను. ఇలా బాధ పడుతున్న సమయంలో వీరంతా వచ్చి నాతో ఆడుకున్నారు. చాలా ముచ్చట్లు చె΄్పారు. నన్ను షూటింగ్‌కు తీసుకెళతానని కూడా చె΄్పారు. – చేతన్విభిన్న పేర్లతో పలు రకాల కేన్సర్లు ఉన్నప్పటికీ అవన్నీ హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సెస్, సాలిడ్ ట్యూమర్స్ అనే రెండు విభాగాల కిందకు వస్తాయి. చిన్నారుల్లో దీర్ఘకాలం పాటు హై ఫీవర్, చలి జ్వరం, బ్లీడింగ్, చిగుర్లలో రక్తస్రావం.. శరీరంలో, చాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వయసుకు తగ్గట్టు బరువు పెరగక పోవడం లేదా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలి. సాలిడ్ ట్యూమర్స్‌లో పిల్లలు అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, ఫిట్స్ రావడం జరుగుతుంది. చికిత్స పొందుతున్న చిన్నారులకు క్యాన్సర్‌కు సంబంధించిన అవగాహన అంతగా ఉండకపోవడం వల్ల ఎక్కువగా భయం ఉండదు. కానీ నిత్యం హాస్పిటల్స్ చుట్టూ తిరగడం వల్ల మానసిక ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో వారికోసం ప్రత్యేకంగా ప్లే స్టేషన్ ఏర్పాటు చేశాం. ఇలాంటి వ్యాధితోనే ఇబ్బంది పడుతున్న ఇతర చిన్నారులతో మమేకం చేస్తాం. – అనుదీప్, మెడికల్ ఆంకాలజిస్ట్అవగాహన వచ్చిందికేన్సర్ గురించి కొంచెం అవగాహన ఉంది. అందుకే గతంలోనే ఇలాంటి చిన్నారుల కోసం నేను రెండుసార్లు నా హెయిర్ డొనేషన్ చేశాను. కానీ ఇలాంటి ప్లేస్‌కు రావడం ఇదే మొదటి సారి. వీరి విల్ పవర్ చూశాక సమస్య ల నుంచి ఎలా రాణించాలో ఒక అవగాహన వచ్చింది. మళ్లీ మళ్లీ ఇక్కడికి వచ్చి ఈ చిన్నారులతో ఆడుకోవాలనుంది.– కార్తీక, నేషనల్ ప్లేయర్హెయిర్ డొనేట్ చేస్తానుఈ హాస్పిటల్లో చిన్నారులను చూశాకే కేన్సర్ ఎంత ప్రమాదకరమైనదో తెలిసింది. వారిని చూస్తుంటే ఏడుపొచ్చేసింది. నేను కూడా గతంలో ఇలాంటి వారి కోసం హెయిర్ డొనేట్ చేశాను. మళ్లీ కూడా చేయాలని ఇప్పుడు నిర్ణయించుకున్నాను. –ఖ్యాతి, సరిపోదా శనివారం ఫేమ్వీరిని చూశాక లోపల ఎంతో బాధ కలిగినప్పటికీ దానిని దాచి వీరందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నం చేశాను. పాటలు పాడాను, నాటు నాటు డ్యాన్స్ చేశాను. – సాన్విక, సరిపోదా శనివారంవీరందరినీ ఇలా చూస్తుంటే భయమేసింది. అందరికీ నయం అయి త్వరగా ఇంటికి పోవాలని కోరుకుంటున్నాను. అందరితో ఆడుకున్నాను, డ్యాన్సులు చేశాను. – స్నితిక్, పొట్టేల్ ఫేమ్భయం లేదు చికిత్సలు ఉన్నాయిఅనారోగ్యం అని తెలిశాక పరీక్షల నిర్థారణతో పాటు చికిత్సలో భాగంగా అన్ని సేవలు ఎం.ఎన్.జె. కేన్సర్ హాస్పిటల్లో ఉచితంగానే అందుతాయి. వ్యాధి దశను బట్టి చికిత్స కొనసాగుతుంది. ఈ చిన్నారులకు న్యూట్రిషన్ చాలా అవసరం. దీనికోసం కడల్స్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో మంచి న్యూట్రిషన్ అందిస్తున్నారు. చిన్నారుల వయస్సు, బరువును బట్టి ్రపొటీన్ ΄్యాకెట్స్, డ్రై ఫూట్స్ తదితరాలను అందిస్తున్నారు. కీమో, రేడియేషన్ వంటి చికిత్సల కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తున్న వారికి చుట్టుపక్కల విడిదికి కూడా సహాయం చేస్తున్నారు. కేన్సర్ వ్యాధి జన్యుపరంగా కూడా వస్తున్నప్పటికి అది 15 నుంచి 20 శాతం మాత్రమే. కేన్సర్లకు పలు రకాల కారణాలున్నాయి. కేన్సర్‌కు ఇతర దేశాల్లో అందిస్తున్న అధునాతన చికిత్సకు మనకు వ్యత్యాసం పెద్దగా ఏమీ లేదు. మన దగ్గర కూడా లేటెస్ట్ ట్రయల్స్ మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ వారమంతా లిటిల్ స్టార్స్ సందడిని సాక్షి యూట్యూబ్‌లో చూడటానికి QR కోడ్‌ను స్కాన్ చెయ్యండి – డి.జి. భవాని– హనుమాద్రి శ్రీకాంత్ఫొటోలు: అనిల్ కుమార్ మోర్ల -
Naila Grewal: నా యాక్టింగ్‌కి 'టెలివిజనే' నాకు ప్రేరణ!
నైలా గ్రేవాల్.. హిందీ నటి. ఇప్పుడు ఓటీటీ స్టార్ కూడా! బయటెంత ఫాలోయింగ్ ఉందో.. అంతకంటే ఎక్కువ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకు. ఇంకొన్ని వివరాల్లోకి వెళితే.. నైలా పుట్టి,పెరిగింది ఢిల్లీలో. మాస్ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. డాన్స్ నేర్చుకుంది. థియేటర్ స్కిల్స్ కూడా ఒంటబట్టించుకుంది. ముందు మోడలింగ్ వైపే అడుగులేసింది. కానీ ఆసక్తి అంతా యాక్టింగ్ మీదే ఉండింది. అందుకే వీలు చిక్కినప్పుడల్లా డాన్స్ బాలేలు చేస్తూ.. థియేటర్లో నటిస్తూ నటనా ప్రతిభను మెరుగుపరచుకునేది. అలాంటి ఒకానొక సందర్భంలోనే బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ నుంచి ఒక కబురు‡ వచ్చింది.. తను తీయబోయే ‘తమాషా’ సినిమాలో నైలాకు వేషం ఇస్తున్నట్టు. అది విన్న ఆమె సంతోషానికి అవధుల్లేవు. సెట్స్ మీదకు వెళ్లినప్పుడైతే కలా.. నిజమా అనుకుందట. మొదటి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అవకాశాలనూ అందిపుచ్చుకుంది. ‘బరేలీ కీ బర్ఫీ’, ‘భాంగ్డా పా లే’, ‘థప్పడ్’లలో నటించింది. ‘ఇష్క్ విష్క్ రిబౌండ్’లో నటిస్తోంది. తాజాగా ‘మామ్లా లీగల్ హై’ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నైలా లండన్‌లో లా చదివి.. ఢిల్లీలో వకీల్గిరీ ప్రారంభించిన లాయర్‌గా నటించింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఆమె నటనకే కాదు ఆమె అందానికి.. ఫ్యాషన్ స్టయిల్‌కి.. డాన్స్కీ అభిమానగణం ఉంది. అంతేకాదు ఆరోగ్యకరమైన జీవన శైలికి ఆమెను స్ఫూర్తిగా తీసుకునే అభిమానులూ ఉన్నారు. సినిమానైనా.. సీరియల్‌నైనా.. ఆ మాటకొస్తే కదిలే బొమ్మను ఫస్ట్ నేను చూసింది టెలివిజన్‌లోనే. అందుకే యాక్టింగ్‌కి టెలివిజనే నాకు ప్రేరణ, స్ఫూర్తి. సిల్వర్‌స్క్రీన్, స్మాల్‌స్క్రీన్, వెబ్‌స్క్రీన్.. ఏ స్క్రీన్ అయినా యాక్టర్స్‌కి ఒకటే. రీచింగ్‌లో తేడా తప్ప దేనికైనా టాలెంటే కొలమానం! - నైలా గ్రేవాల్. ఇవి చదవండి: లియాండర్ పేస్... ప్రముఖ డ్యాన్సర్! -
Parineeti Chopra: దేవుడా..! టెన్షన్లో ఉన్నప్పుడు ఈ హీరోయిన్ ఇలా చేస్తుందా!
సాధారణంగా మన జీవితాల్లో ఎన్నో కుదుపులు, చికాకులు, అడ్డంకులు వస్తూంటాయి. వీటిని కొందరు తేలికగా, మరికొందరు టెన్షన్‌గా తీసుకుంటారు. మరి ఆ టెన్షన్లో చాలామంది కొన్నిరకాల చేష్టలు చేస్తూంటారు. వాటిలో గోళ్లు కొరకడం, వేళ్లు విరవడం, తల పట్టుకోవడం, చికాకు పడుతూ ఉండటంలాంటివి. ఇక ఈ బాలీవుడ్ నటికి మాత్రం ఇలాంటి అలవాటుందని తెలుసా..! టెన్షన్లో ఉన్నప్పుడు.. భయమేసినప్పుడు పరిణీతి చోప్రాకు.. చేతివేళ్ల గోళ్లను కాదు.. ఆ గోళ్ల చుట్టూ ఉన్న స్కిన్‌ని కొరకడం అలవాటట! విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు చాలా భయపడుతుందట! ఆ భయంతో గోళ్ల చుట్టూ ఉన్న స్కిన్‌ని కొరుకుతుందని బాలీవుడ్ సోర్సెస్ ఇన్ఫో. పిజ్జా అంటే పరిణీతికి ప్రాణం. పగలు.. రాత్రి.. అర్ధరాత్రి.. అనే తేడా లేకుండా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పిజ్జా పనిపడుతుందట! ఇవి చదవండి: Priyamani: ప్రియ 'నటీమణి'.. పెర్ఫార్మెన్స్కి పర్యాయపదం ఆమె! -
Priyamani: ప్రియ 'నటీమణి'.. పెర్ఫార్మెన్స్కి పర్యాయపదం ఆమె!
'ప్రస్తుతం కమ్‌బ్యాక్ హీరోయిన్స్ హవా నడుస్తోంది. ఆ లిస్ట్‌లో ప్రియమణి మస్ట్! గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్కి పర్యాయపదం ఆమె! సినీప్రియులు.. వెబ్ వీక్షకులకు సుపరిచితురాలు. కథానాయికగా ఒక వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు వెబ్‌స్క్రీన్ మీదా షైనింగ్ స్టారే! ప్రియమణి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి బ్రీఫ్‌గా..' ప్రియమణి అసలు పేరు ప్రియా వాసుదేవన్ మణి అయ్యర్. అమె తండ్రి వాసుదేవన్ మణి అయ్యర్ .. బిజినెస్‌మేన్, తల్లి లతా మణి అయ్యర్.. జాతీయ స్థాయి మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. చదువుకునే రోజుల్లోనే ప్రియమణి పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ మోడల్‌గా మారింది. అలా ఆమె తమిళ దర్శకుడు భారతీరాజా దృష్టిలో పడింది. చిత్రసీమకు పరిచయం అయింది. ఆమె కెరీర్ తమిళ చిత్రం ‘కంగలాల్ కైదు సెయి’ తో ప్రారంభమైనప్పటికీ, మొదట విడుదలైంది మాత్రం ‘ఎవరే అతగాడు’ అనే తెలుగు సినిమానే. ఆ తర్వాత ‘సత్యం’ సినిమాతో మలయాళంలోనూ అడుగుపెట్టింది. చేసిన సినిమాలన్నీ విజయవంతమవడంతో టైట్ స్కెడ్యూల్స్తో బిజీ అయిపోయింది. ‘యమదొంగ’ , ‘శంభో శివ శంభో’, ‘రక్త చరిత్ర 2’, ‘రగడ’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంటే ‘క్షేత్రం’, ‘చారులత’ వంటి చిత్రాలతో నటిగా నిరూపించుకుంది. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో షారుఖ్ ఖాన్‌తో ఒక పాటలో నటించి బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్‌ని పెళ్లి చేసుకుంది. సినిమాల నుంచి కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంది. తిరిగి రియాల్టీ షోస్, వెబ్ సిరీస్‌తో మళ్లీ ప్రేక్షకులకు దగ్గరైంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో దేశ వ్యాప్తంగా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్‌ని పెంచిన సిరీస్ ‘ద ఫ్యామిలీ మేన్’. ఆమె నటించిన వెబ్ మూవీస్ ‘భామా కలాపం’, ‘భామా కలాపం 2’ రెండూ ఆహాలో స్ట్రీమింగ్‌లో ఉన్నాయి. పెళ్లి తరువాత నటనకు దూరంగా ఉండాలన్న ఆలోచన నాకు లేదు. భార్య వంటింటికే పరిమితమనే మనస్తత్వం నా భర్తకు లేదు. నన్ను చాలా సపోర్ట్ చేస్తారాయన! – ప్రియమణి. ఇవి చదవండి: Sharmila Yadav: డ్రోన్ దీదీ -
తేనె స్వరాల మైనా
ఇటీవల రవీంద్రభారతిలో జరిగిన ‘సుమధుర సంగీత విభావరి’లో మైన పాడిన పాటలు ప్రేక్షకుల చేత ‘వాహ్వా’ అనిపించాయి. పుట్టింది అమెరికాలో అయినా, చదువుతున్నది అక్కడే అయినా... చక్కటి తెలుగులో పాటలు పాడి ప్రేక్షకులను మెప్పించిన మైనతో ఇంటర్వ్యూ.... మీరుండేది అమెరికాలో కదా... కర్ణాటక శాస్త్రీయ సంగీతం గురించి ఎలా ఆసక్తి కల్గింది? అమెరికాలోని టీఎల్‌సీఏ ఆధ్వర్యంలో ఉగాది రోజు (2005) ఆలయాల్లో కాంపిటిషన్స్ జరిగాయి. అది ఫస్ట్‌గ్రేడ్ చదివే చిన్నారులకు. పలుకే బంగారమాయే... అనే కీర్తన, క్లాసికల్ సాంగ్స్ పాడాను. అందులో ప్రైజ్ వచ్చింది. ఇక అప్పటి నుంచి శాస్త్రీయ సంగీతమన్నా, కర్ణాటక సంగీతమన్నా, తెలుగు పాటలన్నా ఆసక్తి పెరుగుతూ వచ్చింది. మ్యూజిక్ క్లాసుల గురించి.... అమెరికాలో మల్లిక అనే టీచర్ దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. వేసవిలో ఇండియాకు వచ్చినప్పుడు ప్రముఖ గాయకులు నీహాల్ దగ్గర క్లాసికల్ ఫిల్మ్ సాంగ్స్, లైట్ మ్యూజిక్ మెళకువలు తెలుసుకుంటూ ఉంటాను. మీ గాత్రం ఎలాంటి సంగీతానికి నప్పుతుందని భావిస్తున్నారు? ఫాస్ట్‌బీట్ సాంగ్స్, పాప్ సాంగ్స్‌కు కూడా నా గాత్రం సూట్ అవుతుందని ప్రముఖ గాయకులు కొందరు అన్నారు. ఇప్పుడిప్పుడే అటువైపు అడుగులు వేస్తున్నాను. అమెరికాలో పుట్టి పెరిగినా చక్కటి తెలుగు మాట్లాడుతున్నారు... ఎవరికైనా ఇది సహజంగా వచ్చే సందేహమే (నవ్వుతూ). ఇంట్లో ఎలాగూ తెలుగు మాట్లాడతారు. తెలుగు సినిమాలపై ఉన్న ఆసక్తి కూడా తెలుగు భాష నేర్చుకునేలా చేసింది. సినిమాలు కేవలం వినోదానికి మాత్రమే కాదు, భాషను అభివృద్ధి చేస్తాయి. అది నా విషయంలో నిజమైంది. అందుకు అమ్మ మాధవి కూడా చేయూతనిచ్చింది. నేను ఏదైనా కావాలని, తినాలని అడిగినా అది తెలుగులోనే చెప్పితే కానీ చేసి పెట్టేది కాదు. దాంతో నాన్న (ఈదుల మురళి)ని అడిగి తెలుసుకుని మాట్లాడేదాన్ని. దీంతో తెలుగు భాష అలవాటైంది. సంగీతంలో రాణించేందుకు మీకు స్ఫూర్తి ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే చెప్పలేనుగాని ప్రోత్సాహం విషయానికి వస్తే మాత్రం మా తాతయ్య శ్రీనివాసరెడ్డి నన్ను ప్రోత్సహించారు. ఎప్పుడూ ‘చదువు..చదువు’ అనకుండా తల్లిదండ్రులు నన్ను సంగీతం వైపు ప్రోత్సహించారు. వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సహకరించటం వల్లే ఇంతవరకు రాగలిగాను. సంగీతం కాకుండా ఇతర ఆసక్తులు ఏమైనా ఉన్నాయా? టెన్నిస్ ఆడతాను, సైన్స్ కాంపిటీషన్స్‌లో, స్పెలింగ్ పోటీల్లో పాల్గొంటాను. పాఠశాలల్లో డిబేట్క్లబ్లో పాల్గొంటాను. మీ పేరు గురించి చెప్పండి... నా పేరుకు అర్థం ‘పాడే పక్షి’ అని. నేను పుట్టక ముందే ‘మైన’ అనే పేరు పెట్టాలని అమ్మ, నాన్న డిసైడ్ అయ్యారు. అలా పాడతానని ముందే ఊహించి, తెలిసే పెట్టారేమో(నవ్వుతూ) ఈవెంట్ ఎలా జరిగిందని భావిస్తున్నారు? గొప్ప వాళ్ల ఎదుట పాడే అవకాశం కలిగింది. వారి కామెంట్స్ మంచి స్ఫూర్తిని ఇచ్చాయి. ఈ ఈవెంట్ కొత్త ఎనర్జి ఇచ్చింది. ముఖ్యంగా ప్రముఖ సంగీత దర్శకులు ఆర్.పి. పట్నాయక్, గాయకులు నీహాల్, విశ్వ, ఉపాసకులు దైవజ్ఞశర్మల ప్రశంసలు ఉత్సాహాన్ని ఇచ్చాయి. హో... బాయ్ గీతావిష్కరణ చేశారు గదా? అలా మరో ఆల్బమ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఆదిత్య మ్యూజిక్ వారి ద్వారా ‘హో..బాయ్’ ఆడియో ఆల్బమ్ తీసుకువచ్చాను. అంతర్జాతీయ స్థాయిలో దీనికి ప్రాచుర్యం కలిగించేందుకు ఆదిత్య వారు ప్రయత్నిస్తున్నారు. సోలో ఆల్బమ్‌కి తయారవుతున్నాను. - కోన సుధాకర్‌రెడ్డి భగవానుడు అంటే..? భగవానుడంటే... భ అంటే భరించువాడు; గ అంటే బల ఐశ్వర్యములు కలవాడు, ఉద్ధరించువాడు; వ అంటే సమస్త భూతములను తనలో దాల్చినవాడు; ఆనుడు అంటే మానవులకుండే లక్షణాలయిన దోషం, సంకోచం, హేయగుణం మొదలయిన లక్షణాలు లేని పవిత్రమైనవాడు అని అర్థం. -
'జీవితాన్ని థ్రిల్‌గా గడపడం ఇష్టం'
ఒకరి కోసం ఒకరు వెయిటింగ్. మాటల్లో తేడా వస్తే... ఫైటింగ్. లీవు పెట్టి మరీ హస్కు. లవ్యూ చెప్పకుంటే లైఫే రిస్కు! అలకలొస్తే... క్షణమొక శిల. చేతివేళ్ల చిలకలిస్తే.. ఎదలోపల కోయిల. పెళ్లైన కొత్తలో ఇలాగే ఉంటుంది... 24 బై 7... బోలెడంత థ్రిల్! మూడు పూటలా కవిత్వం!! యంగ్ కపుల్ సాయి, వైష్ణవిలకు మాత్రం ఇవన్నీ సాదాసీదా థ్రిల్స్. హనీమూన్‌కి వీళ్లు ఎక్కడికెళ్లారో తెలుసా? సునామీలొచ్చే ఏరియాకి! పెళ్లికి ముందు సాయికిరణ్... వైష్టవికి పరిచయం చేసిన ఫ్రెండెవరో తెలుసా? హిస్ స్... చప్పుడు చేయకుండా... కదలండి, టువర్డ్స్... ‘మనసే జతగా...’ సినిమా స్టార్‌గా, సీరియల్ స్టార్‌గా ప్రేక్షకులకు చిరపరిచితులు సాయికిరణ్. సాఫ్ట్వేర్ ఇంజినీర్ వైష్ణవిని మూడేళ్ల క్రితం (జూన్ 24, 2010) పెళ్లి చేసుకున్నారు. ‘జీవితాన్ని థ్రిల్‌గా గడపడం ఇష్టం’ అని సాయికిరణ్ అంటే, ‘నాదీ అదే మాట’ అన్నారు వైష్ణవి. ‘ఒకరి పనిలో ఒకరు తలదూర్చకుండా ఒకరికొకరుగా ఉంటున్నాం’ అని చెప్పిన ఈ జంట కబుర్లే ఇవి. అలా మొదలైంది! ‘‘పెళ్లి చేసుకోవడానికి నూటతొమ్మిది మ్యాచ్‌లు చూశాను. ఏదో ఇంట్లో ఫలానా అమ్మాయి గురించి అనుకోవడం, నాకు తెలిసిన వారి గురించి ప్రస్తావనకు రావడం అలా...అలా సంఖ్య పెరిగిపోయింది! ఎవరూ నచ్చలేదు. కాని నాలుగేళ్ల క్రితం వైష్ణవి కలిసినప్పుడు మాత్రం నా మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందనిపించి, వెంటనే ఓకే చేశాను. అసలు మాకంటే ముందుగా మా ఇద్దరి కుటుంబాలూ కలుసుకున్నాయి. తర్వాత వైష్ణవి కలిసింది. అప్పటికే తను బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. ఇంటర్ నెట్లో చాట్ చేసుకోవడం, కుటుంబ వేడుకల్లో కలుసుకోవడం... అలా మొదలైంది మా ప్రేమ. పెళ్లికి మాత్రం ఏడాది పట్టింది. ఆ సమయం మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఏర్పడటానికి ఉపయోగపడింది’’ గతానుబంధాలను గుర్తు చేసుకున్నారు సాయికిరణ్. పాములబ్బాయి ‘‘సాయి చాలా కామ్‌గా ఉంటారు కాని, జోక్స్ చెప్పి బాగా నవ్విస్తారు. స్నేక్ షోలో కూడా అంతే!’’ అన్నారు వైష్ణవి. సాయికిరణ్ ‘ఫ్రెండ్స్ స్నేక్స్ సొసైటీ’లో మెంబర్ కూడా! పాములను మనుషుల నుంచి కాపాడి అడవుల్లో వదిలేస్తూ ఉంటారు. ఆ సందర్భం గురించి సాయికిరణ్ చెబుతూ- ‘‘ఇప్పటి వరకు 900 పైగా పాములను కాపాడి ఉంటాను. పెళ్లికి ముందు ఒకసారి వైష్ణవిని స్నేక్పార్క్కు తీసుకెళ్లాను. ఈ అమ్మాయి ధైర్యమేంటో చూద్దాం అని ఆరడుగుల పే...ద్ద పామును తీసుకొచ్చి, ‘పట్టుకో’ అన్నట్టుగా ఇచ్చాను. పెళ్లయ్యాక పామును తెచ్చి ఇంట్లో పెడితే, తట్టుకోవాలిగా..! అందుకని ముందే ఆ ప్రయత్నం చేశాను! తను ఏమాత్రం జంకకుండా దాన్ని ధైర్యంగా చేతుల్లోకి తీసుకుంది. అప్పుడనిపించింది తనదీ నా తరహా మనస్తత్వమే అని.’’ సంబరంగా చెప్పారు సాయికిరణ్!సీ‘రియల్’! ‘‘పెళ్లయిన ఆరునెలల వరకు ఉద్యోగరీత్యా నేను బెంగళూరులోనే ఉన్నాను. వారాంతంలో ఈయనే బెంగళూరు వచ్చేవారు. ఆరునెలల తర్వాత తనకు సీరియల్లో అవకాశం రావడంతో ఇద్దరం చెన్నైలో కాపురం పెట్టాం. అయితే, అక్కడ ఇద్దరికీ ఆర్థికంగా కటకట వచ్చింది. రోజులు ఎలా గడుస్తాయా అని భయపడ్డాం. అలాంటి సమయాల్లో భార్యాభర్తల మధ్య చికాకులు, కోపాలు చోటుచేసుకోవడం సహజం. అందుకు విరుద్ధంగా మేం మరింతగా కలిసిపోయాం. ఆ తర్వాత సాయికి హైదరాబాద్‌లో అవకాశాలు రావడంతో ఇద్దరం ఇక్కడకు షిఫ్ట్ అయ్యాం’’ అంటూ పెళ్లినాటి తొలిరోజులను గుర్తు చేసుకున్నారామె. ‘రిస్క్’ అంటే ఇష్టం తమకు అడ్వంచర్స్ అంటే ఇష్టమని చెబుతూ...‘‘రిస్క్ లేకపోతే లైఫ్‌లో థ్రిల్ ఉండదని నా అభిప్రాయం. పెళ్లయ్యాక హనీమూన్‌కి అందరిలాగే ఊటీ, కొడెకైనాల్ వెళ్లాలనుకోలేదు. సునామీ వచ్చిన ప్లేస్‌కి వెళ్లాలనుకున్నాం. అలా మాల్దీవులకు వెళ్లాం. అక్కడ మాస్క్ వేసుకొని, సముద్రంలోకి వెళ్లిపోయాం. సముద్రంలో రకరకాల చేపలు, జలచరాల మధ్య గడపడం భలే మజాగా అనిపించింది’’ అని సాయికిరణ్ చెబుతుంటే ‘‘మా లైఫ్‌లో అది బెస్ట్ పార్ట్. ఈయనకు ఇలాంటి ఆసక్తి ఉందనే పెళ్లికి ముందు ప్రత్యేకంగా స్విమ్మింగ్ కూడా నేర్చుకున్నాను’’ అంటూ భర్త ఆలోచనలకు తగ్గట్టుగా తనను తాను మార్చుకున్న విధానాన్ని తెలియజేశారు వైష్ణవి. పెళ్లి తర్వాత తనలో వచ్చిన మార్పుల గురించి సాయికిరణ్ ప్రస్తావిస్తూ -‘‘పెళ్లి తర్వాత పాములు పట్టడం అనే ప్రమాదకరమైన హాబీని కొంత తగ్గించాను. ఎందుకంటే నన్ను నమ్ముకొని నాకోసం ఓ వ్యక్తి ఉన్నారు అనిపించేది. అయితే వైష్ణవి మాత్రం ‘ఏంటిది, ఇప్పటినుంచే అంకుల్‌లాగా..! ఇలాగైతే త్వరలో మన ఇంటికి రాబోయే బుజ్జిపాపకు మీరు అడ్వెంచర్స్ ఎలా పరిచయం చేస్తారు?’’ అంటూ ఆటపట్టిస్తోంది’’ మురిపెంగా చెప్పారు. చూపులతోనే భావాలు పెళ్లయ్యాక భార్యాభర్తలకు ఒకరిమీద ఒకరికి అవగాహన కలగాలంటే ఏడాది కాలం పడుతుందని చెబుతూ- ‘‘నాకు నా స్పేస్‌లో ఉండటం అంటే అమితమైన ఇష్టం. ఫ్లూట్ వాయిస్తూనో, పగటికలలు కంటూనో, డ్రాయింగ్ వేస్తూనో, పాటలు పాడుకుంటూ నో గంటలు గంటలు గడిపేసేవాడిని. దాంతో తను మూడీగా మారిపోయేది. అది గ్రహించి, నా హాబీస్‌లో వైష్ణవినీ ఇన్వాల్వ్ చేయడం మొదలుపెట్టాక మా మధ్య ర్యాపో పెరిగింది. అలా వైష్ణవి అభిరుచులేంటో తెలిశాయి. తను సంగీతాన్ని ఇష్టపడుతుంది. యోగా చేస్తుంది. ఇంటర్నెట్లో చూసి రకరకాల వంటలు ట్రై చేస్తుంది. మా మధ్య ఎంత చనువు పెరిగినా, నన్ను తన అధీనంలో ఉంచుకోవాలి అని వైష్ణవి ఎప్పుడూ అనుకోలేదు’’ అని సాయికిరణ్ చెబుతుంటే ‘‘...అలా అనుకోవడం వెర్రితనం. అలా అనుకోకపోవడం వల్లనే తను బయటకు వెళ్లడం బాగా తగ్గించేసి, నాతోనే ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడ్డారు. అసలు భార్య భర్తను కంట్రోల్ చేయాలనో, భర్త భార్యను కంట్రోల్ చేయాలనో చాలామంది అనుకుంటారు. అలాంటి తలంపు ఉందంటే... వారి మీద నమ్మకం లేనట్టు. నమ్మకం లేని చోట బంధం బలహీనమే...’’ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పారు వైష్ణవి. ఇద్దరికీ సాహసాలు చేయడం, జీవితాన్ని థ్రిల్లింగ్‌గా మార్చుకోవడమంటే ఇష్టం. ఇద్దరికీ ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకొని మసలుకోవడం ఇంకా ఇష్టం. మాటల కన్నా కళ్లతో మాట్లాడుకోవడం మరీ ఇష్టం. భార్యాభర్తల మధ్య విభేదాలు ఎందుకు వస్తుంటాయో, అవి తమ మధ్య రాకుండా ఉండటానికి ఏం చేయాలో అర్థం చేసుకోవడానికి ముప్ఫై ఏళ్లు అవసరం లేదు, మూడేళ్లు చాలు అని తమ మాటల్లో తెలిపారు జంట. బయట రాజాలా ఉన్నా, ఇంట్లో పట్టించుకునేవారు లేకపోతే జీవితంలో ఏమీ లేనట్టే! ఇంట్లో స్నేహితురాలిలా ఉండే భార్య దొరకడమే ఆ దేవుడు ఇచ్చిన కానుకగా భావిస్తాను. - సాయికిరణ్ చాలామందిలా తన కాబోయే భార్య ఫొటోలు తీసి పెట్టుకోకుండా నా రూపాన్ని చిత్రించి, దానికో అందమైన ప్రేమలేఖ జతచేసి తను ఇష్టపడే పెర్ఫ్యూమ్ అద్ది గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చారు. ఇప్పటికీ అది పెద్ద కానుకగా భావిస్తాను. - వైష్ణవి సాయికిరణ్ నటి ంచిన... సినిమాలు: నువ్వేకావాలి, ప్రేమించు, మనసుంటే చాలు, డార్లింగ్ డార్లింగ్, సత్తా, హైటెక్ స్టూడెంట్స్, వెంగమాంబ, రామ్‌దేవ్, బుల్లబ్బాయ్, అజంతా, లెమన్, సువర్ణ, క్షణం, దేవీ అభయం. సీరియళ్లు: శివలీలలు, వెంకటేశ్వరవైభవం, సృష్టి, పురాణగాధలు, శ్రీ నారాయణ తీర్థులు, సుందరకాండ, ఆటోభారతి, సుడిగుండాలు, తంగం(తమిళం) - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
శాస్త్రబాలకు శుభాకాంక్షలు
ఈరోజుకొక ప్రత్యేకత ఉంది. కానీ ఆ ప్రత్యేకతను మన దేశానికిచ్చిన అమ్మాయికి... మనం ఏ విధమైన ప్రత్యేకతనూ ఇవ్వలేకపోయాం! ఈ ‘డే’ అనీ, ఆ ‘డే’ అనీ... డే బై డే... ఏదో ఒక ‘డే’ జరుపుకుంటూనే ఉన్నాం. ఆమె గుర్తుకొచ్చేలా మాత్రం ఒక్క ‘డే’నైనా ఘనంగా, గౌరవంగా ప్రకటించుకోలేకపోయాం. ఇవాళ ఆమె బర్త్ డే. పేరు హర్షాచావ్డా. భారతదేశపు మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ! పండంటి బిడ్డ పుడితే ‘పూజాఫలం’ అంటారు. ఆ మాటను సైన్స్ అంగీకరించదు కాబట్టి... హర్షాచావ్డాను ‘శాస్త్రవిజ్ఞాన విజయఫలం’ అనాలి. అంతటి విజయాన్ని ప్రసాదించిన ఈ ‘శాస్త్రబాల’ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? శాస్త్రం ‘సంతానప్రాప్తిరస్తు..’ అని దీవించింది! దాదాపు నాలుగుదశాబ్దాల కిందట వైద్య జీవశాస్త్రంలో జరిగిన ఈ అద్భుతం... అలుపెరగక జనాభా వృద్ధి చెందుతున్న దేశంలోనూ కొందరు అభాగ్య నిస్సంతు తల్లిదండ్రులకు ఆశాకిరణంగా నిలిచింది. అలా తొలిసారి ఉదయించిన ఆ ఆశాకిరణమే ‘హర్షా చావ్డా’. కృత్రిమ గర్భధారణ. (ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్.. మహిళ అండాన్ని, పురుషుడి శుక్రకణాన్ని సేకరించి, ఫలదీకరణ చేయించి, ఈ పిండాన్ని గర్భంలో ప్రవేశపెట్టే విధానం) ద్వారా భారతదేశంలో జన్మించిన తొలిబిడ్డ ‘హర్షాచావ్డా’. ఈ రోజు ఆమె పుట్టినరోజు. 1986 ఆగస్ట్ ఆరో తేదీన ముంబైలోని కేఈఎమ్ ఆసుపత్రిలో హర్షాచావ్డా జన్మించింది. నేటితో 27 ఏళ్లు నిండిన సందర్భంలో హర్ష గురించి, టెస్ట్‌ట్యూబ్ బేబీల ప్రస్థానం గురించిన వివరాలివి. మహారాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కింగ్‌ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్(కేఈఎమ్) ఆసుపత్రిలో ప్రతి రోజూ ఎంతో మంది పిల్లలు జన్మిస్తుంటారు. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆసుపత్రి డాక్టర్లు వేలాదిమంది గర్భిణులకు ఆసరాగా ఉంటారు. ఇలాంటి ఆసుపత్రికి హర్షాచావ్డా చరిత్రలో నిలబడిపోయే గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ ఆసుపత్రి డాక్టర్ ఇందిరా హిందూజా సంరక్షణలో శామ్‌జీ చావ్డా, మణిచావ్డా దంపతులకు హర్ష జన్మించింది. వీరిదొక సాధారణ మధ్యతరగతి కుటుంబం. సంతాన సాఫల్యం కోసం వైద్యులను ఆశ్రయించిన ఆ దంపతుల సమ్మతితో ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ ప్రక్రియను ప్రయోగించారు డాక్టర్ ఇందిర. అది విజయవంతం అయ్యి హర్ష జన్మించింది. పుట్టుక ఒక సంచలనం... భారతీయ వైద్యులు సాధించిన ఘనతగా, సృష్టికి ప్రతి సృష్టి అనదగ్గ ప్రక్రియలో జన్మించిన అద్భుతంగా హర్ష గొప్ప గుర్తింపు దక్కించుకుంది. అప్పటికే వందకోట్ల జనాభాకు దగ్గరపడ్డ దేశంలో పుట్టుకతోనే ప్రత్యేకమైన బేబీగా గుర్తింపు తెచ్చుకున్న హర్ష గురించిన ప్రతి అంశమూ చాలా ఆసక్తికరమే అయ్యింది. ఇప్పటికీ దేశంలోని తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీగా హర్షకు అంతే ప్రత్యేకత ఉంది. అయితే ఈ ప్రత్యేకత ఆమె వ్యక్తిగత జీవితానికి ఏ విధంగానూ ఉపయోగపడలేదు. అసహజమైన పద్ధతిలో జన్మించిన హర్ష మనదేశంలోని సహజమైన సమస్యలతో సహవాసం చేస్తోంది. ఆర్థికపరమైన ఇబ్బందులు, నిరుద్యోగం వంటి సమస్యలు హర్ష వంటి ప్రత్యేకమైన బేబీని కూడా వదల్లేదు. ముంబైలోని జోగేశ్వరి ప్రాంతంలో తన తల్లి మణితో కలిసి ఉంటోంది హర్ష. ఆమె తండ్రి మరణించాడు. దీంతో పెద్దదిక్కులేని ఈ కుటుంబానికి ఆసరా లేకుండా పోయింది. ముంబై యూనివర్సిటీ నుంచి కామర్స్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన హర్ష కుటుంబ పరిస్థితులతో ఏదో ఒక జాబ్ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నాలుగైదు వేల జీతాన్నిచ్చే ఉద్యోగాలను చేస్తూ వచ్చిన హర్ష రెండేళ్ల క్రితం నిరుద్యోగిగా మారింది. తల్లి అనారోగ్యం కారణంగా డ్యూటీకి వెళ్లలేకపోవడంతో ఉద్యోగం నుంచి తీసేశారని హర్ష చెప్పింది. ‘ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతిలో జన్మించాను అనే ప్రత్యేకత తప్ప నా జీవితంలో మరే ప్రత్యేకతా లేకుండా పోయింది..’అంటూ హర్ష నిర్వేదం వ్యక్తం చేసింది. హర్ష తల్లి కూడా ఇలాంటి భావననే వ్యక్తపరిచారు. ‘మేం పేదవాళ్లం. భర్త పోయాక పరిస్థితి మరింత దిగజారింది. దేశంలో పుట్టిన తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీకి తల్లిని అనే గొప్ప తప్ప నాకు మిగిలిందేమీ లేదు...’ అని మణి చావ్డా అన్నారు. ఇది జరిగి రెండేళ్లయింది. అయితే ఇప్పటికీ హర్షకు మంచి ఉద్యోగం వచ్చిన దాఖలాలు లేవు. చిన్న చిన్న ఉద్యోగాలతో, చాలీచాలని జీతంతో జీవితాన్ని నెట్టుకొస్తోంది. పుట్టిన రోజు పండగ కాలేదు! ఈ రోజు హర్ష పుట్టినరోజు! ఇది భారతీయ వైద్యశాస్త్రంలో ఒక ప్రత్యేకమైన రోజు. మన డాక్టర్ల నైపుణ్యానికి కొత్త గుర్తింపు తెచ్చిపెట్టిన రోజు. ఒక పండగ రోజు! ఈ విషయాన్నే హర్ష తల్లివద్ద ప్రస్తావిస్తే... ఇప్పుడు తన కూతురి పుట్టినరోజును పండగగా జరుపుకునే స్థాయిలో లేమని అంటారు. ఈ విధంగా భారతదేశంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి అయిన హర్ష పుట్టిన రోజు ఎటువంటి ప్రత్యేకత లేకుండానే గడిచిపోతోంది. మనమైనా ఈ శాస్త్రబాలకు శుభాకాంక్షలు చెబుదాం. - జీవన్ టెస్ట్‌ట్యూబ్ బేబీల జనాభా 50 లక్షలు..! ప్రస్తుతం ప్రపంచ జనాభా దాదాపు 700 కోట్లు. వీరిలో ప్రకృతి సహజంగా జన్మించిన వారు ఎంతమంది? అంటే 50 లక్షల మంది టెస్ట్‌ట్యూబ్ బేబీలను మైనస్ చేసుకోవాల్సిందే. మన దేశంలో మాత్రం టెస్ట్‌ట్యూబ్ బేబీల సంఖ్య బాగా తక్కువ. దేశ జనాభాతో పోల్చినప్పుడు వీరి నిష్పత్తి అంతర్జాతీయ స్థాయి కన్నా చాలా తక్కువగా ఉంది. దేశంలో టెస్ట్ట్యూబ్బేబీలు వేల సంఖ్యలో మాత్రమే ఉన్నారని ఒక అంచనా. ఇక్కడి వాతావరణ పరిస్థితులతో టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియ విజయవంతం అయ్యే అవకాశాలు తక్కువేనని నిపుణులు అంటారు. ఉద్యోగాన్ని సృష్టించడం సాధ్యం కాలేదా! సృష్టికి ప్రతిసృష్టి చేస్తూ... మనిషి తన మేధస్సుతో మరో మనిషికి జన్మనివ్వగలడేమో కానీ.. ఆ మనిషికి తగిన కనీస సదుపాయాలను కల్పించే స్థితిలో మాత్రం లేడని హర్షను చూస్తే అనుకోవాల్సి వస్తోంది. విద్యార్హతలున్నప్పటికీ, ఒక వ్యక్తికి ఉద్యోగాన్ని సృష్టించడం మనిషిని సృష్టించినంత సులభం కాదని అర్థమౌతోంది! ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ బాధ్యతను ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? క్రీడాకారుల కోటాలో, ఇంకా వివిధ కోటల్లో ప్రభుత్వం ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. అలాంటిది దేశంలోనే తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ అనే ప్రత్యేకతను కలిగి ఉన్న హర్షను ప్రభుత్వం కానీ, వైద్య శాస్త్ర ప్రముఖులు కానీ పట్టించుకోకపోవడం దురదృష్టకరం. హర్ష, ఇందిర లకే ఈ గుర్తింపు ఎలా దక్కిందంటే.. వాస్తవంగా చెప్పాలంటే భారతదేశంలో పుట్టిన తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ హర్ష కాదు! ‘దుర్గ’ అలియాస్ కనుప్రియా అగర్వాల్. ప్రపంచంలో తొలిసారి 1978 జూలై 25న లూసీ బ్రౌన్ కళ్లు తెరవగా... అదే ఏడాది అక్టోబర్ మూడున మనదేశంలో ‘దుర్గ’ జన్మించింది. ఇలా దేశంలో తొలి ఐవీఎఫ్ విజయాన్ని అందించింది డాక్టర్ సుభాష్ ముఖోపాధ్యాయ. కలకత్తాకు చెందిన సుభాష్ ఆవిష్కరించిన అద్భుతం ఆయన పాలిట ఒక శాపంగా మారింది. అవమానాలు ఎదురయ్యాయి. సామాజికంగా వేధింపులు ఎదురయ్యాయి. పశ్చిమబెంగాల్ ప్రభుత్వమే ‘దుర్గ’ జననాన్ని నైతికంగా ప్రశ్నిస్తుండటంతో మానసిక వేదనకు గురై ఉపాధ్యాయ 1981 జూన్19న ఆత్మహత్య చేసుకున్నారు. దుర్గ పుట్టిన ఎనిమిదేళ్ల తర్వాత హర్ష జన్మించింది. ఈ ప్రకియకు అధికారిక ధ్రువీకరణ రావడంతో హర్షాచావ్డా, గైనకాలజిస్ట్ ఇందిర హిందూజాలు రికార్డు పుటల్లో స్థానం సంపాదించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి యేటా 1.5 లక్షల మంది టెస్ట్‌ట్యూబ్ బేబీస్ జన్మిస్తున్నారని అంచనా. ఈ విషయంలో మనదేశంలో బాగా వెనుకబడి ఉంది. సాంఘికపరమైన పరిస్థితులు, ఖర్చు, సక్సెస్ రేటు.. ఈ మూడు విషయాలూ మన దేశంలో టెస్ట్ట్యూబ్బేబీస్ సంఖ్యను ప్రభావితం చేస్తోందని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐవీఎఫ్ పద్ధతిలో సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంది. 35 యేళ్లలోపు మహిళల్లో కూడా 33.1 శాతం ప్రయోగాలు మాత్రమే విజయవంతం అవుతున్నాయి. టెస్ట్‌ట్యూబ్ బేబీస్ హెల్త్ రిస్క్ గురించి అనేక అధ్యయనాలు జరిగాయి. కొన్ని అధ్యయనాలేమో ఐవీఎఫ్ పద్ధతిలో జన్మించిన వారి ఆరోగ్యస్థితి, ఆయుఃప్రమాణం సాధారణ మనిషిలాగే ఉంటుందని అభ్రిపాయపడ్డాయి. మరికొన్ని అధ్యయనాలు ప్రీమెచ్యూర్ డెలివరీకి అవకాశం ఉంటుందని, పుట్టిన పిల్లల ఎమోషన్స్, సైకలాజికల్ స్ట్రెస్, ఎక్కువ మెడిసిన్స్ వాడాల్సి రావడం వంటి సమస్యలు ఉంటాయని అభిప్రాయపడ్డాయి. -
పద్ధతులే దిద్దుతాయి!
పిల్లల పెంపకం చాలా ఈజీ అట! అచ్యుతుని గోపాలకృష్ణమూర్తి అంటున్నారు. ఈజీనా! ఇక్కడంతా కిందమీద అవుతుంటే... చలం ‘బిడ్డల శిక్షణ’ని,నామిని ‘ఇస్కూలు పుస్తకాల్ని’ ముందేస్కుని కూర్చుంటే... ఈయనేమో వెరీ సింపుల్ అని తేల్చేస్తారా? రస్నా యాడ్‌తో బుట్టలో వేసుకున్నంత మాత్రాన... ఏం చెప్పినా పిల్లలు వినేస్తారనుకోవడమేనా! ఈమాటకు చిన్న స్మైల్ ఇస్తారు లీల, గోపాలకృష్ణలు. ‘ఎవరు చెప్పమన్నారు?’ అని ఆ నవ్వులకర్థం! చెప్పకుండా ఎలా? ‘చెప్పాలి... కానీ చెప్పీచెప్పనట్లు, చేసీ చూపినట్లు.’ ఇదే... లీలపాఠం, గోపాలపాఠం... ఈవారం మన ‘లాలిపాఠం’ కూడా. ఎనభైలలో టీవీ సామాన్యులకు అందివచ్చిన రోజులవి. వాణిజ్య ప్రకటనలను కూడా ఆసక్తిగా చూసిన కాలం. చక్కగా సూట్, కోట్ ధరించిన క్రికెట్ దిగ్గజాలు, బాలీవుడ్ నటులు తమ హుందాతనానికి కారణం ఈ దుస్తులే అన్నట్లు పోజిచ్చేవారు... బ్యాక్‌గ్రౌండ్‌లో ‘ఓన్లీ విమల్’ అనే వాయిస్ వినిపించేది, అది విమల్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ ప్రకటన. అలాగే ఫిబ్రవరి దాటి మార్చినెలలో అడుగుపెట్టామంటే ‘పదేళ్లు నిండని పాప ఎర్రని సాఫ్ట్ డ్రింకు తాగుతూ ఆ గ్లాసును బుగ్గకు తాకించుకుని ‘ఐ లవ్ యూ రస్నా’ అనేది. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే... కలకాలం గుర్తుండిపోయిన ఈ ప్రకటనల రూపకర్త అచ్యుతుని గోపాలకృష్ణమూర్తి దంపతులు వాళ్ల పిల్లలను పెంచిన విధానమే ఈ వారం మన లాలిపాఠం. మీ పిల్లల వివరాలు చెప్తారా? లీల: మాకు ముగ్గురమ్మాయిలు, ఒకబ్బాయి. అనూరాధ, సుధారాణి, సుజాత, కల్యాణ్. యాడ్ ఏజెన్సీ నిర్వహణతోపాటు మైకా (ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్, అహ్మదాబాద్) విద్యాసంస్థను స్థాపించి శిక్షణనిచ్చిన యాడ్ ఎక్స్‌పర్ట్‌గా మీ పిల్లలను ఎలా తీర్చిదిద్దారు? కృష్ణమూర్తి: మేము పిల్లలను పెంచాం అంతే, ఇక తీర్చిదిద్దుకోవడం అంటారా... వాళ్లను వాళ్లే తీర్చిదిద్దుకున్నారు. నా ఉద్యోగం, వ్యాపారరీత్యా 45 ఏళ్లు గుజరాత్లో ఉన్నాం. పిల్లల వ్యక్తిత్వ వికాసానికి, సౌమ్యంగా వ్యాపారం చేసుకోవడానికి అనువైన గుజరాత్ సమాజం కూడా కారణమే అనుకుంటాను. గుజరాత్ సామాజిక వాతావరణం మనకు భిన్నంగా ఉంటుందంటారా? కృష్ణమూర్తి: అక్కడివాళ్లు వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు. ఎక్కువమంది చిన్నదో పెద్దదో వ్యాపారం చేస్తుంటారు. ‘లాభనష్టాల రిస్కుతో కూడిన వ్యాపారంకంటే చదువుకుని ఉద్యోగం చేసుకోవచ్చు కదా’ అని సలహా ఇస్తే... ‘చదువుకున్న వాళ్లకు మేము ఉద్యోగాలిస్తాం’ అంటారు. అహ్మదాబాద్ ఐఐఎంలో గుజరాతీలకంటే బయటి రాష్ట్రాల వాళ్లే ఎక్కువగా ఉంటారు. పిల్లలకు మీరు నేర్పించినదేమీ లేదంటారా? కృష్ణమూర్తి: తెలుగు మాట్లాడడం అలవాటు చేశాను. జాతీయస్థాయిలో రాణించడానికి ఇంగ్లిష్ మీడియంలో చదివించాను, గుజరాత్లో సెకండ్ లాంగ్వేజ్‌గా గుజరాతీ చదివారు. అయినా పిల్లలెవర్నీ తెలుగు భాషకు దూరం కానివ్వలేదు. మేము నేర్పించిందల్లా మాతృభాష మీద మమకారం, పెద్దల పట్ల గౌరవం, సంస్కారం మాత్రమే. పిల్లల మీద తల్లిదండ్రుల ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? కృష్ణమూర్తి: ‘యథారాజా తథా ప్రజా’ అన్నట్లు పిల్లల మీద నూటికి నూరు శాతం తల్లిదండ్రుల ప్రభావమే ఉంటుంది. పెద్దయ్యేకొద్దీ వాళ్లపరిధి విస్తరించి సమాజం ప్రభావం చూపిస్తుంది. కానీ ఆ ప్రభావం... తల్లిదండ్రులు ఇంట్లో ఎనిమిది- పదేళ్ల వరకు వేసిన పునాది మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ పునాదే పిల్లలను చక్కటి పౌరులను చేస్తుంది. ఇంట్లో సంస్కారవంతమైన వాతావరణం ఉండేటట్లు చూసుకోవడం, మంచి స్కూల్లో చేర్పించడం... ఈ రెండూ జాగ్రత్తగా చేస్తే చాలనుకునేవాణ్ని. మంచి స్కూలంటే..? కృష్ణమూర్తి: ఎక్కువ ఫీజులు వసూలు చేసే స్కూల్ కాదు. ఈ స్కూలుకి పిల్లలు ఏయే కార్లలో వస్తున్నారు... వంటివి కాదు. పాఠశాల మోటో ఏంటి, టీచర్ల దృక్పథం ఎలా ఉంది, మన సంస్కృతిని, నైతిక విలువలను నేర్పించే వాతావరణం ఉందా... వంటి విషయాలకు ప్రాధాన్యం ఇచ్చాను. ఏ తరంలోనైనా మధ్యతరగతి జీవితాలు పాటించే విలువలే అత్యున్నతమైన విలువలని నమ్ముతాను. ఆ విలువలు పాటించే స్కూల్లోనే చేర్పించాను. ఇక మిగిలినదంతా ఈవిడే చూసుకున్నది. మరి కాలేజ్ చదువులు... కోర్సుల గెడైన్స్ ఎలా ఉండేది? లీల: ఈయనకేమో పిల్లలు అహ్మదాబాద్ ఐఐఎమ్‌లో ఎంబిఎ చదివి మా యాడ్ ఏజెన్సీ చూసుకోవడానికి వస్తే బావుణ్నని ఉండేది. కానీ నలుగురిలో ఎవరితోనూ ఈ విషయం చెప్పలేదు. పిల్లలు ఏది చదువుతానంటే అదే చదివించాం. పెద్దమ్మాయి బిఎ, రెండో అమ్మాయి ఫ్యాషన్ టెక్నాలజీ, మూడవ అమ్మాయి ఫైన్ ఆర్ట్స్, యానిమేషన్ కోర్సులు చేశారు. అబ్బాయి బీటెక్ చేసి అమెరికాలో ఎం.ఎస్ చదివాడు. కృష్ణమూర్తి: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. దానిని ఎవరికి వారు తమకు ఇష్టమైనట్లు జీవించాలి, తమ ఆశలకు ఇష్టాలకు అనుగుణంగా మలుచుకోవాలి. అలా మలుచుకునే స్పేస్‌ని పిల్లలకు ఇవ్వాలి. ‘నేను ఫలానా వృత్తిలో ఉన్నాను కాబట్టి నువ్వు కూడా ఇదే మార్గంలో నడువు’ అని వాళ్ల దారిని మనం నిర్దేశించకూడదు. తమ అభిప్రాయాలకు విలువ ఉందనే భరోసా కలిగించాలి. తర్వాత వాళ్లకు అసంతృప్తి కలిగినప్పుడు ‘అంతా మీరే చేశారు’ అనే అవకాశం ఉంది. ఆ మాట అంటారని మాత్రమే కాదు, అనడానికి ముందు వాళ్లలో కలిగే సంఘర్షణ చిన్నదిగా ఉండదు. వీటన్నింటినీ ఆలోచించి వాళ్లకు ఇష్టమైన ప్రొఫెషన్ని ఎంచుకునే అవకాశాన్నిచ్చాను. పెళ్లి విషయంలోనూ పూర్తి స్వేచ్ఛనిచ్చాం, అన్నీ మేము కుదిర్చిన పెళ్లిళ్లే. మా పిల్లల భవిష్యత్తు, మా కుటుంబ నేపథ్యానికి సరిపోతాయనుకున్న సంబంధాలను షార్ట్ లిస్ట్ చేసి వాళ్ల ముందు పెడితే ఫైనల్ సెలెక్షన్ ఎవరికి వాళ్లే చేసుకున్నారు. బాల్యంలో కథల రూపంలో విలువలు చెప్పే ప్రయత్నం జరిగిందా? లీల: నేను పేదరాశి పెద్దమ్మ కథలు, విదుర నీతి, చందమామ కథలు చెప్పేదాన్ని. ఒకే పెంపకంలో పెరిగినప్పటికీ నలుగురిలో స్పష్టమైన మార్పులు కొన్ని ఉంటాయేమో!? లీల: నిజమే, పెద్దమ్మాయికి ఫ్రెండ్స్ ఎక్కువ. రెండో అమ్మాయి నా కొంగు పట్టుకుని తిరిగేది. మూడో అమ్మాయి గుంటూరులో మా అమ్మ దగ్గర పెరిగింది. ఒకరికొకరికి రెండు- మూడేళ్లు తేడానే. పెద్దమ్మాయికి, అబ్బాయికి మధ్య పదేళ్లు తేడా ఉండడంతో తమ్ముడి బాధ్యత తనే చూసుకునేది. కృష్ణమూర్తి: ఒకే నేపథ్యంలో పెరిగినప్పటికీ పిల్లల్లో మార్పులు అంటే... కోపం, శాంతం వంటి జెనెటికల్‌గా వచ్చే వాటిని ఎవరూ మార్చలేరు. కానీ నడవడిక, మాట, మన్నన వంటివి అమ్మానాన్నల నుంచే నేర్చుకుంటారు కాబట్టి నలుగురినీ ఒకే విధంగా ఉండేటట్లు పెంచవచ్చు. నా ఇన్నేళ్ల కెరీర్లో ‘కృష్ణమూర్తి ఈ విషయంలో అబద్ధం చెప్పాడు, లంచం తీసుకున్నాడు’ వంటి ఆరోపణలు చేసే వాళ్లు లేరు. అంత కచ్చితంగా ఉన్నాను కాబట్టి ఆ మాటను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఈ ప్రభావం పిల్లల మీద ఉండి తీరుతుంది. గుజరాత్ వ్యాపార సంస్కృతిని మీ పిల్లలూ అలవరుచుకున్నారా? లీల: అవును, ముగ్గురమ్మాయిలు కలిసి అహ్మదాబాద్‌లో రెండు బొటిక్స్(దుస్తులు డిజైనింగ్, స్టిచింగ్) పెట్టారు. పెద్దమ్మాయి పెళ్లయిన తర్వాత మిగిలిన ఇద్దరూ చూసుకునేవాళ్లు. ఇప్పుడు కుటుంబాలను చూసుకుంటూ ఇద్దరు హైదరాబాద్, ఒకరు చెన్నైలో ఉంటున్నారు. మా అబ్బాయి చిన్నప్పటి నుంచి టీవీ, రేడియోలను విప్పి సెట్ చేస్తుండేవాడు. అలాగే ఎలక్ట్రానిక్స్ వైపే వెళ్లాడు. కృష్ణమూర్తి: ఇష్టమైన పనిని ఎన్ని గంటలు చేసినా శ్రమ అనిపించదు. నేను పద్దెనిమిది గంటలు పని చేశానంటే నాకు ఇష్టమైన క్రియేటివ్ ఫీల్డు కాబట్టి చేయగలిగాను. అకౌంట్స్ సాల్వ్ చేయమంటే అరగంట కూడా కూర్చోలేను. అయితే ఆ తరంలో గుంటూరులో మా కుటుంబ నేపథ్యంలో నాకిలా గైడ్ చేసే వాళ్లు లేకపోవడంతో హిస్టరీ చదివి మ్యూజియంలో పనిచేశాను, తర్వాత క్యాలికో మిల్స్ ఉద్యోగం కోసం అహ్మదాబాద్ వెళ్లాను. ముప్పై ఏళ్లకు నాకు సరైన ప్రొఫెషన్ ఏదో తెలుసుకోగలిగాను. అంటే... పిల్లలకు కెరీర్ గెడైన్స్ అవసరమేనంటారా? కృష్ణమూర్తి: గెడైన్స్ అవసరమే కానీ అది ఆదేశం కాకూడదు. మంచిచెడుల గురించి గెడైన్స్ ఇచ్చినట్లే ఇది కూడ. ఎందుకంటే ఎవరి నడకను వాళ్లు నడవాల్సిందే, ఎవరి జీవితాన్ని వాళ్లు జీవించాల్సిందే. ఆ ఫిలాసఫీనే ఎప్పుడూ నమ్ముతాను. మా తరంతో పోల్చుకుంటే ఈ తరం పిల్లలకు ఎక్స్పోజర్ ఎక్కువ. ఎన్ని రకాల కెరీర్ ఆప్షన్లు ఉన్నాయనే సమాచారం వాళ్ల ముంగిట్లో ఉంటోంది. అందులో, తనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకునే అవకాశాన్ని వాళ్లకే ఇవ్వాలి. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి వాళ్ల నాన్నగారి నుంచి టైమ్ మేనేజ్మెంట్ నేర్చుకున్నారు. ఆయన రోజూ టంచన్‌గా తొమ్మిదిన్నరకు ఆఫీసులో ఉండేవారు. సొంత ఆఫీసే కదా అని ఆలస్యంగా వెళ్లడం ఆయనకు అలవాటు లేదు. ఇప్పటికీ ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. డెబ్బై ఏళ్ల వయసులో కూడా కన్సల్టెన్సీ నడుపుతున్నారు. ఆయన అబద్ధాలు చెప్పరు. పిల్లలకు అదే అలవాటైంది. - లీల మా అమ్మగారు, అత్తమామలు కూడా మాతోనే ఉండేవారు. అలా పిల్లలకు చిన్నప్పటినుంచి గ్రాండ్పేరెంట్స్కి సహాయం చేయడం అలవాటైంది. ఇవన్నీ వ్యక్తిని తీర్చిదిద్దే అంశాలే. మనం బాధ్యతగా ఉంటే పిల్లలూ అదే నేర్చుకుంటారు. మనం మన అమ్మానాన్నలను, ఇతరులను ఎవరినైనా కించపరిచేటట్లు మాట్లాడితే పిల్లలూ అదే నేర్చుకుంటారు. మా అమ్మగారితో ఈవిడ పోట్లాడిన సందర్భం ఒక్కటీ లేదు. భార్యాభర్తలు ఇంటిని యుద్ధరంగం చేయకుండా ప్రశాంతంగా ఉంచడంలో సక్సెస్ అయితే పిల్లల పట్ల బాధ్యతగా ఉన్నట్లే. - కృష్ణమూర్తి -
‘నియమ’గిరి మాట్లాడుతోంది!
సంజయ్‌కాక్ నిర్మించే డాక్యుమెంటరీలు ప్రత్యేకమైనవి. లోగడ నర్మదా వ్యాలీలో ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రజల గురించి ‘వర్డ్స్ ఆన్ వాటర్’ (2002), కాశ్మీర్ పోరాటాల నేపథ్యంతో ‘జష్న్-ఎ-ఆజాదీ’(2007) రూపొందించారు. తాజాగా ‘రెడ్ యాంట్ డ్రీమ్’ అనే డాక్యుమెంటరీని రూపొందించిన సంజయ్‌కాక్ ఇటీవల హైదరాబాద్‌లో వేర్వేరు ప్రాంతాలలో తన చిత్రాన్ని ప్రదర్శించారు. విద్యార్థులు, అధ్యాపకులు, ఫైన్ఆర్ట్ లవర్స్‌కు తన చిత్రాన్ని చూపారు. వారి స్పందనలను గ్రహించారు. మధ్యభారత్‌లో మావోయిస్టులు, తూర్పున ఒడిషాలో నియమగిరి పరిరక్షణ కోరుతున్న గిరిజనులు, పశ్చిమాన పంజాబ్ శ్రామికులు చేస్తూన్న ఉద్యమాల నేపథ్యంలో ఎవ్వరూ వెళ్లేందుకు సాహసించని ఆ అజ్ఞాత ప్రదేశాలకు వెళ్లి తమతమ ప్రపంచాలకోసం పోరాడుతున్న వారిని కలుసుకున్నారు. వారి వారి దృష్టి కోణాలతో సాధారణ ప్రజలు అంచనా వేసుకునేందుకు వీలుగా చిత్రాన్ని కళ్లకు కట్టారు. ‘రెడ్ యాంట్ డ్రీమ్’ ప్రదర్శనానంతరం ప్రేక్షకులతో సంభాషించారు. ఆ సారాంశం... ఈ డాక్యుమెంటరీ మావోయిస్టులకు మద్దతుగా తీశారా? ఈ డాక్యుమెంటరీ రూపొందించడంలో మావోయిస్టుల సహకారం ఉంది. లేకపోతే అక్కడకు వెళ్లలేను కదా. వెళ్లాక నా పని నేను చేసుకున్నాను. మావోయిస్టులు తాము రికార్డు చేసుకున్న వీడియోలనూ ఇచ్చారు. సందర్భాన్ని బట్టి కొన్ని క్లిప్పింగులు వాడాను. ఇది మావోయిస్టులను సమర్థిస్తుందా? అంటే చిత్రాన్ని చూసే ప్రేక్షకుడిని బట్టి ఉంటుంది. ఉదాహరణకు ‘జష్న్-ఎ-ఆజాదీ’ చిత్రాన్ని కాశ్మీర్ వేర్పాటువాది గిలానీ చూశారు. ‘సినిమా ఎలా ఉంది?’ అని ఒక జర్నలిస్టు ప్రశ్నించారు. ‘చాలా బాగా తీశాడు’ అని మెచ్చుకున్న గిలానీ ‘నీకెలాగుంది?’ అని అడిగారు. ‘ఒకవిధంగా చెప్పాలంటే అది మీకు చెంపపెట్టు వంటిది’ అని ఆ జర్నలిస్టు అన్నాడు! సో... డాక్యుమెంటరీ అనేది ఒక వర్క్ ఆఫ్ ఆర్ట్. చూపించినవన్నీ వాస్తవాలే. చూసినవారికి వారి వారి అవగాహనమేరకు వారున్న స్థానంలో, సమయంలో, తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ‘రెడ్ యాంట్ డ్రీమ్’ లో రెడ్ యాంట్ ఎవరు? డాక్యుమెంటరీలో ఒక సన్నివేశాన్ని గమనించి ఉంటారు. ఒక ఉద్యమకారుడు చెట్టుపైన ఉన్న ఎర్ర చీమలతుట్టెను కిందికి దించుతాడు. అత్యవసర పరిస్థితుల్లో అవి ఆహారం కూడా. ఈ ఎర్రచీమలు అతడిని చికాకు పెట్టడాన్ని గమనించి ఉంటారు. ప్రస్తుతం భారత సాయుధ ఉద్యమ వాతావరణంలో ‘చికాకు పెట్టడం’ అనే పీడకల ముగ్గురిని వెంటాడుతోంది. గిరిజనులు, వారిని వారి ప్రాంతాల నుంచి ఖాళీ చేయించేందుకు వచ్చిన ‘‘క్యాపిటల్’ను సమర్థిస్తూన్న ప్రభుత్వ బలగాలు, వీరిని ఎదుర్కొనే మావోయిస్టులు... ఈ ముగ్గురికీ మూడు కలలున్నాయి. ఒకరి కలలు మరొకరికి పీడకలలుగా పరిణమిస్తున్నాయి. ఇంతకు మించి చెపితే డాక్యుమెంటరీ రూపకర్తగా నేను విఫలం అయినట్లే. మార్మికత లేని ప్రక్రియ కళ అవుతుందా? గతంలో మీరు తీసిన డాక్యుమెంటరీలకు తాజాగా తీసిన ‘రెడ్ యాంట్ డ్రీమ్’కు తేడా ఏమైనా ఉందా? నేరేషన్, ఎడిటింగ్‌లలో మీరు ఎదుర్కొన్న సవాళ్లు? గతంలో తీసినవి ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి చెందినవి. ఆ ప్రాంతాలకు సంబంధించిన సమస్య కూడా తేలికగా అర్థమయ్యేదే. ‘రెడ్ యాంట్ డ్రీమ్’ మాత్రం బస్తర్, ఒడిషా, పంజాబ్...మూడు ప్రాంతాలకు సంబంధించినది. షూటింగ్ చేయడానికి ఎనిమిది వారాల సమయం తీసుకుంది. షూటింగ్ సంగతి ఎలా ఉన్నా...ఎడిటింగ్ టేబుల్ దగ్గర మాత్రం చాలా సమయం తీసుకుంది. (డాక్యుమెంటరీకి ఎడిటర్, సహ రచయిత తరుణ్) ఎడిటింగ్ ప్రక్రియ ఒక కొలిక్కి రావడానికి సంవత్సరం పట్టింది. దీంట్లో నెరెషన్ అనేది నేరుగా ఉండదు. ‘ఇది వీరికి సంబంధించిన కథ’ అని ప్రత్యేకంగా కొందరిని ఉద్దేశించినట్టు మాత్రమే అనిపించదు. అంతర్లీనంగా వీరి సమస్య ఒక్కటే అనే భావన ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఒక భావనను ఆవిష్కరించడానికి కొన్ని సంక్లిష్టమైన ప్రతీకలను కూడా వాడుకోవడం జరిగింది. గత డాక్యుమెంటరీలతో పోల్చితే నిజానికి ఇది కష్టమైన పనే. ఈ డాక్యుమెంటరీ నిర్మాణాత్మకమైన చర్చలకు దారి తీస్తుందని ఆశిస్తున్నాను. గోరఖ్‌పూర్, బెనారస్, ఢిల్లీ, చండీఘడ్, అమృత్సర్లలో జరిగిన చిత్రోత్సవాలలో ‘రెడ్ యాంట్ డ్రీమ్’కు మంచి స్పందన వచ్చింది. డాక్యుమెంటరీ చూస్తున్నంత సేపు నాకు, ప్రేక్షకులకు మధ్య ఒక మౌన సంభాషణ జరుగుతూనే ఉంటుంది. - పున్నా కృష్ణమూర్తి ********* ఒరిస్సాలోని నియమగిరి కొండలను స్థానిక గిరిజనులు దైవంగా భావిస్తారు. బాక్సయిట్ తవ్వకాలు కొనసాగితే కొండ కరిగిపోతుంది. మా మానాన మమ్మల్ని బతకనివ్వండి అంటున్నారు. వారు సాయుధులు కాకపోయినా విప్లవకారులే. అయితే స్థానికత ఆధారంగానే అంతర్జాతీయత ఉండాలి. - సంజయ్‌కాక్


