'నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది' | ysrcp leader visweswarreddy takes on cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

'నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది'

Sep 25 2017 3:45 PM | Updated on Mar 22 2024 11:07 AM

టీడీపీ నేతలు, మంత్రులు వక్రభాష్యాలు మానుకోవాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వై విశ్వేశ్వర్‌రెడ్డి హితవు పలికారు. సాగునీటి ప్రాజెక్టులకు ఆరాధ్యులుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని, వారు కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు. టీడీపీ నేతలు దిగజారుడు మాటలు మానుకోవాలని మండిపడ్డారు. సాగు నీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాయలసీమంలో దాదాపుగా జలయజ్ఞం పనులు పూర్తయ్యాయని, రాయలసీమ గురించి మాట్లాడే నైతిక అర్హత టీడీపీకి లేదని మండిపడ్డారు. మొదట దఫా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమకు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రస్తుతం నీటి హక్కులు కోల్పోయామంటే దానికి కారణం చంద్రబాబేనని ధ్వజమెత్తారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement