రాజకీయ అవసరాల కోసం తిరుమలలో చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణలు కలిసి కుట్రలు చేస్తున్నారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. కుట్రలో భాగంగానే టీటీడీలో అన్యమత ప్రచారమని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ అవసరాల కోసం తిరుమలను వాడుకుంటూ రాష్ట్రంలో మత కల్లోలం సృష్టించాలని వారు భావిస్తున్నట్లు ధ్వజమెత్తారు. టీటీడీలో ఇతర మతాలకు సంబంధించిన గుర్తులు ఉన్నాయంటూ ఆరోపణలు చేయడం తగదన్నారు. టీటీడీ వెబ్సైట్లో ఎలాంటి అన్యమత ప్రచారం జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై గూగుల్ నుంచి వివరణ కోరనున్నట్లు ఆయన తెలిపారు.
'రాజకీయ అవసరాల కోసమే చంద్రబాబు, రాధాకృష్ణలు కుట్రలు'
Dec 1 2019 7:18 PM | Updated on Dec 1 2019 7:26 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement