రష్యా ప్రభుత్వం క్రీడారంగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ ఆ దేశ ప్రజలకు కూడా ఫిట్‌నెస్ అనేది పెద్ద సమస్యగా మారింది. అనేక మంది ఊబకాయంతో బాధ పడుతున్నారు. అలాంటి వారిని వ్యాయామం వైపు ప్రోత్సహించేందుకు రష్యా రాజధాని మాస్కో నగరంలోని వ్యస్తవోచయ మెట్రో రైల్వే స్టేషన్ ప్రయాణికులు గుంజీలు తీసే ఓ యంత్రాన్ని ప్రవేశపెట్టింది. ఆ యంత్రం ముందు నిలబడి రెండు నిమిషాల్లో 30 గుంజీలు తీస్తే ఆ యంత్రం నుంచే ఉచితంగా మెట్రోలో ప్రయాణించేందుకు టిక్కెట్ లభిస్తుంది. రెండు నిమిషాల్లో గుంజీలు తీయలేదా 30 రూబుల్స్‌ను చెల్లించాల్సిందే. 30 రూబుల్స్ డాలర్ కన్నా కొంచెం తక్కువే అయినప్పటికీ రష్యా ప్రజలకు అవి చాలా ఎక్కువ.