ఒక కుటుంబ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ సమాజాన్ని చీలుస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. బీజేపీ మాత్రం సుఖసంతోషాలను వ్యాపింపజేస్తూ, ప్రజలను కలుపుతోందని అన్నారు. దాడుల భయంలో గుజరాత్ నుంచి ఇతర రాష్ట్రాల ప్రజలు తరలిపోతున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ బుధవారం రాయ్‌పూర్, మైసూర్, దామో, కారౌలి–ధోల్పూర్, ఆగ్రా నియోజకవర్గాలకు చెందిన బీజేపీ కార్యకర్తలతో ముచ్చటించారు.