క‌రోనా: ఆసుప‌త్రిలో అమెరికా డాక్ట‌ర్ల డ్యాన్స్‌ | Watch,US Doctors Dance Video Went Viral | Sakshi
Sakshi News home page

క‌రోనా: ఆసుప‌త్రిలో అమెరికా డాక్ట‌ర్ల డ్యాన్స్‌

Apr 3 2020 5:57 PM | Updated on Mar 22 2024 10:49 AM

క‌రోనా రక్క‌సి వ్య‌తిరేక పోరాటాన్ని ముందుండి న‌డిపిస్తోంది వైద్యులే. త‌మ ప్రాణం పోయినా స‌రే కానీ ప‌ది మందిని కాపాడ‌ట‌మే ధ్యేయంగా ప‌ని చేస్తున్నారు. లాక్‌డౌన్ వేళ అంద‌రూ ఇంటిని అంటిపెట్టుకుని ఉంటే వాళ్లు మాత్రం ఆసుప‌త్రిలోనే గ‌డియారం ముల్లుతో పోటీ ప‌డుతు మ‌రీ విశేషంగా శ్ర‌మిస్తున్నారు. తాజాగా అమెరికాకు చెందిన‌ కొంత‌మంది డాక్ట‌ర్లు ఆసుప‌త్రిలో త‌మ‌కు దొరికిన‌ కాసింత‌ విరామ స‌మ‌యంలో డ్యాన్స్‌ చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సూప‌ర్ హీరోల‌కు థాంక్స్ చెప్తూ న‌టుడు హ‌గ్ జాక్‌మాన్ ఈ వీడియోను షేర్ చేశాడు. 

ఓరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివ‌ర్సిటీకి చెందిన‌ నలుగురు వైద్యులు ఓ పాపుల‌ర్ సాంగ్‌కు కాళ్లు క‌దుపుతున్నారు. ఇందులో ఒక డాక్ట‌ర్ ఈ వీడియోను తిరిగి షేర్ చేస్తూ ఇది మీ ముఖాల‌పై చిరున‌వ్వు తెప్పిస్తుంద‌ని ఆశిస్తున్నామ‌ని పేర్కొన్నాడు. ఇంత‌కు ముందు కూడా వీళ్లు ఆసుప‌త్రిలో డ్యాన్స్ చేస్తున్న వీడియోల‌ను సామాజిక మాధ్య‌మాల్లో పంచుకున్నారు. త‌ద్వారా క‌రోనాపై జ‌నాల‌కు అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు. కాగా, అమెరికాలో ఇప్పటివరకు 2 లక్షల 36 వేలకు పైగా కేసులు నమోదు కాగా, దాదాపు 6 వేల మంది మృత్యువాత పడ్డారు. నిన్న ఒక్కరోజే 900పైగా మంది మరణించటం క‌ల‌వ‌ర‌ప‌రిచే అంశం.

Advertisement
 
Advertisement
Advertisement