దుబాయ్ : ఐపీఎల్ 2020 సీజన్‌కు సంబంధించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ థీమ్‌సాంగ్‌ను విడుదల చేసింది. ఆర్‌సీబీ.. ఆర్‌సీబీ.. అంటూ మొదలయ్యే పాట.. రోమాలు నిక్కబొడుచుకునేలా సాగింది. జట్టు కెప్టెన్‌గా కోహ్లితో మొదలయ్యే పాట .. డివిలియర్స్, ఆరోన్ ఫించ్, క్రిస్ మోరిస్, చహల్‌తో పాటు ఇతర ఆటగాళ్లు పాట పాడుతూ జట్టును ఎంకరేజ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్ లిస్ట్‌లో నిలిచింది. ఇప్పటికే ఆర్‌సీబీ ఐపీఎల్ థీమ్ సాంగ్‌ను 5లక్షలకు పైగా వీక్షించారు. ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్11 వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.